ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ. 17 కోట్ల పన్ను ఎగువతకు సంబంధించి మోసపూరిత ఇన్‌వాయిసింగ్ రాకెట్‌ను వెలికి తీసి, 2ని అరెస్టు చేసిన డిల్లీ దక్షిణ సిజిఎస్‌టి
Posted On:
18 MAR 2023 4:25PM by PIB Hyderabad
రూ. 17 కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ( ఐటిసి -వస్తువుల, సేవల పన్ను)ను మోసపూరితంగా క్లెయిమ్ చేస్తున్న రాకెట్‌ను దక్షిణ ఢిల్లీ కమిషనరేట్ ఛేదించింది.
అనర్హమైన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు ఈ లంకెలో వస్తువులు లేకుండానే ఇన్‌వాయిస్‌లను ఉత్పత్తి చేసేందుకు మాత్రమే సృష్టించిన నిర్ధిష్ట బోగస్ సంస్థలకు సంబంధించి దక్షిణ ఢిల్లీ కేంద్ర వస్తువులు, సేవల పన్ను (సిజిఎస్‌టి) కమిషనరేట్ అధికారులు నిర్ధిష్ట నిఘాను అభివృద్ధి చేశారు.
నమోదైన 03 బోగస్ సంస్థలు/ కంపెనీలు ఆవరణలపై తనిఖీలు నిర్వహించారు. దక్షిణ డిల్లీ సిజిఎస్‌టి కమిషనరేట్ పరిధిలో నమోదు చేసుకున్న ఈ సంస్థలు - ఎం/ ఎస్ నెక్స్‌జెన్ బుసికార్ప్, ఎం/ ఎస్ ఎక్స్ఇఎల్ ఇన్ఫర్మాటిక్స్, ఎం/ ఎస్ జిడబ్ల్యు ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లు మోసపూరిత ఇన్‌వాయిసింగ్, సర్కులర్ ట్రేడింగ్ (ఒకే రకమైన కొనుగోలు, అమ్మకాలకు సంబందించిన ఆర్డర్లను ఒకే సమయంలో, అవే సంఖ్యలతో నమోదు చేయడం)లో నిమగ్నమై ఉన్నాయి. పన్ను చెల్లింపుదారుల ఆవరణల నుంచి నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంస్థల లావాదేవీలకు సంబంధించి ఇప్పటి వరకూ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులు దాదాపు రూ. 17 కోట్ల మేరకు పన్ను ఎగవేత బయిటపడింది. అంతర్లీనంగా ఎటువంటి వస్తువుల సరఫరా లేకుండానే మోసపూరిత ఐటిసిని ప్రవేశపెట్టడంలో తన పాత్రను ప్రొప్రైటర్/ డైరెక్టర్ తన ఒప్పుకోలు ప్రకటనలో అంగీకరించార.
ఈ బోగస్ సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఖజానాను మోసపుచ్చడమ కాక సిజిఎస్‌టి చట్టం 2017లోని సెక్షన్ 132 (1)(బి), 132 (1) (సి)కింద నిర్దేశిత నేరాలకు పాల్పడ్డారు. ఇవి గుర్తించదగిన, బెయిల్‌కు అర్హం కాని నేరాలు. ఇద్దరు వ్యక్తులు - సంజయ్ కుఆమర్ శ్రీవాత్సవ, సునీల్ గులాటీలను 17.03.2023న అరెస్టు చేశారు. నిందితులను డ్యూటీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరచగా, వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను విధించారు.
తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉంది.
***
(Release ID: 1908449)
Visitor Counter : 146