రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

‘లా పెరౌస్’ – 2023 నౌవికా దళ విన్యాసాలు

Posted On: 13 MAR 2023 3:15PM by PIB Hyderabad

హిందూ మహాసముద్ర ప్రాంతంలో 2023 మార్చి 13 నుండి 14 వరకు బహుపాక్షిక విన్యాసం ‘లా పెరౌస్’ మూడో ఎడిషన్

నిర్వహించబడుతోంది.  ఈ ఎడిషన్‌లో రాయల్ ఆస్ట్రేలియన్ నావికా దళం, ఫ్రెంచ్ నేవీ, ఇండియన్ నేవీ, జపనీస్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, రాయల్ నేవీ మరియు యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన సిబ్బంది, నౌకలు మరియు సమగ్ర స్థాయి హెలికాప్టర్లు ఈ సంయుక్త విన్యసంలో పాల్గొంటున్నాయి. ద్వైవార్షిక వ్యాయామం లా పెరౌస్ ఫ్రెంచ్ నావికాదళంచే నిర్వహించబడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పాల్గొనే నౌకా దళాల మధ్య సముద్ర డొమైన్ అవగాహనను మెరుగుపరచడం, సముద్ర సమన్వయాన్ని ఆప్టిమైజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ రెండు రోజుల నావికదళ విన్యాసాలు నిరంతరాయ సముద్ర కార్యకలాపాల కోసం ప్రణాళిక, సమన్వయం మరియు సమాచార భాగస్వామ్యంలో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇష్టపడే నావికాదళాలకు అవకాశం కలిపిస్తోంది. ఈ విన్యాసం ఉపరితల యుద్ధం, యాంటీ-ఎయిర్ వార్‌ఫేర్, ఎయిర్ డిఫెన్స్ వ్యాయామాలు, క్రాస్ డెక్ ల్యాండింగ్‌లు, వ్యూహాత్మక యుక్తులతో సహా సంక్లిష్టమైన మరియు అధునాతన నావికాదళ కార్యకలాపాలను చూస్తుంది.  స్వదేశీంగా నిర్మించిన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్  సహ్యాద్రి మరియు ఫ్లీట్ ట్యాంకర్ ఐఎన్ఎస్ జ్యోతి ఈ ఎడిషన్ విన్యాసంలో పాల్గొంటాయి. ఈ విన్యాసంలో భారత నావికాదళం పాల్గొనడం వల్ల స్నేహపూర్వక నౌకా దళాల మధ్య ఉన్నత స్థాయి సినర్జీ, సమన్వయం మరియు ఇంటర్-ఆపరేబిలిటీ మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమంలో వారి నిబద్ధతను ప్రదర్శిస్తుంది.

******



(Release ID: 1906783) Visitor Counter : 215


Read this release in: English , Urdu , Marathi , Hindi