ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ పిడిఆర్ ఆర్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ –2023 తృతీయ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

Posted On: 10 MAR 2023 8:18PM by PIB Hyderabad

విపత్తులనుంచి కోలుకునేలా చేయడంలో, విపత్తుల నిర్వహణ పనులలో నిమగ్నమైన వారందరికీ ముందుగా నా అభినందనలు.
చాల సందర్భాలలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి  ఇతరుల ప్రాణాలను కాపాడడానికి మీరు అద్భుతమైన కృషి చేస్తుంటారు.
ఇటీవవవల, టర్కీ, సిరియాలలో భారత బృందం కృషిని మొత్తం ప్రపంచం అభినందించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. 
సహాయ పునరావాస కార్యకలాపాలకు సంబంధించి ఇండియా , మానవ వనరులను పెంచిన తీరు కారణంగా దేశంలో కూడా వివిధ
విపత్తుల సమయంలో ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడడానికి వీలుపడింది. విపత్తల నిర్వహణకు సంబంధించి న వ్యవస్థను
బలోపేతం చేయడంతోపాటు దానిని ప్రోత్సహించాలి. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూడాలి.
అందువల్ల ఈ రంగానకి సంబంధించి ప్రత్యేక అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ రెండు సంస్లలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద
ప్రబంధన్ పురస్కార్ను ఇస్తున్నాము.  తుపాన్లు, సునామీల సమయంలో ఒడిషా రాష్ట్ర విపత్తలు నిర్వహణ యాజమాన్య అథారిటీ అద్భుత కృషి చేస్తోంది.
అలాగే, మిజోరం లుంగ్లీ ఫైర్ స్టేషన్ అడవులలో ఏర్పడే మంటలను ఆర్పడంలో, ఆ మంటలు ఇతర ప్రదేశాలకు వ్యాప్తిచెందకుండా చూసి అడవిని కాపాడడంలో
నిర్విరామంగా కృషి చేస్తోంది. ఈ  సంస్థలలో పనిచేస్తున్న మిత్రులకు నా అభినందనలు.

మిత్రులారా,
“మారుతున్న వాతావరణ పరిస్థితులలో  స్థానికంగా విపత్తులను తట్టుకునే ఏర్పాట్ల నిర్మాణం ”గురించి చర్చించడం ఈ సెషన్ ఉద్దేశం. ఈ అంశం ఇండియాకు ఎంతో పాతది. ఎందుకంటే మన ప్రాచీన సంప్రదాయాలలో ఇది అంతర్గతంగా ఉంది. ఇప్పటికీ మనం మన బావులు, దిగుడుబావులు, రిజర్వాయర్లు, లేదా స్థానిక నిర్మాణ కౌశలాలు, పురాతన నగరాలను గమనించినపుడు ఈ విషయం బొధపడుతుంది. విపత్తుల నిర్వహణకు సంబంధించిన వ్యవస్థలు ఇండియాలో ఎప్పుడూ స్థానికమైనవే.వాటి పరిష్కారాలూ స్థానికమైనవే.
కచ్ ప్రాంత ప్రజలు నివసించే ప్రాంతాలను భుంగా అంటారు. ఇవి మట్టి ఇళ్లు. ఈ శతాబ్దపు తొలినాళ్లలో కచ్ లో భారీ భూకంపానికి కేంద్ర బిందువుగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ భుంగా ఇళ్లపై ఈ భూకంప ప్రభావం ఏమీ లేదు. ఒకటి రెండు చోట్ల స్వల్ప నష్టం జరిగింది అంతే. వాటి సాంకేతికతకు సంబంధంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మనం స్థానిక నమూనాలు, పట్టణ ప్రణాళిక నమూనాలను రూపొందించుకోలేమా? అది స్థానికంగా దొరికే నిర్మాణ సామగ్రా లేక
నిర్మాణ సాంకేతికతా ఏ దైనా కావచ్చు, దానిని నేటి సాంకేతికతతో అభివృద్ధి చేయడం అవసరం. స్థానికంగా విపత్తులను తట్టుకునే నమూనాలకు భవిష్యత్ సాంకేతికతను జోడించినట్టయితే, విపత్తులను తట్టుకునే దిశగా మనం మెరుగైన ఫలితాలు సాధించగలుగుతాం.

మిత్రులారా,

ఇంతకుముందు జీవన శైలి ఎంతో సాధారణంగా ఉండేది.  విపరీతమైన వర్షాలు, వరదలు, కరవుల వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో మనకు అనుభవాలు చాటిచెప్పాయి. అందుకే సహజంగా ప్రభుత్వాలు కూడా విపత్తు సహాయక చర్యలను వ్యవసాయ శాఖతో అనుసంధానం చేశాయి. భూకంపం వంటి తీవ్ర విపత్తులు ఏర్పడినప్పటికీ, వాటని స్థానిక వనరులతోనే ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచం నానాటికీ చిన్నదైపోతున్నది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని నిర్మాణ అనుభవాలను అందిపుచ్చుకుని, నిర్మాణ సాంకేతికతలో
 కొత్త విషయాలు గ్రహిస్తున్నారు. అదే సమయంలో విపత్తులు కూడా పెరుగుతున్నాయి. పాత రోజులలో ఒకే ఒక వైద్యరాజ్ (ఫిజీషియన్) అందరికీ వైద్యం చేసేవారు. గ్రామం మొత్తం ఆరోగ్యంగా ఉండేది. ప్రస్తుతం ప్రతి జబ్బుకు ఆయా విభాగాల వైద్యులు ఉన్నారు. అలాగే, విపత్తులను తట్టుకునేందుకు డైనమిక్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకు , గత వంద   సంవత్సరాల అధ్యయనం ఆధారంగా వివిధ ప్రాంతాలను విపత్తుల కు సంబంధించి జోన్లుగా విభజించవచ్చు.  ఈ వంద సంవత్సరాలలో వరదల స్థాయి ఎలా ఉంటూ వచ్చింది వంటి వాటిని గమనించి, అందుకు అనుగుణంగా నిర్మాణపనులను చేపట్టవచ్చు. ఆయా కాలాలకు అనుగుణంగా ఈ ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అది వస్తువులకు సంబంధించి అయినా లేదా వ్యవస్థలకు సంబంధించి అయినా సమీక్ష చేసుకుంటుండాలి.

మిత్రులారా,
విపత్తుల నిర్వహణను బలోపేతం చేయాలంటే గుర్తింపు, సంస్కరణ ఎంతో అవసరం. గుర్తింపు అంటే విపత్తు వచ్చిపడడానికి గల అవకాశాన్ని గుర్తించడం,
అది భవిష్యత్తులో ఎలా  ఏర్పడవచ్చో తెలుసుకోవడం. సంస్కరణ అంటే విపత్తు ప్రభావాన్ని తగ్గించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం.
విపత్తుల ముప్పును తగ్గించడానికి మెరుగైన మార్గం, వ్వవస్థను బలోపేతం చేసుకోవడం. వీలైనంత త్వరగా దానిని సమర్ధంగా తీర్చిదిద్దుకోవడం.
ఈ విషయంలో దగ్గరి దారులు వెతకడం కాద, దీర్ధకాలిక ఆలోచనలు ఉండాలి. తుపాన్ల గురించి మనం ఇప్పుడు చూసినట్టయితే, ఒకప్పుడు  తుపాన్ల వల్ల వందలకొద్దీ జనం చనిపోతూ వచ్చారు. మనం దీనిని జాగ్రత్తగా గమనించాం. ఒడిషా , పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో ఇలాంటివి  చాలా చూశాం. అయితే ఇప్పుడు కాలం మారింది. వ్యూహాలు మారాయి. విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత మెరుగుపడింది. తుపాన్లను ఎదుర్కోవడంలో ఇండియా సామర్ధ్యమూ పెరిగింది. ఇప్పుడు ఏదైనా తుపాను వస్తే , ఆస్తి , ప్రాణ నష్టం కనీస స్థాయిలోనే ఉంటున్నది. మనం ప్రకృతి వైపరీత్యాలను  తప్పించలేమన్నది వాస్తవం. అయితే నష్టాన్ని తగ్గించడానికి మనం తప్పకుండా ఏర్పాట్లు చేయగలం. మనం సానుకూలంగా స్పందించాలి.

మిత్రులారా,
గతంలో మనదేశంలో సానుకూల దృక్పథానికి సంబంధించి పరిస్థితులు ఎలా ఉండేవో , ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నేను చెబుతాను. స్వాతంత్ర్యానంతరం, 5 దశాబ్దాలు గడిచిపోయాయి. అర్థ శతాబ్దం గడిచిపోయింది. అయినా విపత్తుల నిర్వహణకు సంబంధించి చట్టమంటూ ఏదీ లేదు. 2001లో కచ్ భూకంపం తర్వాత రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టాన్ని తీసుకువచ్చిన మొదటి రాష్ట్రం గుజరాత్. ఈ చట్టం ఆధారంగా 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనితర్వాతనే
ఇండియాలో జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీని ఏర్పాటు చేశారు. మిత్రులారా,

స్థానిక సంస్థలలో , పట్టణ స్థానిక సంస్థలలో మనం విపత్తుల నిర్వహణను బలోపేతం చేయవలసి ఉంది. విపత్తులు వచ్చపడినప్పుడు మేలుకోవడం, స్పందించడం సరికాదు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను మనం ముందుగానే రూపొందించుకోవాలి. దానిని వ్యవస్థాగతం చేయాలి. మనం స్థానిక ప్రణాళికను సమీక్షించాలి. భవన నిర్మాణాలకు సంబంధించి , అలాగే నూతన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి, మనం నూతన మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. ఆ రకంగా మొత్తం వ్యవస్థను మెరుగుపరచాలి. ఇందుకు మనం  రెండు స్థాయిలలో పనిచేయాలి. మొదటిది, విపత్తుల నిర్వహణకు సంబంధించిన నిపుణులు, ప్రజలను ఇందులో భాగస్వాములను చేయడంపై వీలైనంత ఎక్కువ దృష్టి పెట్టాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఇండియా ఏ రకంగా ప్రధాన లక్ష్యాలను చేరుకుంటున్నదో మనం చూస్తూనే ఉన్నాం. విపత్తుల నిర్వహణ విషయానికి వచ్చినపుడు ప్రజల భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదు. 
స్థానిక భాగస్వామ్యంతో స్థానికంగా విపత్తులనుంచి తట్టుకునే ఏర్పాట్లు అనే మంత్రం ద్వారా మనం విజయం సాధించచచగలం. భూకంపాలు, తుపాన్లు, అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తులను ఎదుర్కొవడంపై ప్రజలకు నిరంతరం అవగాహన అవసరం. ఇలాంటి అంశాలకు సంబంధించి సరైన నిబంధనలు, నియంత్రణలు, విధులపై నిరంతరాయంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఉండాలి. మనం మన యువతకు సహాయ, రక్షణ చర్యలకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. యువమండల్, సఖి మండల్, ఇతర గ్రూపులను గ్రామస్థాయిలో
పొరుగున, స్థానిక స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఆపద మిత్ర, ఎన్సిసి, ఎన్ ఎస్ ఎస్, మాజీ సైనికులతో ఒక డాటా బ్యాంక్ను ఏర్పాటు చేయాలి. అలాగే సత్వర కమ్యూనికేషన్ కు మనం ఏర్పాట్లు చేయాలి. కమ్యూనిటీ కేంద్రాలో సత్వర స్పందనకు ఏర్పాట్లు చేయాలి. వీటి నిర్వహణకు సంబంధించి తగిన శిక్షణ కూడా అవసరం. నా అనుభవాన్ని బట్టి, కొన్నిసందర్భాలలో సమాచార నిధి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గుజరాత్లో ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒక సారి ఖేడా జిల్లాలోని నదికి వరదలు వస్తాయి. ఒక సారి ఏడాదిలో ఐదు సార్లు వరదలు రావడంతో, ఆ సమయంలో విపత్తు నిర్వహణకు సంబంధించి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ సమయంలో స్థానిక భాషలో సందేశాలు పంపడానికి ఏర్పాటు ఏదీ లేదు. అందువల్ల మేము  గుజరాతి సందేశాలను  రోమన్ స్క్రిప్ట్లోనే పంపేందుకు ఏర్పాట్లు చేశాం. “ఇన్ని గంటల తర్వాత వరదలు వచ్చే అవకాశం ఉంది”అని  గ్రామస్థులకు తెలియజేస్తూ సందేశాలు పంపే ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 5 వరదలు వచ్చినా  ఒక్క మనిషి కానీ లేదా ఒక్క జంతువు కానీ చనిపోలేదన్నది నాకు బాగా గుర్తు. సమాచారం సకాలంలో అందడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే మనం ఈ వ్యవస్థలను ఎలా  ఉపయోగిస్తాం. సహాయ, రక్షణ చర్యలను సకాలంలో ప్రారంభించినట్టయితే,మనం ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి వీలు కలుగుతుంది. ఇక రెండోది సాంకేతికతను ఉపయోగించడం. ప్రతి ఇల్లు, ప్రతి వీధిని రియల్ టైమ్లో గమనిస్తూ ఉండేలా రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉండాలి. ఏ ఇల్లు, ఇది ఎంత పాతది, ఏ వీధి; అక్కడ డ్రైనేజ్ పరిస్తితి ఎలా ఉంది, విద్యుత్తు,నీరు, వీటికి సంబంధించి  పరిస్తితి ఎలా ఉంది; వంటి వాటిని గమనించాలి. కొద్ది రోజుల క్రితం నేను ఒక సమావేశంలో ఉన్నాను. ఆ సమావేశం ముఖ్యాంశం వడగాడ్పులకు సంబంధించినది. ఇంతకు ముందు మనం ఆస్పత్రులలో రెండు అగ్నిప్రమాదాలను చూశాం. ఇవి ఎంతో బాధాకరమైనవి. పేషెంట్లు నిస్సహాయులైపోయారు. ఇప్పుడు ఆస్పత్రుల వ్యవస్థను జాగ్రత్తగా గమనించడం జరుగుతోంది.
దీనివల్ల ప్రధానమైన ప్రమాదాలను నివారించడానికి వీలు కలుగుతుంది. మనకు అక్కడి పరిస్థితికి సంబంధించి ఎంత కచ్చితమైన సమాచారం ఉంటే అంత కచ్చితంగా
సానుకూల నిర్ణయాలను మనం తీసుకోగలుగుతాం.

మిత్రులారా,
బాగా రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాలలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలకు మనం చూస్తున్నాం. ఎండలు పెరిగిన కొద్దీ, కొన్నిసార్లు ఆస్పత్రులలో , ఫాక్టరీలలో, హోటళ్లలో, బహుళ అంతస్థుల భవనాలలో అగ్నిప్రమాదాలు చోటు చే సుకుంటున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు, మనం ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించాలి. అది మానవ వనరుల అభివృద్ధి, సాంకేతికత, వనరులు, వ్యవస్థలు ఏవైనా మనం వాటిని ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. ఇందుకు మనం సమన్వయంతో ప్రభుత్వం మొత్తం అన్న భావనతో పనిచేయాలి.
జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలలోకి కారు వెళ్లడం కూడా కష్టమే. అలాంటపుడు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకోవడం ఎంతో కష్టం. ఇందుకు మనం తగిన పరిష్కారాలను కనుగొనాలి. బహుళ అంతస్తుల భవనాలలో చెలరేగే మంటలను ఆర్పేందుకు, మన అగ్నిమాపక సిబ్బంది నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచవలసి ఉంది. అలాగే పారిశ్రామిక అగ్ని ప్రమాదాల నివారణకు మనం అదనపు వనరులు ఉండేట్టు చూసుకోవాలి.
మిత్రులారా,
ఈ విపత్తు నిర్వహన చర్యలలో, నైపుణ్యాలను ఆధునీకరించడం, స్థానికంగా పరికరాలను ఆధునీకరించడం కూడా ఎంతో ముఖ్యమైనవి. ఉదాహరణకు, అటవీ వ్యర్ధాలను బయో ఇంధనంగా మార్చే పరికరాలు చాలా ఉన్నాయి. మన మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ పరికరాలను ఇచ్చి, వారిని ఇందులో భాగస్వాములను చేయవచ్చా అన్నది ఆలోచించాలి. వారు అటవీ వ్యర్థాలను సేకరించి, ప్రాసెస్ చేసి, వాటినుంచి ఉత్పత్తులు చేయడం వల్ల అటవీ అగ్ని ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయి. ఇది వారి రాబడిని పెంచడమే కాకుండా, అడవులలో అగ్నిప్రమాదాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆస్పత్రులు, పరిశ్రమల వంటి వాటిలో అగ్ని ప్రమాదం, గ్యాస్ లీక్ ప్రమాదం వంటి వాటికి అవకాశం ఉన్నచోట
ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారిని అక్కడ ఉండేలా చూసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వంతో భాగస్వాములు కావచ్చు. మనం మన అంబులెన్స్ నెట్ వర్క్ను విస్తృతం చేసుకోవడం తో పాటు భవిష్యత్తుకు దీనిని సిద్దంగా ఉంచుకోవాలి. 5జి, కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటిని ఉపయోగించుకుని దీనిని మరింత బాధ్యతాయుతంగా, మరింత మెరుగుగా ఉండేట్టు ఎలా చూడగలమన్నదానిని చర్చించాలి. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ, పునరావాస చర్యలలో మనం ఎలా ఉపయోగించుకోవచ్చో చూడాలి. ఇలాంటి ఉపకరణాలపై మనం దృష్టిపెట్టవచ్చేమో చూడాలి.  ప్రకృతి విపత్తలు విషయంలో మనలను అప్రమత్తం చేసే వాటిని, శిథిలాల కింద చిక్కకుపోయిన వారిని గుర్తించే పరికరాలను
ఆయా వ్యక్తుల పరిస్థితిని తెలియజేసే వాటిని సమకూర్చుకోవడంపైన ఈ దిశగా ఆవిష్కరణలపైన మనం దృష్టి సారించాలి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో చాలా సామాజిక సంస్థలు ఉన్నాయి. అవి సాంకేతికత సమాయంతో కొత్త వ్యవస్థలను రూపొందిస్తున్నాయి.  మనం వాటిని కూడా అధ్యయనం చేయాలి. వాటి నుంచి మెరుగైన పద్ధతులను అందిపుచ్చుకోవాలి.


మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా విపత్తుల విషయంలో సత్వరం స్పందించేందుకు ఇండియా ప్రస్తుతం ప్రయత్నిస్తోంది.అలాగే  విపత్తులను తట్టుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. ఇవాళ ప్రపంచంలోని 100కు పైగా దేశాలు, ఇండియా నాయకత్వంలోని విపత్తులనుంచి రక్షించే మౌలికసదుపాయాల కూటమిలో చేరాయి. సంప్రదాయం, సాంకేతికత మన బలం.ఈ బలంతో విపత్తులను ఎదుర్కోవడానికి సంబంధించి మనం అత్యుత్తమ నమూనాలను రూపొందించవచ్చు. ఇది కేవలం ఇండియాకే కాక మొత్తం ప్రపంచానికి పనికివస్తుంది. 
ఈ సమావేశ చర్చలు , సూచనలు, పరిష్కారాలలో ఎన్నో కొత్త విషయాలు మనకు తెలిసే అవకాశం ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఈ రెండ రోజుల శిఖరాగ్ర సమావేశంలో కార్యాచరణతో కూడిన అంశాలు రూపుదిద్దుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాగల వర్షాకాలానికి ముందే ఈ రకమైన సన్నద్ధపై చర్చించడానికి ఇది సరైన సమయంగా నేను భావిస్తున్నాను.అందువల్ల, మనం ఈ రకమైన వ్యవస్థను మనం రాష్ట్రాలలో, మెట్రో నగరాలలో, పట్టణాలలో ముందుకు తీసుకువెళ్లాలి.  మనం దీనిని ప్రారంభించి, వర్షాకాలానికి ముందు మొత్తం వ్యవస్థను మరింతగా అప్రమత్తంగా ఉండేలా చేసినట్టయితే  నష్టాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన చర్యల విషయంలో తగిన సన్నద్ధతో ఉన్నట్టయితే మనం నష్టాలను నివారించవచ్చు. ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు శుభాభినందనలు తెలుపుతున్నాను. 
ధన్యవాదాలు.
(గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి  ఇది సంక్షిప్త తెలుగు అనువాదం)

***


(Release ID: 1906051) Visitor Counter : 207