రక్షణ మంత్రిత్వ శాఖ
ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచార్డ్ మార్లేస్‌తో టెలిఫోన్ సంభాషణను జరిపిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్
ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇరు పక్షాలు
Posted On:
09 MAR 2023 4:50PM by PIB Hyderabad
ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాన మంత్రి & రక్షణ మంత్రి అయిన రిచార్డ్ మార్లేస్‌తో రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ టెలిఫోన్ ద్వారా ముచ్చటించారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మంత్రులిద్దరూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ముఖ్యంగా రక్షణ, భద్రతకు సంబంధించిన వ్యవహారాలలో ఇరు దేశాల మధ్య ఉన్న విశ్వాసాన్ని, స్నేహాన్ని ఈ సంభాషణ ప్రతిఫలిస్తోంది.
భారతదేశం, ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అనుసరించడమే కాక ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా పెరుగుతోంది.
***
(Release ID: 1905498)
Visitor Counter : 162