సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
వారణాసిలో ఖాదీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న కెవిఐసీ. మార్జిన్ మనీ సబ్సిడీ కింద 2215 యూనిట్లకు రూ.77.45 కోట్లు విడుదల
Posted On:
18 MAR 2023 7:33PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రాష్ట్ర స్థాయి ఖాదీ ఎగ్జిబిషన్‌ను కెవిఐసి చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ మార్చి 17, 2023 నుండి మార్చి 26, 2023 వరకు 10 రోజుల పాటు ఉంటుంది.ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పిఎంఈజీపి) కింద రూ.227.21 కోట్ల రుణం మంజూరుకు గాను సెంట్రల్ మరియు ఈస్ట్ జోన్‌లోని 2215 మంది లబ్ధిదారులకు రూ.77.45 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని చైర్మన్ విడుదల చేశారు. ఇది కెవిఐసీ ద్వారా అమలు చేయబడుతున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఉపాధి ఆధారిత ఫ్లాగ్‌షిప్ పథకం.
వారణాసిలోని మారుయి సింధౌరలో గ్రామోద్యోగ్ వికాస్ సమితికి చెందిన కుండలు మరియు తోలు కళాకారులకు 180 ఎలక్ట్రిక్ పాటర్స్ వీల్స్ మరియు 75 ఫుట్‌వేర్ రిపేరింగ్ టూల్‌కిట్‌లను కూడా శ్రీ కుమార్ ఖాదీ పంపిణీ చేశారు. అలాగే అక్బర్‌పూర్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన 30 మంది తేనెటీగల పెంపకందారులకు 300 బీ బాక్స్‌లను పంపిణీ చేశారు.
సంపన్నమైన, బలమైన, స్వావలంబన కలిగిన మరియు సంతోషకరమైన దేశాన్ని నిర్మించడానికి కెవిఐసీ యూనిట్లను విజయవంతంగా నడుపుతున్నందుకు లబ్ధిదారులను చైర్మన్ అభినందించారు.
**********
(Release ID: 1908623)