ఉక్కు మంత్రిత్వ శాఖ
100 మంది దివ్యాంగులకు నైపుణ్య శిక్షణను అందజేస్తున్న ఆర్‌ఐఎన్‌ఎల్
Posted On:
15 MAR 2023 12:06PM by PIB Hyderabad
దివ్యాంగులకు (వివిధ వికలాంగులు) సాధికారత కల్పించడంతోపాటు వారికి జీవనోపాధి కల్పించేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్ విశాఖపట్నంలోని 100 మంది లబ్ధిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించింది. ఆర్‌ఐఎన్‌ఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత చొరవలో భాగంగా ట్రైనీలకు జన్ శిక్షణ సంస్థాన్ (స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో) మద్దతుతో అవసరమైన నైపుణ్యాలను అందించడానికి ఆర్‌ఐఎన్‌ఎల్ రూ. 4.95 లక్షలు ఖర్చు చేసింది.
ఉదాత్త ప్రయత్నంలో భాగంగా విశాఖపట్నంలోని శ్రేయ ఫౌండేషన్, సుజాతనగర్, సన్‌ఫ్లవర్ స్పెషల్ స్కూల్, పెదవాల్టైర్, లెబెన్‌షీల్ఫ్, ఎంవిపి కాలనీలో గల 3 శిక్షణా కేంద్రాలలో 100 మంది దివ్యాంగులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మంగళవారం వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన శ్రీ ఎ అశోక్, జిఎం (సిఎస్‌ఆర్) మరియు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) అధికారులు సర్టిఫికేట్‌లను అందించారు.
లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించేందుకు సంబంధిత డే కేర్ శిక్షణా కేంద్రాలలో టైలరింగ్, ఇంటి అవసరాలైన అగర్బత్తీలు, కొవ్వొత్తుల తయారీ, ఫినైల్ తయారీ మరియు డిటర్జెంట్ తయారీ వంటి వివిధ నైపుణ్యాలలో జెఎస్‌ఎస్ (జన్ శిక్షన్ సంస్థాన్) నుండి ప్రత్యేక శిక్షకుల ద్వారా ఆర్‌ఐఎన్‌ఎల్ నైపుణ్య శిక్షణను అందించింది. టైలరింగ్‌లో శిక్షణ వ్యవధి 3 నెలలు మరియు గృహావసరాల తయారీలో శిక్షణ 2 నెలలు.
*****
(Release ID: 1907219)
Visitor Counter : 99