మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైనారిటీల సంక్షేమం
Posted On:
16 MAR 2023 3:40PM by PIB Hyderabad
నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం మైనారిటీలు ప్రత్యేకించి సమాజంలోని ఆర్థికంగా బలహీనమైన మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన వర్గాలతో సహా ప్రతి వర్గాల సంక్షేమం మరియు అభ్యున్నతి కోసం వివిధ పథకాలను అమలు చేస్తుంది.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా నోటిఫై చేయబడిన ఆరు (6) మైనారిటీ కమ్యూనిటీల సామాజిక ఆర్థిక మరియు విద్యాపరమైన సాధికారత కోసం దేశవ్యాప్తంగా వివిధ పథకాలను అమలు చేస్తుంది. మైనారిటీ వర్గాలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయి.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకాల కింద రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు జరగదు. అయితే గుర్తించబడిన ప్రాంతంలో కమ్యూనిటీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పథకం అయిన ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (పీఎంజేవీకే) కింద పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల చేయబడతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ శాఖకు సంబంధించిన సవరించిన విధానం ప్రకారం రాష్ట్రాలు నిధులను ఉత్తమంగా ఉపయోగించుకునేలా చూసుకోవడానికి, ఇప్పుడు పీఎంజేవీకే కింద నిధుల విడుదల వ్యక్తిగత ప్రాజెక్టులతో ముడిపడి లేదు. పీఎంజేవీకే కింద విడుదల చేసిన నిధులను వినియోగించుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. పీఎంజేవీకే స్టేట్ నోడల్ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ) యొక్క బ్యాంక్ ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తం ఒక ఉమ్మడి సమూహాన్ని ఏర్పరుస్తుంది. ఇది కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పీఎంజేవీకే) దేశంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయడానికి 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి సవరించబడింది. పీఎంజేవీకే కింద సృష్టించబడిన అన్ని ఆస్తులను జియో-ట్యాగింగ్చేయడానికి మరియు పీఎంజేవీకే కింద ప్రాజెక్ట్‌ల మెరుగైన అమలు/ పర్యవేక్షణ కోసం వివిధ దశల నిర్మాణం/ప్రాజెక్ట్‌ల పూర్తి ఫోటోగ్రాఫ్‌లతో సహా ప్రాజెక్ట్ నిర్దిష్ట లక్షణాలను సంగ్రహించడానికి పీఎంజేవీకే భువన్ మొబైల్ యాప్ అభివృద్ధి చేయబడింది.
మైనారిటీల కోసం అమలు చేయబడిన పథకాల ప్రయోజనాలు వాస్తవానికి ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవడానికి నైపుణ్యంతో సహా ఈ మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ పథకాల క్రింద స్కాలర్‌షిప్ మొత్తం/స్టైపెండ్/ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) విధానం ద్వారా విడుదల చేయబడుతుంది. ఇంకా, స్కాలర్‌షిప్ పథకాలు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్‌ఎస్‌పి) ద్వారా అమలు చేయబడుతున్నాయి. ఇందులో తనిఖీ, డి-డూప్లికేషన్‌ను నివారించడం, మధ్యవర్తులు, తప్పుడు లబ్ధిదారులు మొదలైన వారిని తొలగించడం జరుగుతుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.
****
(Release ID: 1907812)
Visitor Counter : 191