శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గత పదేళ్ళలో పరిశోధన & అభివృద్ధి (ఆర్&డి)పై భారత వ్యయం పెరుగుతూ 2007-08లో రూ. 39,437.77 కోట్ల నుంచి మూడింతలు పెరిగి, 2017-18లో రూ 1,13,825.03 కోట్లకు చేరిందన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
16 MAR 2023 4:25PM by PIB Hyderabad
యుఎస్ డాలర్ పరంగా పర్చేజింగ్ పవర్ పారిటీ (కొనుగోలు శక్తి తుల్యత) పరిశోధన & అభివృద్ధి పెట్టుబడిలో అంతర్జాతీయంగా భారత్ 6వ స్థానంలో ఉందని కేంద్ర పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల సహాయ మంత్రి శాస్త్ర & సాంకేతిక శాఖ సహాయమంత్రి (స్వతంత్ర ఛార్జి), ఎర్త్ సైన్సెస్ మంత్రి, అణు ఇంథనం, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, గత పదేళ్ళుగా పరిశోధన & అభివృద్ధి (ఆర్&డి) పై వ్యయం స్థిరంగా పెరుగుతూ వస్తోందని, 2007-08లో రూ. 29,437.88 కోట్ల నుంచి మూడింతలు పెరిగి 2017-18లో రూ. 1,13,825.03 కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు.
రాజ్యసభలో గురువారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ఆర్&డి వ్యయాన్ని పెంచేందుకు, కాంపిటీటివ్ ఎక్స్ట్రామ్యూరాల్ ఫండింగ్ స్కీం ( పోటీ విద్యా సంస్థలు, పరిశోధన ప్రయోగశాలలు, సైన్సులో అవధులలో ప్రాథమిక పరిశోధన చేసేందుకు పరిశోధన & అభివృద్ధి సంస్థలకు నిధులు ఇచ్చే పథకం) సహా పరిశోధకులకు తగినన్ని అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. పిహెచ్.డి., పోస్ట్- డాక్టొరల్ పరిశోధన ద్వారా పరిశోధన సాగిస్తున్న విద్యార్ధులకు అవకాశాలను పెంచేందుకు పలు చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుందని ఆయన అన్నారు.
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్ఇఆర్‌బి) వార్షికంగా ఇచ్చే పోస్ట్-డాక్టొరల్ ఫెలోషిప్స్ (పిడిఎఫ్)ను 300 నుంచి 1000కి పెంచాలని ఇటీవలే తీసుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇందుకు అదనంగా, ఎస్ఇఆర్‌బి-రామానుజం ఫెలోషిప్, ఎస్ఇఆర్‌బి-రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్, ఎస్ఇఆర్‌బి - విజిటింగ్ అడ్వాన్స్‌డ్ జాయింట్ రీసెర్చ్ ఫ్యాకల్టీ స్కీం (విఎజెఆర్ఎ- వజ్ర) తదితరాలను భారతదేశంలోని ఎస్‌టిఐ పర్యావరణ వ్యవస్థలో పని చేసి, దోహదం చేసేందుకు భారతీయ మూలాలకు చెందిన తెలివైన పరిశోధకులను ఆకర్షించేందుకు మేధో లబ్ధిని ప్రోత్సహించేందుకు రూపకల్పన చేసినట్టు ఆయన తెలిపారు.
***
(Release ID: 1907811)
Visitor Counter : 206