ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

సేల్స్‌ఫోర్స్, ట్రూకాలర్ భారతదేశ కార్యాలయాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్


2014లో రెండు అంకెల లోపు ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదెశ ఆర్థిక వ్యవస్థ నేడు వేగంగా అభివృద్ధి చెంది
విస్తృత ఆధారిత,ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించింది.. శ్రీ చంద్రశేఖర్

Posted On: 16 MAR 2023 7:17PM by PIB Hyderabad

సులభతర వ్యాపార నిర్వహణ కోసం కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమలు చేస్తున్న చర్యల వల్ల భారతదేశంలో ఉత్పత్తి రంగం, అంకుర రంగ సంస్థలు అభివృద్ధి సాధిస్తున్నాయని కేంద్ర కేంద్ర నైపుణ్యాభివృద్ధి,వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల భారతదేశంలో కార్యాలయాలు ప్రారంభించేందుకు విదేశీ సంస్థలు ముందుకు వస్తున్నాయని శ్రీ చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు సేల్స్ ఫోర్స్, ట్రూకాలర్ భారతదేశంలో తమ కార్యాలయాలు ప్రారంభించాయి. బెంగళూరులో సేల్స్‌ఫోర్స్ ,హైదరాబాద్ లో ట్రూకాలర్ కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. ఈ రెండు కార్యక్రమాల్లో శ్రీ చంద్రశేఖర్ వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో సేల్స్ ఫోర్స్, ట్రూకాలర్ కార్యాలయాలు ప్రారంభం కావడం పట్ల శ్రీ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ' ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల భారతదేశంలో పటిష్టమైన అంకుర రంగ వ్యవస్థ, ఆవిష్కరణల రంగం అభివృద్ధి చెందుతున్నాయి.విశ్వసనీయ సాంకేతిక  భాగస్వామిగా ప్రపంచంలో భారతదేశం గుర్తింపు సాధించింది.' అని శ్రీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సాంకేతిక వినియోగంలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని మంత్రి అన్నారు.  “చాలా కాలంగా భారతదేశం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్‌గా మాత్రమే ఉపయోగపడింది.  డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కొన్ని ఐటీ/ఐటీ ఈఎస్ పరిమితం అయ్యింది.  2014లో శ్రీ నరేంద్ర మోదీ  ప్రధానమంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.  భారతదేశ వృద్ధిలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కీలక  పాత్ర పోషించాలని, జీడీపీ అభివృద్ధిలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ క్రియాశీల పాత్ర పోషించాలి అని దిశ నిర్దేశించారు.' అని శ్రీ చంద్రశేఖర్ అన్నారు.  

' 2015లో డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది.  2014లో రెండు అంకెల లోపు వృద్ధి రేటు కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థ  విస్తృత-ఆధారిత, అధిక వృద్ధి రేటు కలిగిన  డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి. నూతన  ఆవిష్కరణలుచోటు చేసుకుంటున్నాయి' అని శ్రీ చంద్రశేఖర్ అన్నారు.

సేల్స్‌ఫోర్స్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన  శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న గ్లోబల్ సంస్థల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారతదేశ సాంకేతిక రంగం అభివృద్ధిలో ఇది  ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుందని అన్నారు.  

 భారతదేశం నేడు ఎలక్ట్రానిక్స్ తయారీలో రంగంలో ప్రపంచంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద  ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందిందని పేర్కొన్న శ్రీ చంద్రశేఖర్ ప్రపంచ స్థాయి అంకుర సంస్థలు, ఆవిష్కరణ రంగం పనిచేస్తున్నాయని అన్నారు. 

భవిష్యత్తు అవసరాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను మంత్రి వివరించారు. మానవ వనరుల అభివృద్ధి కోసం 2023 కేంద్ర బడ్జెట్ లో నైపుణ్యాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిందన్నారు. ' కోవిడ్ అనంతరం అందుబాటులోకి వచ్చిన అవకాశాలు, సవాళ్లు ఎదుర్కోవడానికి ప్రభుత్వం పీఎంకేవీవై 4.0 పథకాన్ని రూపొందించింది. దీనిలో ఇండస్ట్రీ 4.0 అవసరాలైన కోడింగ్, ఏఐ, రోబోటిక్స్,మెకాట్రానిక్స్,ఐఓటీ,3డి ప్రింటింగ్,  డ్రోన్లు, సాఫ్ట్ స్కిల్స్ అంశాలకు ప్రాధాన్యత లభిస్తుంది' అని శ్రీ చంద్రశేఖర్ వివరించారు. 

భారతదేశాన్ని ప్రపంచంలో నైపుణ్య హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని శ్రీ చంద్రశేఖర్ వివరించారు. “దేశంలో నైపుణ్యం, ప్రతిభను పెంపొందించడానికి పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధన అభివృద్ధి సంస్థలతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుంది. ” అని మంత్రి అన్నారు. పరిశ్రమల  తాజా అవసరాలకు అనుగుణంగా రాబోయే నాలుగేళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లు, డిజైనర్లు , ఇతర సహాయక ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యూచర్ స్కిల్స్ నివేదిక ఇటీవల విడుదల చేశామన్నారు. 

స్వీడన్‌లోని ప్రధాన కార్యాలయం తర్వాత  ట్రూకాలర్ హైదరాబాద్ లో తన తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో మాట్లాడిన  శ్రీ చంద్రశేఖర్ రక్షణ చర్యలు అమలు చేసి దుర్వినియోగం జరగకుండా చూసి   సాంకేతిక అభివృద్ధికి సహకారం అందించాలని అన్నారు. 

రాబోయే దశాబ్ద కాలం  అవసరాలు దృష్టిలో ఉంచుకుని  భారతదేశం నూతన చట్టాలు , నియమాలు అమలు చేయడానికి చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. 

***



(Release ID: 1907998) Visitor Counter : 110


Read this release in: Kannada , English , Hindi , Tamil