వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
స్వదేశీ ఆటబొమ్మల తయారీ యూనిట్లకు 1097 లైసెన్సులు జారీచేసిన బిఐఎస్; వాటిలో 1061 లైసెన్సులు (96.7%) ఎంఎస్ఎంఈలకు
మైక్రో యూనిట్లకు, అంకుర సంస్థలకు, మహిళా వ్యాపారులకు మార్కింగ్ ఫీజులో రాయితీ ఇచ్చిన బీఐఎస్
Posted On:
15 MAR 2023 5:33PM by PIB Hyderabad
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీకుమార్ చౌబే ఈ రోజు లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ క్రీడా సామగ్రి తయారీకి సంబంధించిన భారతీయ ప్రమాణాలను నిర్దేశించటం మీద పరిశీలనలో ఉన్న అంశాలను ఈ విధంగా తెలియజేశారు.
పైన పేర్కొన్న భారతీయ ప్రమాణాలన్నీ ఈమధ్యనే 2022 లో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులు స్వచ్ఛంద బి ఐ ఎస్ సర్టిఫికేషన్ కింద ఉన్నాయి. పైన పేర్కొన్న ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఎలాంటి లైసెన్సులు గాని బి ఐ ఎస్ కోసం పెండింగ్ దరఖాస్తులు గాని లేవు.
స్వదేశీ తయారీదారులు, మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ లకు వెసులుబాటు కల్పించటానికి బి ఐఎస్ అనేక చర్యలు తీసుకుంది.. బి ఐ ఎస్ ఆటబొమ్మల తయారీ యూనిట్లకు 1097 లైసెన్సులు జారీచేయగా వాటిలో 1061 లైసెన్సులు (96.7%) ఎంఎస్ఎంఈలకు జారీ చేసింది. అదే విధంగా మైక్రో యూనిట్లకు, అంకుర సంస్థలకు, మహిళా వ్యాపారులకు మార్కింగ్ ఫీజులో బి ఐ ఎస్ రాయితీ ఇచ్చింది.
ఆట వస్తువుల పరిశ్రమ కోరిక మేరకు బిఐ ఎస్ సూక్ష్మ, చిన్న తయారీ యూనిట్లకు ఆట బొమ్మల తయారీకి ఏడాది పాటు సొంత టెస్టింగ్ సౌకర్యాలు లేకపోయినా లైసెన్స్ మంజూరు చేయాలని బి ఐ ఎస్ నిర్ణయించింది. కోవిడ్-19 సంక్షోభం ప్రభావం లాంటి సమస్యలను ప్రస్తావిస్తూ, మరింత సమయం కావాలంటూ పరిశ్రమ చేసుకున్న విజ్ఞప్తిని ఈ సదలింపును మూడేళ్ళపాటు పొడిగించింది.
2020 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జారీచేసిన ఆటవస్తువుల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ ఉత్తర్వు, 2021 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. దీనికింద ఆటబొమ్మలకు బి ఐ ఎస్ సర్టిఫికేషన్ తప్పనిసరి. పైగా, డీపీఐఐటీ సంస్థ ఆటబొమ్మల నాణ్యతా నియంత్రణ సవరణ ఉత్తర్వులలో హస్త కళల అభివృద్ధి కమిషనర్ దగ్గర నమోదు చేసుకున్న హస్త కళాకారుల ఉత్పత్తులకు, రిజిస్టర్ చేసుకున్న తయారీదారులకు, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ దగ్గర నమోదు చేసుకున్న జి ఐ ఎస్ ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చింది.
బి ఐ ఎస్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ పథకం కింద .. అంటే 2018 నాటి బి ఐ ఎస్ రెగ్యులేషన్ లోని షెడ్యూల్ 2 లోని స్కీమ్ 1 కింద తయారీ సంస్థలకు భారతీయ ప్రమాణాల ప్రకారం ఐఎస్ ఐ మార్కు వాడుకునే లైసెన్స్ మాత్రమే ఇస్తారు. చిల్లర వ్యాపారులకు బి ఐ ఎస్ ఎలాంటి లైసెన్సునూ మంజూరు చేయదు.
*****
(Release ID: 1907380)