రైల్వే మంత్రిత్వ శాఖ
విద్యుత్తు రంగం డిమాండ్‌ను తీర్చేలా బొగ్గు రవాణాకు ప్రాధాన్యతనిస్తున్న భారతీయ రైల్వే
- సంవత్సరంలో విద్యు్త్తు రంగానికి అవసరమైన ర్యాకుల డిమాండ్ అంచనాను తీర్చేలా చర్యలు
- ఈ ఏడాది ఫిబ్రవరి' నెలలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు రోజుకు 426.3 ర్యాకుల బొగ్గు లోడ్ చేయబడింది
- గత ఏడాది ఇదే సమయంలో ( ఫిబ్రవరి'22లో) రోజుకు 399 ర్యాకుల లోడ్ మాత్రమే నిర్వహించబడింది
- బొగ్గు రవాణాకు చురుకైన విధానాన్ని అవలంబిస్తున్న భారతీయ రైల్వేలు
Posted On:
09 MAR 2023 4:29PM by PIB Hyderabad
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి వరకు) టన్నేజీ మరియు ఎన్.టి.కె.ఎం పరంగా భారతీయ రైల్వేల బొగ్గు రవాణా వరుసగా 11.92 శాతం మరియు 24.51 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-ఫిబ్రవరి) వివిధ వనరుల నుండి విద్యు్తు రంగానికి ర్యాకుల లోడ్ రోజుకు 408 రేక్‌లకు చేరింది. గత సంవత్సరం ఇది రోజుకు 344 ర్యాకులుగా ఉండేది. అంటే రోజుకు 64 ర్యాకుల పెరుగుదల నమోదు అయింది. 2023 ఫిబ్రవరి నెలలో పవర్ హౌస్‌ల కోసం రోజుకు 426.3 రేక్‌లు లోడ్ చేయబడ్డాయి, గత ఏడాది ఇదే సమయంలో (ఫిబ్రవరి 22లో) రోజుకు 399 ర్యాకులు మాత్రమే లోడ్ చేయబడినాయి. అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో లోడింగ్ 27.3 ర్యాకుల మేర పెరిగింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో విద్యు్త్తు రంగానికి అవసరమైన ర్యాకుల డిమాండ్ అంచనాను తీర్చడానికి గాను ఈ క్రింది చర్యలు తీసుకోబడ్డాయి:- రేకు
ఎ) ఏప్రిల్-22 నుండి జనవరి-23 మధ్య కాలంలో మేటిగా బొగ్గును మోసుకెళ్ళేందుకు గాను అధిక చోధక శక్తి కలిగిన వ్యాగన్లయిన – 7692 బి.ఒ.ఎక్స్.ఎన్.హెచ్.ఎల్ మరియు 1052 బి.ఒ.బి.ఆర్.ఎన్ వ్యాగన్లు ప్రవేశపెట్టబడ్డాయి. దాదాపు 32,534 బి.ఒ.ఎక్స్.ఎన్.హెచ్.ఎల్ మరియు 2450 బి.ఒ.బి.ఆర్.ఎన్ వ్యాగన్ల ఇండెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.
బి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి-23 చివరి వరకు 1018 సరుకు రవాణా లోకోమోటివ్‌లు భారత రైల్వే ఫ్లీట్‌కు జోడించబడ్డాయి. ఈ పెంపు కొనసాగుతుందని అంచనా.
c) 2022-23లో 4500 కి.మీల కొత్త ట్రాక్ ప్రారంభించబడుతుందని అంచనా వేయబడింది, వీటిలో ఎక్కువ భాగం బొగ్గు రవాణా చేసే మార్గాల్లో ఉన్నాయి. ఇది బొగ్గు మోసే ర్యాకు టర్నరౌండ్‌ను మరింత మెరుగుపరుస్తుంది.
డి) రాబోయే కొన్నేళ్లలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దాదాపు 100 పైగా ప్రాజెక్టులకు లక్ష కోట్లతో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడితో ఎనర్జీ కారిడార్ యొక్క సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది.
****
(Release ID: 1905438)
Visitor Counter : 134