పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఢిల్లీ వాయు నాణ్యత సూచిక మొత్తం గణనీయంగా మెరుగుపడటంతో జీ ఆర్ ఏ పీ దశ-I రద్దు చేయబడింది
ఢిల్లీలోని వాయు నాణ్యత సూచిక రాబోయే రోజుల్లో ‘మోస్తరు' కేటగిరీలో ఉండే అవకాశం ఉంది
प्रविष्टि तिथि:
09 MAR 2023 6:48PM by PIB Hyderabad
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) అందించిన వాయు నాణ్యత సూచిక బులెటిన్ ప్రకారం, ఢిల్లీ యొక్క సగటు వాయు నాణ్యత సూచిక (AQI) ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 119 గా నమోదు అయ్యింది. ఢిల్లీ యొక్క మొత్తం ఏ క్యూ ఐ లో గణనీయమైన మెరుగుదల మరియు ఐఐటీఎం /ఐఎండీ వాతావరణ/వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ఎన్ సీ ఆర్ వాయు నాణ్యత మేనేజ్‌మెంట్ కోసం కమిషన్ యొక్క గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద ఢిల్లీ-ఎన్ సీ ఆర్ ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల ప్రస్తుతగాలి నాణ్యతను సమీక్షించడానికి చర్యలను ప్రారంభించే సబ్-కమిటీ ఈరోజు సమావేశమయ్యింది. ఢిల్లీ-ఎన్ సీ ఆర్ గాలి నాణ్యత పారామితులను, ఐఐటీఎం /ఐఎండీ అంచనాలు, ఢిల్లీ ఏ క్యూ ఐ, ఇతర అంశాలను సమగ్రంగా సమీక్షిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో గాలి నాణ్యత అసాధారణంగా క్షీణించడాన్ని సూచించలేదని సబ్-కమిటీ పేర్కొంది. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మోస్తరు గా ఉండే అంచనా అందువల్ల, మొత్తం ఎన్ సీ ఆర్ లో తక్షణమే అమలులోకి వచ్చేలా జీ ఆర్ ఏ పీ స్టేజ్-I కింద ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సబ్-కమిటీ పరిగణించింది.
08.03.2023 న ఈ రోజు నమోదైన న ఢిల్లీ యొక్క మొత్తం ఏ క్యూ ఐ గమనించినట్లయితే 213 స్థాయి ('అధమ' స్థాయి యొక్క దిగువ స్థాయి) నుండి 119 ('మధ్యస్థ' స్థాయి) వరకు గణనీయంగా మెరుగుపడింది. సాధారణంగా మార్చి, 2023లో ఇప్పటివరకు 02.03.2023 మరియు 08.03.2023 మినహా ' మోస్తరు' కేటగిరీలో ఉంది.
సబ్-కమిటీ యొక్క మునుపటి నిర్ణయాల ఆధారంగా, ఐఐటీఎం /ఐఎండీ అందించిన వాతావరణ/వాతావరణ శాస్త్ర సూచనలతో పాటు గాలి నాణ్యత ఆధారంగా జీ ఆర్ ఏ పీ కింద చర్యలను ప్రారంభించబడ్డాయి. జీ ఆర్ ఏ పీ యొక్క వివిధ దశలు కాలానుగుణంగా అమలు చేయబడ్డాయి మళ్లీ రద్దు చేయబడ్డాయి. జీ ఆర్ ఏ పీ యొక్క దశ-I కింద నివారణ/నియంత్రణ చర్యలు అక్టోబర్ 5, 2022 నుండి అమలులో ఉన్నాయి.
ఇప్పుడు, ఐఐటీఎం /ఐఎండీ వాతావరణ/వాతావరణ సూచనల ప్రకారం, మంచి గాలి వేగం మరియు అధిక వెంటిలేషన్ ఇండెక్స్ కారణంగా కాలుష్య కారకాలను చెల్లాచెదురు కావడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులతో రాబోయే రోజుల్లో ఢిల్లీ మొత్తం గాలి నాణ్యతలో నిరంతర మెరుగుదలని సూచిస్తోంది. మొత్తం ఎన్ సీ ఆర్ ప్రాంతం లో జీ ఆర్ ఏ పీ దశ-I కింద చర్యలను అమలు చేయడం కోసం అక్టోబర్ 05, 2022 తేదీన జారీ చేసిన ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
ఎన్‌సిఆర్ ప్రాంతం లోని రాష్ట్ర ప్రభుత్వాలు / జిఎన్‌సిటిడికి సంబంధించిన అన్ని ఏజెన్సీలు, ప్రస్తుతం అనుభవిస్తున్నట్లుగా మెరుగైన ఏ క్యూ ఐ స్థాయిలను కొనసాగించే ప్రయత్నంలో మరియు గాలి నాణ్యత “పేలవమైన” స్థాయి కి జారిపోకుండా చూసుకోవాలి, అయితే అన్ని చట్టబద్ధమైన ఆదేశాలు ఉండేలా చూసుకోవాలి. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు సీ పీ సీ బీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు / జిఎన్‌సిటిడి మరియు కాలుష్య నియంత్రణ బోర్డులు / డీ పీ సీ సీ కింది ప్రధాన సహకార రంగాలు జారీ చేసిన నియమాలు / నిబంధనలు / మార్గదర్శకాలు మరియు సంబంధిత సూచనలు/ మార్గదర్శకాలతో సహా కమిషన్ జారీ చేసిన సలహాలు, ఆదేశాలు మొదలైనవి ఖచ్చితంగా పాటించబడతాయి మరియు చిత్తశుద్ధి స్ఫూర్తితో అమలు చేయబడతాయి.
i ) నిర్మాణం మరియు కూల్చివేత కార్యకలాపాల నుండి ధూళిని తగ్గించే చర్యలు
ii ) రోడ్లు, మార్గాలు / మార్గం మరియు బహిరంగ iii ) ప్రదేశాల నుండి దుమ్ము / వాయు కాలుష్య నియంత్రణ
iv ) పారిశ్రామిక కార్యకలాపాల నుండి ఉద్గారాలు
రవాణా వాహనాల నుండి ఉద్గారాలు
v ) వ్యవసాయ వ్యర్థాలను బహిరంగంగా తగుల బెట్టడం
vi ) వివిధ ఇతర కారకాలు మూలాలు మరియు గృహ కాలుష్యం
ఈ సందర్భంలో, ఎన్‌సిఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కమిషన్ జారీ చేసిన సమగ్ర విధానం రూపొందించిన వివిధ చర్యలు మరియు లక్ష్యసమయపాలనలను అన్ని సంబంధిత ఏజెన్సీలు కూడా గమనించాలి మరియు తదనుగుణంగా క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలి.
***
(रिलीज़ आईडी: 1905506)
आगंतुक पटल : 186