పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

పంచాయతీరాజ్ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం కింద ఆన్‌లైన్ ఆడిట్, విడుదల ప్రక్రియపై రాష్ట్రాలతో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించిన పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

Posted On: 10 MAR 2023 4:59PM by PIB Hyderabad

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ 10 మార్చి 2023న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో పంచాయతీరాజ్ సంస్థలకు ఆన్‌లైన్ ఆడిట్‌లు మరియు 15వ ఆర్థిక సంఘం కింద విడుదల చేసే విధానాన్ని చర్చించడానికి రాష్ట్రాలతో ఒక రోజు సంప్రదింపుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు. త్రాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి శ్రీమతి విని మహాజన్ మరియు అదనపు డిప్యూటీ కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ (స్థానిక సంస్థలు) శ్రీ సుబీర్ మల్లిక్ సమక్షంలో సమావేశం జరిగింది. సమావేశంలో అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అలోక్ ప్రేమ్ నగర్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, 20కి పైగా రాష్ట్రాల నుండి డైరెక్టరేట్ ఆఫ్ లోకల్ ఫండ్ మరియు ఆడిట్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

image.png


పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ తన ప్రధాన ప్రసంగంలో ఆన్‌లైన్ ఆడిట్ ద్వారా పిఆర్‌ఐలలో జవాబుదారీతనం మరియు పారదర్శకతను ప్రోత్సహించడంలో రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాల ఆదర్శప్రాయమైన ప్రయత్నాలను గుర్తించారు. పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్..రాష్ట్రాలు అట్టడుగు స్థాయిలో ఆర్థిక వికేంద్రీకరణలో కార్యాచరణ లోపాలను గుర్తించాలని సూచించారు మరియు ఆడిట్ పరిశీలనలు మరియు చర్య తీసుకున్న నివేదికపై ఎక్కువ దృష్టి పెట్టాలని తెలిపారు.

 

image.png


పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి శ్రీమతి. విని మహాజన్ సమావేశంలో ప్రారంభ వ్యాఖ్యలు చేస్తూ..త్రాగునీరు మరియు  నీటి భద్రత, తగినంత ఓ&ఎం ఆస్తులు మరియు గ్రామాల్లో పారిశుధ్యంపై ఉద్ఘాటించారు. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, జల్ జీవన్ మిషన్ మరియు స్టేట్ ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల కలయిక పిఆర్‌ఐ లకు గ్రామాల్లో నీటి భద్రత మరియు పరిశుభ్రతను నిర్ధారించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందజేస్తుందని డిడిడబ్ల్యూఎస్‌ కార్యదర్శి గుర్తించారు.

 

image.png

 

కాగ్‌ అదనపు డిప్యూటీ శ్రీ సుబీర్ మల్లిక్ మాట్లాడుతూ..ఇగ్రామ్‌స్వరాజ్, ఆడిట్ ఆన్‌లైన్ మరియు ఇజీఎస్‌పిఐ వంటి యంత్రాంగాలు పంచాయితీ రాజ్ సంస్థలలో సమర్థవంతమైన ఆడిటింగ్‌కు ఎనేబుల్‌లుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఆడిట్ పరిశీలనలపై పురోగతిని పర్యవేక్షించడానికి యాక్షన్ టేక్ రిపోర్ట్ (ఏటిఆర్) కీలకం మరియు పిఆర్‌ఐ స్థాయిలో జవాబుదారీతనాన్ని సమర్థించడం కోసం అవసరం. ఆడిట్ పరిశీలనల పరిష్కారాన్ని నిర్ధారించడానికి మరియు అట్టడుగు స్థాయిలో జవాబుదారీతనాన్ని తగ్గించడానికి జిల్లా స్థాయి మరియు గ్రామసభ స్థాయిలో పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అదనపు డిప్యూటీ కాగ్ స్పష్టం చేశారు.

 

image.png

 

పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్.. పంచాయతీల ఆన్‌లైన్ ఆడిట్‌లు మరియు ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్‌ల పంపిణీపై సూచనల కోసం ఈ వేదికను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలకు ఉద్ఘాటించారు.

15వ ఆర్థిక సంఘం  కోసం విడుదల చేయడానికి కార్యాచరణ మార్గదర్శకాలను హైలైట్ చేస్తూ ఎంఒపిఆర్‌ జాయింట్ సెక్రటరీ శ్రీ అలోక్ ప్రేమ్ నగర్ కూడా సంక్షిప్త ప్రదర్శనను అందించారు మరియు ఇగ్రామ్‌స్వరాజ్ మరియు ఆడిట్ ఆన్‌లైన్‌లో రాష్ట్రాల పురోగతిని కూడా చూపించారు. ఇప్పటికే ఉన్న గ్రాంట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లలో ఏవైనా సవరణల కోసం సూచనలు కూడా రాష్ట్రాల నుండి కోరబడ్డాయి.ఇగ్రామ్‌స్వరాజ్‌ మరియు ఆన్‌లైన్ ఆడిట్‌లో 100% ఆన్‌బోర్డింగ్ కోసం ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని కూడా రాష్ట్రాలు సూచించబడ్డాయి.

 

image.png

 

అస్సాం, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సమావేశంలో చురుకుగా పాల్గొని ఎఫ్‌సి గ్రాంట్‌ల వినియోగంలో జవాబుదారీతనం మరియు పారదర్శకతను ప్రోత్సహించడం మరియు ఇగ్రామ్‌స్వరాజ్‌ మరియు ఆడిట్ ఆన్‌లైన్‌లో పిఆర్‌ఐల ఆన్‌బోర్డింగ్ కోసం వారి వ్యూహంపై విలువైన సూచనలు చేశాయి.

 

*****



(Release ID: 1905822) Visitor Counter : 131