మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

రేపటి నుంచి 'సాగర్ పరిక్రమ నాల్గవ దశ' ప్రారంభం


మత్స్యకారులు, ఇతర భాగస్వాముల సమస్యలను పరిష్కరించడానికి,  భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు కార్యక్రమాలద్వారా వారి ఆర్థిక అభ్యున్నతిని సులభతరం చేయడానికి ఉద్దేశించిన ఒక చొరవ సాగర్ పరిక్రమ.

Posted On: 17 MAR 2023 11:56AM by PIB Hyderabad

1.‘సాగర్ పరిక్రమ నాల్గవ దశ ' యాత్ర కర్ణాటకలో 2023 మార్చి 18న ఉత్తర కన్నడ, 19 మార్చి 2023న ఉడిపి, ఆ తర్వాత దక్షన్ కన్నడ వరకు రెండు రోజుల పాటు కొనసాగుతుంది.

 

2.ఈ కార్యక్రమంలో, ప్రగతిశీల మత్స్యకారులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకం, కెసిసి అండ్ రాష్ట్ర పథకానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు / అనుమతులను ప్రదానం చేస్తారు.

 

3.పిఎంఎంఎస్ వై పథకం, రాష్ట్ర పథకాలు, ఈ-శ్రమ్, ఎఫ్ ఐ డీఎఫ్, కేసీసీ తదితర అంశాలపై సమాచారాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోలు, జింగిల్స్ ద్వారా మత్స్యకారుల లో విస్తృతంగా ప్రచారం చేస్తారు.

 

4.కన్నడలో సాగర్ పరిక్రమపై పాటను విడుదల చేయనున్నారు.

 

5.ఈ ప్రయాణంలో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యశాఖ ప్రతినిధులు, చేపల పెంపకందారులు, పారిశ్రామికవేత్తలు, భాగస్వాములు, వృత్తి నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారు.

 

కర్ణాటక రాష్ట్రం లో సాగర్ పరిక్రమ నాలుగో దశ రెండు రోజుల పాటు జరగనుంది. మార్చి 18, 2023 న ఉత్తర కన్నడ , 19 మార్చి 2023 న ఉడిపి, తరువాత దక్షణ్ కన్నడ వరకు మొత్తంగా మూడు కోస్తా జిల్లాల్లో 10 ప్రాంతాల మీదుగా సాగర్ పరిక్రమ నాలుగో దశ నిర్వహిస్తారు.

 

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ , సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్.

మురుగన్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి, కర్ణాటక ప్రభుత్వ మత్స్య, రేవులు, అంతర్గత జల రవాణా మంత్రి, కర్ణాటక ప్రభుత్వ కార్మిక మంత్రి, కర్ణాటక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, కన్నడ, నగర మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు కార్వార్, ఉత్తర కన్నడ జిల్లా చేపల మార్కెటింగ్ సమాఖ్య అధ్యక్షుడు కార్వార్, చైర్మన్ కర్ణాటక స్టేట్ వెస్ట్రన్ కన్జర్వేషన్ టాస్క్ ఫోర్స్, బెంగళూరు, శాసనసభ స్పీకర్లు, సభ్యులు, శాసన మండలి సభ్యుడు పార్లమెంటు సభ్యుడు, భారత ప్రభుత్వ మత్స్యశాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్, ఐ.ఎ.ఎస్, భారత ప్రభుత్వ మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ జె.బాలాజీ, కర్ణాటక ప్రభుత్వ పశుసంవర్ధక, మత్స్యశాఖ కార్యదర్శి శ్రీమతి సల్మా కె.ఫహల్మ్, భారత ప్రభుత్వ మత్స్యశాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, కర్ణాటక ప్రభుత్వ మత్స్యశాఖ డైరెక్టర్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, కర్ణాటక మారిటైమ్ బోర్డు సీనియర్ అధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యాత్రలో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యశాఖ ప్రతినిధులు, చేపల పెంపకందారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, భాగస్వాములు, వృత్తి నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు కూడా పాల్గొంటారు.

 

ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మత్స్యకారులకు, ముఖ్యంగా తీరప్రాంత మత్స్యకారులు, చేపల వేట కార్మికులు, పెంపకందారులు, యువ మత్స్య ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి మత్స్య సంపద పథకం, కెసిసి, రాష్ట్ర పథకానికి సంబంధించిన సర్టిఫికెట్లు/ అనుమతులను ప్రదానం చేస్తారు. పీఎంఎంఎస్ వై పథకం, రాష్ట్ర పథకాలు, ఈ-శ్రమ్, ఎఫ్ ఐడీఎఫ్, కేసీసీ తదితర పథకాల గురించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోలు, జింగిల్స్ ద్వారా మత్స్యకారుల లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. కన్నడలో సాగర్ పరిక్రమపై ఓ పాటను కూడా విడుదల చేస్తారు.

 

దేశంలోని తీరప్రాంత ప్రజల ముఖ్యంగా సముద్ర మత్స్యకారుల జీవన ప్రమాణాలు, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి మెరుగైన విధానాన్ని రూపొందించడంలో సాగర్ పరిక్రమ ప్రభుత్వానికి సహాయపడుతుంది. మత్స్యకార కమ్యూనిటీల వివిధ అంతరాలను పూడ్చడం, మత్స్యకార గ్రామాల అభివృద్ధి, పర్యావరణ విధానం ద్వారా స్థిరమైన ,బాధ్యతాయుతమైన అభివృద్ధిని నిర్ధారించడానికి ఫిషింగ్ హార్బర్లు ,ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ,సృష్టించడం మొదలైన లక్ష్యాలతో దేశ ఆహార భద్రత కోసం సముద్ర మత్స్య వనరుల వినియోగం, తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ మధ్య సుస్థిర సమతుల్యతపై సాగర్ పరిక్రమ దృష్టి సారిస్తుంది.

 

కర్ణాటక రాష్ట్రంలో 5.74 లక్షల హెక్టార్ల మంచినీటి వనరులు ఉన్నాయి. ఇందులో 3.02 లక్షల హెక్టార్ల చెరువులు, కుంటలు, 2.72 లక్షల హెక్టార్ల రిజర్వాయర్లు, 8,000 హెక్టార్ల ఉప్పునీటి వనరులు, 27,000 చ.కి.మీ ఖండాంతర షెల్ఫ్ వైశాల్యంతో 320 కి.మీ సముద్రతీరం ఉంది. కర్ణాటకలోని తీరప్రాంత జిల్లాలలో దక్షిణ కన్నడ 40 శాతం చేపల వేట ను కలిగి ఉండగా, ఉత్తర కన్నడలో 31 శాతం, ఉడిపిలో 29 శాతం చేపల వేట ఉంది. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో మంగళూరు, మాల్పే ఫిషింగ్ హార్బర్లు ప్రధానమైనవి. రాష్ట్రంలో 9.84 లక్షల మంది మత్స్యకారులు, 729 మత్స్యకార సహకార సంఘాలు (132- మెరైన్, 597- లోతట్టు) ఉన్నాయి.

 

రాష్ట్రం నుండి చేపల ఉత్పత్తి 2021-22 సంవత్సరానికి భారతదేశ మొత్తం చేపల ఉత్పత్తిలో 6.6% దోహదం చేసింది మొత్తం చేపల ఉత్పత్తిలో 3 వ స్థానంలో ఉంది, సముద్ర చేపల ఉత్పత్తిలో 5 వ స్థానం , ఇన్లాండ్ చేపల ఉత్పత్తి 7 వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో తలసరి చేపల వినియోగం 8.08 కిలోలు. 2011-12లో ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్డీపీలో మత్స్యరంగం వాటా రూ.2,723 కోట్లు కాగా, 2020-21 నాటికి అది రూ.7,827 కోట్లకు పెరిగింది. 2021-22లో కర్ణాటక నుంచి రూ.1,962.19 కోట్ల విలువైన 1,20,427 మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తుల ఎగుమతి జరిగింది.

 

75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తితో మత్స్యకారులు, చేపల పెంపకందార్లు, సంబంధిత భాగస్వాములందరికీ సంఘీభావం తెలుపుతూ సముద్ర తీరం వెంబడి సముద్రంలో సాగే పరిణామాత్మక యాత్ర సాగర్ పరిక్రమ. ఫిషరీస్ కోసం పి ఎం ఎం ఎస్ వై, ఎఫ్ ఐ డి ఎఫ్, కె సి సి వంటి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్యకార పథకాలు ,కార్యక్రమాల ద్వారా మత్స్యకారులు ,ఇతర వాటాదారుల సమస్యలను పరిష్కరించడం ,వారి ఆర్థిక పురోభివృద్ధిని సులభతరం చేయడం లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన చొరవ ఇది.

 

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి ,మరిన్ని జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్డిజి) చేరుకోవడానికి భారత ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని అవలంబించింది. అలాంటి వాటిలో సాగర్ పరిక్రమ ఒకటి, ఇది గుజరాత్, డయ్యూ అండ్ డామన్ నుండి ప్రారంభమై ఇప్పటికే మహారాష్ట్ర లో పూర్తయింది. మిగిలిన రాష్ట్రాలు గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ ,లక్షద్వీప్ దీవులు, తీరప్రాంత మత్స్యకారుల సమస్యలను తెలుసుకోవడానికి ఈ ప్రదేశాలలో మత్స్యకారులు, మత్స్యకార సంఘాలు, భాగస్వాములతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నాయి.

 

"క్రాంతి సే శాంతి" థీమ్ తో 2022 మార్చి 5 న గుజరాత్ లోని మాండ్వి (శ్యాంజీ కృష్ణ వర్మ స్మారకం) నుండి ఓఖా-ద్వారకా వరకు ఫేజ్-1 గా "సాగర్ పరిక్రమ" ప్రయాణం ప్రారంభమైంది .2022 మార్చి 6 న పోర్ బందర్ వద్ద 3 ప్రదేశాలను కవర్ చేస్తూ పూర్తయింది. ఈ కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది, 5,000 మందికి పైగా హాజరయ్యారు యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ల ద్వారా సుమారు 10,000 మంది లైవ్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు.

 

రెండవ దశ కార్యక్రమం 2022 సెప్టెంబర్ 23 నుండి 25 వరకు మంగ్రోల్, వెరావల్, డయ్యూ, జాఫ్రాబాద్, సూరత్, డామన్ అండ్ వల్సాద్ నుండి 7 ప్రదేశాలలో సాగింది. తీరప్రాంత మత్స్యకారుల సమస్యలను తెలుసుకోవడానికి మత్స్యకారులతో సంభాషించింది. సాగర్ పరిక్రమపై గుజరాతీ భాషలో ఓ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి 20,000 మందికి పైగా భౌతికంగా హాజరయ్యారు. ప్రోగ్రామ్‌ను యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేసారు, సుమారు 15,000 మంది ఈవెంట్‌ను వీక్షించారు.

 

ఫేజ్-3 'సాగర్ పరిక్రమ' 2023 ఫిబ్రవరి 19 న గుజరాత్ లోని సూరత్ హజీరా పోర్ట్ నుండి ప్రారంభమైంది. 2023 ఫిబ్రవరి 20-21 వరకు ఉత్తర మహారాష్ట్రలోని 5 ప్రాంతాలైన సత్పతి (పాల్ఘర్ జిల్లా), వసాయ్, వెర్సోవా, న్యూ ఫెర్రీ వార్ఫ్ (భౌచా ధక్కా) ,సాసన్ డాక్ ,ముంబైలోని ఇతర ప్రాంతాలను కవర్ చేసింది. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. 13500 మందికి పైగా భౌతికంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయగా, సుమారు 10000 మంది వీక్షించారు. పరిక్రమ మూడు దశల్లో గుజరాత్, మహారాష్ట్ర, డయ్యూ అండ్ డామన్ యూటీ రాష్ట్రాల్లోని 15 ప్రాంతాలను కవర్ చేశారు.

 

ఆరోగ్యకరమైన మహాసముద్రాలు ,సముద్రాలు భూమిపై మానవ మనుగడకు ,జీవానికి చాలా అవసరం. ఇవి 70 శాతం భూగోళాన్ని కవర్ చేస్తాయి ఆహారం,ఇంధనం, నీటిని అందిస్తాయి.

జీవనోపాధి, వాతావరణ మార్పులు, వాణిజ్యం, భద్రత వంటి అభివృద్ధి చెందుతున్న సంక్లిష్టమైన , పరస్పర అనుసంధానిత అభివృద్ధి సమస్యలకు అవి భారీ రంగాన్ని అందిస్తాయి. వాతావరణ మార్పులను

తగ్గించడంలోనూ దాని ప్రభావాలను మెరుగుపరచడంలోనూ మహాసముద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. హిందూ మహాసముద్రం దాని తీరప్రాంత రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు, భద్రత ,జీవనోపాధికి కీలకమైనది.

 

దేశంలో 8,118 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది, ఇది 9 సముద్ర రాష్ట్రాలు ,4 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది 2.8 మిలియన్ల మత్స్యకారులకు జీవనోపాధి మద్దతును అందిస్తుంది. చేపల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ వాటాలో 8% భాగస్వామ్యం వహిస్తుంది ప్రపంచంలో 3 వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా ఉంది. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తి 162.48 లక్షల టన్నులు కాగా, ఇందులో 121.21 లక్షల టన్నులు లోతట్టు నుంచి, 41.27 లక్షల టన్నులు సముద్ర జలాల నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. 2021-22లో మత్స్య ఎగుమతుల విలువ రూ.57,586.48 కోట్లుగా ఉంది. ఈ రంగం జివిఎలో స్థిరమైన వృద్ధి రేటును చూపుతుంది, ఇది వ్యవసాయ జిడిపిలో 6.724% వాటాను కలిగి ఉంది. వ్యవసాయ ఎగుమతుల్లో 17% దోహదం చేస్తుంది. భారతదేశంలో, చేపల పెంపకం సాధారణంగా ఓపెన్ యాక్సెస్ ఫిషరీ, ఇది సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ చట్టాలు,నియంత్రణ చర్యల ద్వారా నిర్వహించ బడుతోంది

 

***



(Release ID: 1908084) Visitor Counter : 181