పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
పంచాయతీలకు నిధులు
Posted On:
14 MAR 2023 4:11PM by PIB Hyderabad
పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం దిగువన పేర్కొన్న అంశాలలో రాష్ట్రాల వారీగా విడుదల చేసిన నిధుల వివరాలు - (1) పంచాయతీలు, గ్రామీణ స్థానిక సంస్థలలో వివిధ అభివృద్ధి పనుల కోసం పద్నాలుగు & పదిహేనవ విత్త కమిషన్లు (2) రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జిఎస్ఎ) పధకం కింద ఉన్న రాష్ట్రాలలో ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ రాజ్ సంస్థల (పిఆర్ఐ)ల సిబ్బంది సామర్ధ్య నిర్మాణం కోసం (3) గత మూడేళ్ళలో, ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహా సేవలు, ప్రజా వస్తువుల బట్వాడాను మెరుగుపరిచేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఉత్తమంగా పని చేస్తున్న పంచాయతీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు సహా అవార్డులను ఇన్సెంటివైజేషన్ ఆఫ్ పంచాయత్స్ (ఐఒపి - పంచాయతీలకు ప్రోత్సాహక పథకం) కింద ఇవ్వనున్నారు. ఈ వివరాలు అనెక్చర్ -1లో జతపరచడం జరిగింది.
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జిఎస్ఎ) పధకం కింద ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ రాజ్ సంస్థల (పిఆర్ ఐ) సిబ్బంది సామర్ధ్య నిర్మాణం కోసం 2019 నుంచి రాష్ట్రాల వారీగా విడుదల చేసిన నిధుల వివరాలను అనెక్చర్ -IIలో చూడవచ్చు.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా కంప్యూటర్ సౌకర్యం లేని, స్వంత భవనం లేని గ్రామ పంచాయతీలు (జిపిలు)/ సంప్రదాయ స్థానిక సంస్థలు (టిఎల్‌బిలు) వివరాలు అనెక్చర్- IIIలో జత పరచడం జరిగింది.
***
(Release ID: 1907019)