రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

10 జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్లు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రస్తుతం నడుస్తున్నాయి


భారతీయ రైల్వే 102 వందే భారత్ రేకుల ఉత్పత్తి ప్రణాళికను విడుదల చేసింది

కవచ్‌ని రైల్వే నెట్‌వర్క్‌లో వేగంగా అనుసంధానం చేస్తున్నారు

Posted On: 15 MAR 2023 5:54PM by PIB Hyderabad

మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ మరియు వారణాసి మధ్య 15.2.2019 న ప్రారంభం అయింది . ప్రస్తుతం, భారతీయ రైల్వే (IR) నెట్‌వర్క్‌లో 10 జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్లు నడుస్తున్నాయి.

 

కోచ్‌ల ఇతర వస్తువులతో సహా వందే భారత్ రైళ్ల సదుపాయం పీ హెచ్-21 రైల్ బోగీలు (రోలింగ్ స్టాక్) ప్రోగ్రామ్ (క్యారేజీలు) కింద వస్తుంది, దీని కోసం 2022-2023 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలో రూ. 19479 కోట్లు అందుబాటులో ఉంచబడ్డాయి. ఇంకా, భారతీయ రైల్వేల ఉత్పత్తి యూనిట్లలో ((ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరియు ఆధునిక కోచ్ ఫ్యాక్టరీ)  ఐ ఆర్  ఐ ఆర్ డిజైన్ ప్రకారం102 వందే భారత్ రేక్‌ల (2022-2023లో 35 మరియు 2023-2024లో 67) ఉత్పత్తి ప్రణాళికను విడుదల చేసింది. మొత్తం 75 వందే భారత్ రేక్‌లు చైర్ కార్ వెర్షన్‌గా ప్లాన్ చేయబడ్డాయి మరియు మిగిలినవి స్లీపర్ వెర్షన్‌గా ప్లాన్ చేయబడ్డాయి.ఐఆర్‌లో తయారీకి సాంకేతిక భాగస్వాములను ఎంపిక చేయడానికి టెండర్లలో మూడు విభిన్న సాంకేతికతలతో కూడిన 400 వందే భారత్ రైళ్లను (స్లీపర్ వెర్షన్) ఐ ఆర్  మానవశక్తితో  తయారు చేయడానికి కూడా ఐ ఆర్ ఉత్పత్తి యూనిట్లలో ప్రణాళిక సిద్ధం చేసింది.  పైన పేర్కొన్న వాటితో పాటు, 8000 వందే భారత్ కోచ్‌లు కూడా బడ్జెట్ 2023-24 కింద ప్రతిపాదించబడ్డాయి.

 

కవచ్‌తో రైల్వే నెట్‌వర్క్‌ను క్రమంగా కవర్ చేయాలని ప్రతిపాదించబడింది. ప్రస్తుతం, దక్షిణ మధ్య రైల్వేలో 1455 రూట్ కిమీలో కవచ్ అమలు చేయబడింది. ఇంకా, ఇండియన్ రైల్వేస్‌లోని ఢిల్లీ-ముంబై మరియు ఢిల్లీ-హౌరా సెక్షన్‌లలో దాదాపు 3000 రూట్ కి.మీల కవచ్ పనులకు కాంట్రాక్టులు ఇవ్వబడ్డాయి మరియు పని పురోగతిలో ఉంది.

 

రైల్ కార్గోను నిర్వహించడానికి అదనపు టెర్మినల్స్ అభివృద్ధిలో ప్రైవేట్ పరిశ్రమ నుండి పెట్టుబడిని పెంచడానికి, కొత్త గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్ (GCT) విధానం 15.12.2021న ప్రారంభించబడింది. ఈ టెర్మినల్స్ రైల్వేయేతర భూమిలో, అలాగే పాక్షికంగా లేదా పూర్తిగా రైల్వే భూమిలో నిర్మించబడతాయి. మూడు ఆర్థిక సంవత్సరాల్లో అంటే 2022-23, 2023-24 మరియు 2024-25లో 100 గతి శక్తి కార్గో టెర్మినల్స్ (GCTలు) కమీషన్ చేయడమే లక్ష్యం, వాటిలో 30 జీ సీ టీ లు ఇప్పటికే కమీషన్ చేయబడ్డాయి. జిసిటి విధానంలో కార్గో టెర్మినల్స్ అభివృద్ధికి ఇప్పటి వరకు 145 దరఖాస్తులు రాగా, 103 సూత్రప్రాయ అనుమతులు జారీ అయ్యాయి.

 

రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

***


(Release ID: 1907382)
Read this release in: English , Urdu