ఆయుష్

100 రోజుల కౌంట్‌డౌన్‌ రూపంలో యోగా మహోత్సవ్ 2023తో ప్రారంభం కానున్న 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం


గ్రామ పంచాయతీ/గ్రామసభల భాగస్వామ్యం ద్వారా దేశంలోని ప్రతి గ్రామానికి యోగాను తీసుకెళ్లడంపై దృష్టి పెట్టిన ఐడీవై 2023

Posted On: 11 MAR 2023 3:51PM by PIB Hyderabad

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగాతో (ఎండీఎన్‌ఐవై) కలిసి, మార్చి 13, 14 తేదీల్లో దిల్లీలోని తల్కటోరా స్టేడియంలో యోగా మహోత్సవ్ 2023ను ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. మార్చి 15, 2023న ఎండీఎన్‌ఐవైలో మహోత్సవ్ తర్వాతి యోగా కార్యశాలలను నిర్వహిస్తుంది. జీ20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో, "వసుధైవ కుటుంబం" ఆధారంగా "ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం" అనే అంశంతో ప్రపంచ సమాజాన్ని అనుసంధానించడానికి ప్రయత్నించడం ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) ఉద్దేశం. ప్రపంచ స్థాయి వ్యాప్తి కార్యక్రమాలతో పాటు, గ్రామ పంచాయతీలు/గ్రామసభలు చురుకుగా పాల్గొనేలా చేయడం ద్వారా దేశంలోని ప్రతి గ్రామానికి యోగాను తీసుకెళ్లడంపై ఐడీవై దృష్టి సారిస్తుంది.

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ యోగా మహోత్సవ్ 2023ను ప్రారంభిస్తారు. కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ బీరెన్ సింగ్, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపరా మహేంద్రభాయ్ కాలుభాయ్, బెంగళూరు ఎస్‌వీవైఏఎస్‌ఏ కులపతి డా.హెచ్‌.ఆర్‌. నాగేంద్ర, రాజస్థాన్‌లోని తేరాపంత్ సమాజ్‌కు చెందిన శ్రీ మునిశ్రీ కమల్ కుమార్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023కు జ్ఞాపికగా 100 రోజుల ముందు ప్రారంభమయ్యే కార్యక్రమం యోగా మహోత్సవ్ 2023. ఈ సంవత్సరం, యోగాలోని విభిన్న కోణాలు, ప్రయోజనాలకు విస్తృత ప్రచారం కల్పించడానికి యోగా మహోత్సవ్-2023 నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతిని పెంపొందించేలా సామూహిక ఉద్యమాన్ని ప్రారంభించండం దీని ఉద్దేశం. కౌంట్‌డౌన్‌ ప్రారంభ సూచికగా దిల్లీ ఎన్‌సీఆర్‌లోని 100 ప్రదేశాల్లో సామూహిక యోగా ప్రదర్శనలు/కార్యక్రమాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 100 రోజులు, 100 నగరాలు, 100 సంస్థల కార్యకలాపాల ద్వారా కొనసాగుతుంది.

ప్రముఖ యోగా గురువులు, ఆయుష్ నిపుణులు, ప్రతినిధులు, ప్రజల ఉత్సాహానికి, ఉపన్యాసాలకు సాక్ష్యంలా యోగా మహోత్సవ్ 2023 నిలుస్తుంది.

మూడు రోజుల యోగా మహోత్సవ్ 2023లో యోగా గురువులు, ఉప కులపతుల సదస్సులు, చర్చలు/ఉపన్యాసాలు ఉంటాయి. ప్రముఖ సంస్థల అధిపతులు తమ అనుభవాలను ఇందులో పంచుకుంటారు. రాష్ట్రాలు/యూటీల ఆయుష్ సదస్సు, యోగాభ్యాసాలు, యోగా లయబద్ధ ప్రదర్శన, క్విజ్/ప్రసంగాలు/పోస్టర్ రూపకల్పనలు, వై బ్రేక్ & సీవైపీ ప్రదర్శనలు కూడా ఉంటాయి.

ఈ సంవత్సరం యోగా మహోత్సవంలో అంగన్‌వాడీ కార్యకర్తలు/ఆశా వర్కర్లు/స్వయం సహాయక బృందాలు, ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు, నివాసుల సంక్షేమ సంఘాలు, మహిళా సంక్షేమ సంస్థలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాలు/విశ్వవిద్యాలయాలు/యోగా విశ్వవిద్యాలయాలు/యోగా కళాశాలలు & సంస్థలు, ఆయుర్వేద, సిద్ధ హోమియోపతి & యునాని కళాశాలలు, నేచురోపతి & యోగా కళాశాలలు, పాఠశాలల, పరిశోధన మండళ్లు/జాతీయ సంస్థలు/ఎన్‌సీఐఎస్‌ఎం/ఎన్‌సీహెచ్‌/పీసీఐఎం&హెచ్‌/ఎన్‌ఎంపీబీ, ఇతర వర్గాలు చురుగ్గా పాల్గొంటాయి.

భారతదేశంలో ఐడీవైకి నోడల్ మంత్రిత్వ శాఖగా ఉన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ, గత ఎనిమిది అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహించడంలో ముందుంది. ఈ యోగా దినోత్సవాలు గొప్ప ఉత్సాహాన్ని, ప్రపంచవ్యాప్త మద్దతును పొందాయి. మొత్తం భారత ప్రభుత్వ యంత్రాంగ విధానం & మద్దతుతో, ప్రపంచవ్యాప్తంగా యోగా సందేశాన్ని వ్యాప్తి చేసేలా గత 8 సంవత్సరాలుగా సాధించిన పురోగతిని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

***



(Release ID: 1906046) Visitor Counter : 147