రక్షణ మంత్రిత్వ శాఖ
హెచ్ఎఎల్‌కు ఆర్థిక మద్దతు
Posted On:
13 MAR 2023 2:56PM by PIB Hyderabad
ఒక అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్) ఎంకె III, తత్సంబంధిత పంపిణీలెగుమతి కోసం 17 జనవరి, 2022న మారిషస్ ప్రభుత్వంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) ఒప్పందం కుదుర్చుకుంది.మొత్తం ఒప్పందం విలువ 17.670 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 141.52 కోట్లు). ఒప్పందం ప్రకారం, బట్వాడాను 18 నెలలోపు పూర్తి చేయవలసి ఉంది. కాగా, అనుకున్న వ్యవధికి ముందే హెచ్ఎఎల్ బట్వాడా చేసింది.
బెంగుళూరులోని తన కేంద్రంలో హెచ్ఎఎల్‌కు తగిన మౌలికసదుపాయాలు, అనుభవజ్ఞులైన మానవశక్తిని కలిగి ఉంది. అంతేకాకుండా, ఎగుమతి ఆర్డర్లను సకాలంలో పూర్తి చేసి, అమలు చేయడానికి బాగా అభివృద్ధి చెందిన పర్యావరణ వ్యవస్థను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, కర్నాటకలోని తుముకూరులో నూతన కేంద్రం (హెచ్ఎఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ)ని తెరవడం ద్వారా తన మౌలికసదుపాయాల సామర్ధ్యాన్ని హెచ్ఎఎల్ పెంచుకుంది.
వ్యూహాత్మక పరగణనలకు లోబడి, దేశీయంగా ఉత్పత్తి చేసిన రక్షణ ఉత్పత్తులను హెచ్ ఎఎల్ ప్లాట్‌ఫాంలు/ వ్యవస్థలు సహా రుణ పరిమితులు/ నిధుల కేటాయింపు ద్వారా ప్రోత్సహించడం జరుగుతోంది. భారత ప్రభుత్వం కూడా హెచ్ఎఎల్ ప్లాట్‌ఫాంలు/ వ్యవస్థలు సహా దేశీయంగా ఉత్పత్తి చేసిన ప్లాట్‌ఫాంలు/ వ్యవస్థలను ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్ ( ఎఫ్ఎఫ్‌సి - స్నేహపూర్వక విదేశీ దేశాలు)కు అందిస్తుంది. రక్షణ ఒప్పందాలను అమలు చేసేందుకు హెచ్ఎఎల్ సహా భారతీయ రక్షణ కంపెనీలకు మార్గదర్శనం చేసి, తోడ్పడేందుకు రక్షణ సహాధికారులు (డిఫెన్స్ అటాచీస్) ఉండటాన్ని తప్పనిసరి చేసింది. దేశీయ రక్షణ వేదికలను ప్రోత్సహించేందుకు రక్షణ సహాధికారులకు ఆర్థిక తోడ్పాటును కూడా అందిస్తున్నారు.
ఈ సమాచారాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ మంగళవారం రాజ్యసభలో శ్రీ ఎం. షణ్ముగం అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ వెల్లడించారు.
***
(Release ID: 1906777)