రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

హిందూ మహా సముద్ర ప్రాంతంలో నౌకాయాన సవాళ్లను చర్చించేందుకు కొలంబో సెక్యూరిటీ సమ్మేళనం కింద 4వ టేబుల్‌ టాప్‌ విన్యాసాలు నిర్వహిస్తున్న భారత తీర రక్షకదళం(ఈశాన్యవిభాగం)

Posted On: 15 MAR 2023 4:22PM by PIB Hyderabad

ిాందూ మహా సముద్ర ప్రాంతంలో  నౌకాయాన సవాళ్లను చర్చించేందుకు కొలంబో సెక్యూరిటీ సమ్మేళనం కింద  4వ టేబుల్‌ టాప్‌ విన్యాసాలను  భారత తీర రక్షకదళం(ఈశాన్యవిభాగం) నిర్వహిస్తోంది. ఈ విన్యాసాలు 2023 మార్చి 14 నుంచి మార్చి 16 వరకు జరుగుతాయి. భారత తీర రక్షకదళంతోపాటు కొలంబోసెక్యూరిటీ  సదస్సు సభ్యదేశాలైన శ్రీలంక, మాల్దీవులు, మారిషస్‌ , బంగ్లాదేశ్‌, సిచెల్లిస్‌ తదితర దేశాలు ఈ విన్యాసాలలో పాల్గొంటున్నాయి.  నౌకాయానానికి సంబంధించిన అంశాలలో ఎదురవుతున్న సవాళ్లపై అంటే దేశ వ్యతిరేక శక్తులనుంచి ఎదురవుతున్న ముప్పు, సముద్ర కాలుష్యాన్ని ఎదుర్కునేందుకు చర్యలు, సముద్రంలో చిక్కుకున్న వారి గాలింపు, రక్షణ, నష్ట నివారణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

కొలంబో సెక్యూరిటీ సమ్మేళనాన్ని 2011 లో ఏర్పాటు చేశారు. ఇది ఇండియా, శ్రీలంక, మాల్దీవులతో కూడిన త్రైపాక్షిక గ్రూపు. ఆ తర్వాతి కాలంలో దీని కార్యకలాపాలను విస్తరింప చేశారు. నాలుగో సభ్యదేశంగా మారిషస్‌ చేరగా, బంగ్లాదేశ్‌, సియాచెలిస్‌ పరిశీలక హోదాలో ఈ సమావేశాలలో పాల్గొంటున్నాయి. ఈ సదస్సు ప్రాంతీయ సహకారం, ఉమ్మడి భద్రతా లక్ష్యాలకు సంబంధించినది. ఇది హిందూ మహాసముద్ర  ప్రాంతానికి సంబంధించి నౌకాయాన భద్రత, సముద్ర కాలుష్య నియంత్రణ సన్నద్ధత, సముద్ర పరివోధన , సహాయ కార్యకలాపాల ప్రాధాన్యతలపై దృష్టిపెడుతుంది.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, సముద్రయాన రక్షణకు తీరప్రాంత దేశాల మధ్య సహకారం తప్పనిసరి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన ఈ ప్రాంతంలోని అందరి భద్రత , వృద్ధి (ఎస్‌.ఎ.జి.ఎ.ఆర్‌` సాగర్‌ `సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ది రీజియన్‌), ఇరుగు పొరుగు దేశాలకు ప్రాధాన్యత అనేవి హిందూ మహా సముద్ర ప్రాంతానికి కీలకమైనవి. ఇండియా విధాన ప్రాధాన్యతలకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఐ.ఒ.ఆర్‌లో ఇరుగుపొరుగుదేశాల మధ్య నౌకాయానంలో   పరస్పర సహకార వాతావరణం, సమన్యయ చర్యల వంటివి సముద్ర ప్రాంత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపకరిస్తాయి. ఆ రకంగా సముద్రయాన భద్రత, రక్షణ, సముద్ర ప్రాంత పర్యావరణ పరిరక్షణకు వీలుకలుగుతుంది.

***


(Release ID: 1907598)
Read this release in: English , Urdu , Hindi , Tamil