రైల్వే మంత్రిత్వ శాఖ

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ మధ్య తొలి భారత్ గౌరవ్ రైలు రేపటి నుండి ప్రయాణాన్ని ప్రారంభించనుంది

Posted On: 17 MAR 2023 5:59PM by PIB Hyderabad

·       భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన ప్రదేశాలను అనుసంధానించడం ద్వారా దేశంలో పర్యాటకాన్ని ఈ రైలు ప్రోత్సహిస్తుంది.

·       ఈ రైలును ఐఆర్‌సిటీసి నిర్వహిస్తుంది. మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు బోర్డింగ్ / డి-బోర్డింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

న్యూఢిల్లీ; 17.3.23

దేశంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన ప్రదేశాలను రైలు ద్వారా అనుసంధానించడం ద్వారా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ 'భారత్ గౌరవ్ రైళ్లను' ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఈ భారత్ గౌరవ్ రైళ్లు తమ 26 ట్రిప్పులు ద్వారా 22 రాష్ట్రాలు మరియు 04 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేశాయి.

 

ఈ వినూత్న చొరవతో, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటీసి) రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి "పుణ్య క్షేత్ర యాత్ర: పూరి - కాశి - అయోధ్య"ను ప్రారంభించనుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ మధ్య మొదటి భారత్ గౌరవ్ రైలు. ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు ప్రయాణీకులను దేశంలోని తూర్పు & ఉత్తర భాగంలోని కొన్ని పురాతన మరియు ముఖ్యమైన ప్రదేశాలకు తీసుకువెళుతుంది.

 

రైలులోని యాత్రికులు ఈ యాత్ర ద్వారా పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్‌లను 8 రాత్రులు / 9 రోజుల వ్యవధిలో సందర్శిస్తారు. రైలు ప్రయాణికులందరికీ ప్రయోజనం చేకూర్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 ముఖ్యమైన స్టేషన్లలో బోర్డింగ్ (డి-బోర్డింగ్) సౌకర్యం కల్పించబడింది. ఈ యాత్ర కోసం అన్ని సీట్లు బుక్ చేయబడ్డాయి. ప్రయాణికులు అన్ని స్టాపింగ్ స్టేషన్‌ల నుండి సదుపాయాన్ని పొందడంతో మొదటి ట్రిప్‌కు భారీ స్పందన లభించింది.

 

రైలు ప్రయాణీకులకు వారి ప్రయాణ సంబంధిత అవసరాలన్నింటిని చూసుకోవడం ద్వారా రైలు సంపూర్ణ సేవలను అందిస్తుంది. టూర్ ప్యాకేజీలో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్ మరియు డిన్నర్ - ఆన్-బోర్డ్ మరియు ఆఫ్-బోర్డ్ రెండూ), సేవలు వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్‌లతో పాటు రైలులో భద్రత కోసం అన్ని కోచ్‌లలో సిసిటీవీలు ఏర్పాటు చేయబడ్డాయి. అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సదుపాయం, ప్రయాణ బీమా మరియు సహాయం కోసం ప్రయాణంలో ఐఆర్‌సిటీసి టూర్ మేనేజర్‌లు అందుబాటులో ఉంటారు.

 

 

గమ్యస్థానాలు మరియు సందర్శించే ప్రదేశాలు

పూరి

 జగన్నాథ స్వామి ఆలయం

కోణార్క్

సూర్య దేవాలయం మరియు బీచ్

గయా

విష్ణు పాద ఆలయం

వారణాసి

కాశీ విశ్వనాథ్ ఆలయం & కారిడార్కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణా దేవి ఆలయంసాయంత్రం గంగా హారతి

అయోధ్య

సరయు నది వద్ద రామజన్మ భూమిహనుమాన్గర్హి మరియు హారతి

ప్రయాగ్రాజ్

త్రివేణి సంగమంహనుమాన్ మందిర్ మరియు శంకర్ విమాన మండపం

 

భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ తదుపరి ప్రయాణం ఇదే కూర్పుతో 18 ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమవుతుంది.

 

 

***



(Release ID: 1908104) Visitor Counter : 326


Read this release in: English , Urdu , Hindi