నౌకారవాణా మంత్రిత్వ శాఖ
పశ్చిమ బెంగాల్‌లో మతువా ధర్మ మహా మేళాను సందర్శించిన శ్రీ సర్బానంద సోనోవాల్
మతువా సమాజ చైతన్యవంతమైన సంస్కృతిని వీక్షించేందుకు మహామేళాను సందర్శించవలసిందిగా ప్రజలకు పిలుపిచ్చిన శ్రీ సోనోవాల్
Posted On:
18 MAR 2023 6:46PM by PIB Hyderabad
శుక్రవారం నాడు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలో థాకూర్‌బరీ, శ్రీథామ్ థకుమాగర్‌లో జరుగుతున్న పవిత్ర మతువా ధర్మ మహామేళాను సందర్శించారు. ఈ మేళాను శ్రీశ్రీ హరిచంద్ థాకూర్‌జీ 212 జయంతిని జరుపుకునేందుకు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రితో పాటు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ కలిసి వెళ్ళారు. ఆయన మతువా మహాసంఘ సంఘపతి కూడా.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీశ్రీ హరిచంద్ థాకూర్‌జీ జయంతి వంటి పవిత్ర సందర్భంలో తాను ఇక్కడ ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన ఆమూల్య సేవలను, తోడ్పాటును ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
చైతన్యాన్ని పెంచడం, విద్యావ్యాప్తి, సమాజంలో మహిళల పరిస్థిని మెరుగుపరిచేందుకు ఆయన చూపిన అంకిత భావం మనం ధర్మమార్గంలో కొనసాగేందుకు ఒక ప్రకాశవంతమైన ఆశా జ్యోతిగా ఉంటుందన్నారు. మతువా ధర్మ మహా మళా మతువా సమాజ చైతన్యవంతమైన సంస్కృతిని గొప్పగా ప్రదర్శించే ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్‌ను ప్రతిఫలిస్తుందని మన ఆదరణీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ భావిస్తున్నారని అన్నారు.
అంతకు ముందు, మతువా ధర్మ మహామేళా గురించి శంతను ఠాకూర్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ, #మతువామహామేళా2023 అన్నది మతువా సమాజ చైతన్యవంతమైన సంస్కృతిని ప్రదర్శించే ముఖ్య ఘటన. ఈ మేళాను దర్శించవలసిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయ, సేవల మార్గాన్ని చూపినందుకు శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్‌జీకి మానవాళి ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
శ్రీధామ్ తాకుమాగర్లో మేళా అన్న మతపరమైన దివ్యత్వం, భిన్నత్వంలో సామరస్యం & శాంతికి సంబంధించిన అనుభవాన్ని ఇస్తుందని శ్రీ శంతను ఠాకూర్ అన్నారు.
ఈ మేళాను 19 మార్చి నుంచి 25 మార్చి 2023 వరకు అఖిల భారత మతువా మహాసంఘ నిర్వహిస్తోంది.
***
(Release ID: 1908611)
Visitor Counter : 156