రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జాతీయ రహదారులనిర్మాణంలో ఉక్కు మడ్డిప్రయోగాత్మక వినియోగానికి ఎన్‌హెచ్‌ఎఐశ్రీకారం

Posted On: 15 MAR 2023 5:08PM by PIB Hyderabad

ప్రభుత్వ అనుసరిస్తున్న ‘వర్థం నుంచి అర్థం’ కార్యక్రమానికి అనుగుణంగానే కాకుండా పర్యావరణపరంగా సుస్థిర జాతీయ రహదారుల నిర్మాణాన్ని ‘ఎన్‌హెచ్‌ఎఐ’ న్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ‘ఉక్కు మడ్డి’ (స్టీల్ శ్లాగ్)ని ప్రయోగాత్మకంగా వినియోగించడం ప్రారంభించింది. తద్వారా జాతీయ రహదారులకు నిర్మాణ సామగ్రి కొరత సమస్య కూడా తీరుతుంది. అంతేగాక ఇసుక, కంకర లేదా రాతిపొడి వంటి సహజ కంకరలకు బదులు ఉక్కు పరిశ్రమ వ్యర్థాలను వినియోగించుకోవచ్చు.

ఈ వినూత్న కృషిలో భాగంగా ఉక్కు మడ్డితో దేశంలోనే తొలిసారి రోడ్డు నిర్మాణ నాణ్యతగల కాంక్రీట్‌ (పిక్యుసి) తయారీకి ‘ఎన్‌హెచ్‌ఎఐ’ ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. ముంబై సమీపంలోని ఎన్‌హెచ్‌-66 కింద పన్వేల్‌ - ఇందాపూర్ సెక్షన్ పరిధిలోగల రాయ్‌గఢ్‌ జిల్లాలో ‘పిక్యుసి’ కోసం కిలోమీటరు పొడవున ప్రయోగాత్మక అతుకు రోడ్డు నిర్మించేందుకు కేంద్రీయ రహదారి నిర్మాణ సంస్థ (సిఆర్‌ఆర్‌ఐ)కు అనుమతి ఇచ్చింది. ఇక్కడ సహజ కంకరల స్థానంలో 100 శాతం ఉక్కు మడ్డిని వినియోగించగా ప్రయోగ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు, భవనాల-నిర్మాణాల వ్యర్థాల వంటివాటిని కొత్త ప్రత్యామ్నాయాలుగా వినియోగించడాన్ని ‘ఎన్‌హెచ్‌ఎఐ’ ప్రోత్సహిస్తోంది. తాజాగా ఉక్కు మడ్డితో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా ‘వ్యర్థాన్ని అర్థంగా’ మార్చే ప్రయోగం ఇందుకు ఒక ఉదాహరణ. రహదారులు వేయడంలో ఇలాంటి సరంజామా వాడకం వాటి నిర్మాణంలో మరింత పొదుపు సాధించేందుకు తోడ్పడుతుంది. అంతేగాక వృత్తాకార ఆర్థిక వ్యవస్థతోపాటు వనరుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది.

*****



(Release ID: 1907435) Visitor Counter : 73


Read this release in: English , Urdu