రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రేడియోలాజికల్ & న్యూక్లియర్‌ అత్యవసర స్థితి కోసం 'సాంకేతికత అభివృద్ధి నిధి' కింద రూపొందించిన కీలక ఔషధాల ఉత్పత్తి, మార్కెటింగ్‌కు జీసీజీఐ ఆమోదం


డీఆర్‌డీవో సాంకేతికతపై అభివృద్ధి చేసిన ప్రష్యన్‌ బ్లూ ఇన్‌సోల్యుబుల్‌ ఫార్ములేషన్లు

Posted On: 14 MAR 2023 3:46PM by PIB Hyderabad

సాంకేతికత అభివృద్ధి నిధి (టీడీఎఫ్‌) పథకం కింద రూపొందించిన ప్రష్యన్ బ్లూ ఇన్‌సోల్యుబుల్‌ ఫార్ములేషన్లను వాణిజ్య అవసరాల కోసం ఉత్పత్తి చేసి, మార్కెటింగ్ చేసే లైసెన్సులను హిమాచల్‌ప్రదేశ్‌లోని స్కాట్-ఎడిల్ ఫార్మాసియా లిమిటెడ్‌కు, గుజరాత్‌కు చెందిన స్కాంటర్‌ లైఫ్‌సైన్సెస్‌ ఎల్‌ఎల్‌పీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ (జీసీజీఐ) జారీ చేసింది. రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థకు (డీఆర్‌డీవో) చెందిన దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అలైడ్ సైన్సెస్ (ఐఎన్‌ఎంఏఎస్‌) సాంకేతికత ఆధారంగా ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు.

ప్రు-డీకార్ప్‌టీఎం, ప్రుడీకార్ప్‌-ఎంజీ పేరిట ఈ ఔషధం అందుబాటులో ఉంటుంది. సీసియం, థాలియం నియంత్రణ కోసం ఈ ఫార్ములేషన్లను ఉపయోగిస్తారు. రేడియోలాజికల్, న్యూక్లియర్ అత్యవసర స్థితి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) ప్రకటించిన కీలక ఔషధాల్లో ఇది ఒకటి.

రక్షణ విభాగం ఆర్‌&డీ కార్యదర్శి, డీఆర్‌డీవో చైర్మన్ డా.సమీర్ వి కామత్ ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు, సంస్థతో పాటు పరిశ్రమను అభినందించారు. టీడీఎఫ్‌ ప్రాజెక్టు కింద ఈ ఔషధ ఫార్ములేషన్లను అభివృద్ధి చేయడం, డీసీజీఐ ఆమోదాన్ని పొందడం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతను సాధించడానికి డీఆర్‌డీవో చేసిన విజయవంతమైన ప్రయత్నంగా అభివర్ణించారు.

 

*****



(Release ID: 1907014) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi , Gujarati