రక్షణ మంత్రిత్వ శాఖ
‘హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ ఇన్ మిలిటరీ ప్లాట్‌ఫారమ్’ అనే అంశంపై డిఆర్‌డిఓ ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
సైనికులకు అనుకూలమైన స్వదేశీ ఆయుధాలను తయారు చేసేందుకు అవసరాలు డిజైన్ల దశలో హెచ్‌ఎఫ్‌ఈని పొందుపరచాలి: జనరల్ అనిల్ చౌహాన్
Posted On:
15 MAR 2023 2:47PM by PIB Hyderabad
'హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ ఇన్ మిలిటరీ ప్లాట్‌ఫారమ్' అనే అంశంపై ఏర్పాటైన రెండు రోజుల వర్క్‌షాప్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ 2023 మార్చి 15న న్యూఢిల్లీలో ప్రారంభించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ( డిఆర్‌డిఓ) కి అనుబంధంగా పనిచేస్తున్న డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (DIPAS) ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడానికి రక్షణ రంగంలో హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ (HFE)ని శాస్త్రీయంగా అమలు చేయడం కోసం అనుసరించవలసిన ప్రణాళిక, విధానాలు రూపొందించడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ ఏర్పాటయింది. రక్షణ రంగంలో మానవ వనరులు, మానవ సామర్థ్యాలను సమర్థవంతంగా, సురక్షితంగా ఉపయోగించుకోవడం ఈ అంశంలో ఉన్న పరిమితులను గుర్తించి దీనికి అనుగుణంగా సాధనాలు, వ్యవస్థల రూపకల్పనకు హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ ఉపయోగపడుతుంది.

రక్షణ రంగం అవసరాలు గుర్తించి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అవసరమైన పరికరాలు, వ్యవస్థలు అభివృద్ధి చేయడానికి డిజైన్‌ల దశలో హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ ని ఉపయోగించాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. సుదీర్ఘ యుద్ధాలు, స్వల్ప వ్యవధి ప్రత్యేక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రక్షణ వ్యవస్థల సహకారంతో హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ అమలు చేయడం కోసం సమగ్ర ద్వారా విధానం , వ్యవస్థలను రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
డిఆర్‌డిఓ చైర్మన్, రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ ఉత్పత్తి, అభివృద్ధి కార్యక్రమాల్లో హెచ్‌ఎఫ్‌ఇని అమలు చేయడానికి డిఆర్‌డిఓ తీసుకున్న కార్యక్రమాలను వివరించారు. కేవలం భారతీయ సైనికుల వినియోగం కోసం మాత్రమే కాకుండా ఎగుమతి చేయడానికి వీలుగా ఉత్పత్తులు జరుగుతాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ పరికరాలకు స్వయంప్రతిపత్తి కల్పించడానికి చర్యలు అమలు జరుగుతున్న సమయంలో హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
భవిష్యత్ రక్షణ సాంకేతికతలపై పనిచేస్తున్నడిఆర్‌డిఓ డైరెక్టర్ జనరల్స్, డిఆర్‌డిఓ ప్రధాన కార్యాలయం, ప్రయోగశాలలకు చెందిన డైరెక్టర్లు, సీనియర్ శాస్త్రవేత్తలు; స్ట్రాటజిక్ ప్లానింగ్, ఆర్మీ డిజైన్ బ్యూరో, ఆర్మర్డ్ కార్ప్స్, ఇన్‌ఫాంట్రీ, వార్‌షిప్ డిజైన్ బ్యూరో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధులు, రక్షణ పరిశ్రమలు, డిఫెన్స్ పిఎస్‌యుల సీనియర్ అధికారులు వర్క్‌షాప్‌కు హాజరవుతున్నారు.
****
(Release ID: 1907228)