పర్యటక మంత్రిత్వ శాఖ

బెర్లిన్ లోని ఐటిబిలో 2023 మార్చి 7న "ఇన్ క్రెడిబుల్ ఇండియా" బ్రాండ్ పెవిలియన్ ప్రారంభించిన పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 08 MAR 2023 7:53PM by PIB Hyderabad

బెర్లిన్ ఐటిబి 2023 లో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ తన "ఇన్ క్రెడిబుల్ ఇండియా" బ్రాండ్ పాల్గొంటున్నది. భారతదేశ ఘన, వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించే విధంగా పర్యాటక శాఖ పెవిలియన్ ఏర్పాటయింది. పర్యాటక రంగం తో సంబంధం ఉన్న వారికి దేశానికి చెందిన   వివిధ పర్యాటక ప్రదేశాలు,ఉత్పత్తులను పరిచయం చేయడానికి పెవిలియన్ ఉపయోగపడుతుంది.భారత్ ను 'తప్పక చూడవలసిన, తప్పక సందర్శించాల్సిన' గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పర్యాటక మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిలో భాగంగా బెర్లిన్ లో జరుగుతున్న  ఐటిబిలో 2023 పాల్గొంటున్నది.

 

ఇండియా పెవిలియన్ ను భారత ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్, జర్మనీలో భారత రాయబారి శ్రీ పర్వతనేని హరీష్, కేరళ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్  కేంద్రపాలిత ప్రాంతమైన లడక్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మొదలైన రాష్ట్రాలకు చెందిన భారత  అధికారులు ప్రారంభించారు.

ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, ఎయిర్ లైన్స్, హోటళ్లు, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లతో సహా భారతదేశానికి చెందిన  సుమారు 60 సంస్థలు  ఇండియా పెవిలియన్ లో పాల్గొంటున్నాయి.  ఇందులో వివిధ పర్యాటక ఉత్పత్తులు సేవలు ప్రదర్శిస్తారు.

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ 710 చదరపు మీటర్ల స్థలాన్ని తీసుకొని 2023 మార్చి 7-9 వరకు జరిగే ఐటిబి 2023 లో పాల్గొంటోంది.

ఐటిబి 2023 జరిగే  సమయంలో పర్యాటక మంత్రిత్వ శాఖ టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు  వివిధ ఇతర భాగస్వాములతో బి 2 బి సమావేశాలు నిర్వహిస్తుంది.

 

ప్రపంచ పర్యాటక మార్కెట్లో భారతదేశ వాటాను పెంచడానికి వివిధ భారతీయ పర్యాటక ఉత్పత్తులు, దేశంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ పర్యాటక కార్యక్రమాలు అమలు చేస్తున్నది.ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా భారతదేశం అభివృద్ధి సాధించేలా చూసే విధంగా కార్యక్రమాలు అమలు జరుగుతాయి. 

ఐటిబిలోని ఇన్ క్రెడిబుల్ ఇండియా పెవిలియన్ సంస్కృతి, వారసత్వం, సాహసం, గ్రామీణ పర్యాటకం భారతీయ  వంటకాలు, వెల్ నెస్, యోగా, వన్యప్రాణులు మరియు లగ్జరీ వంటి ముఖ్యమైన పర్యాటక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ భారతదేశం  విభిన్న పర్యాటక ఉత్పత్తుల కు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చూసేందుకు పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన  పెవిలియన్ సహాయపడుతుంది.

 మార్చి 7న ఉదయం 14:00 గంటలకు మెస్సే బెర్లిన్ లో కొత్తగా నిర్మించిన సిటీ క్యూబ్ కాంగ్రెస్ 

వేదికగా  "ఇన్ క్రెడిబుల్ ఇండియా ప్రపంచానికి స్వాగతం" అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్, భారత ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్, జర్మనీలో భారత రాయబారి శ్రీ పర్వతనేని హరీష్, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ జ్ఞాన్ భూషణ్  ముఖ్యాంశాలు వివరించారు. .

 

65 మంది అంతర్జాతీయ పాత్రికేయులు ఈ సదస్సుకు హాజరయ్యారు.అంతర్జాతీయ టెలివిజన్ ఛానళ్లు, జాతీయ జర్మనీ మ్యాగజైన్లు , వార్తాపత్రికల ప్రతినిధులు,అంతర్జాతీయ యూరోపియన్ మీడియా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.ఎఫ్.వి.డబ్ల్యు, టూరిసిక్ అక్టుయెల్ మరియు జాతీయ టెలివిజన్ ఎ.ఆర్.డి వంటి ప్రముఖ  జర్మన్ పర్యాటక పత్రికల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. .

భారత ప్రతినిధుల ప్రజెంటేషన్ తరువాత, 2023 లో భారతదేశం దృష్టి సారించే సంబంధిత పర్యాటక రంగాల గురించి పాత్రికేయులకు అనేక కొత్త వీడియోలు ప్రదర్శించారు. 

సమావేశం భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. భారతదేశానికి మాత్రమే పరిమితం అయిన వివిధ వంటకాలను అతిధులు రుచి చూశారు..

పర్యాటక కేంద్రాలు, పర్యాటక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి , పర్యాటక రంగానికి చెందిన నిపుణులు పాల్గొనే ఐటీబీ అంతర్జాతీయ స్థాయిలో జరిగే  ట్రావెల్ షోలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

పర్యాటక రంగ నిపుణులు,రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లో ఉన్న భారత రాయబార కేంద్రాల సహకారంతో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, అంతర్జాతీయంగా భారత పర్యాటక రంగానికి గుర్తింపు తెచ్చేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మార్కెటింగ్, ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తోంది.   

భారతదేశంవిభిన్న పర్యాటక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పరిశ్రమ నిపుణులు, ఇతర సంబంధిత భాగస్వాములతో చర్చలు నిర్వహించి  వారి సలహాలుఅభిప్రాయాలు తీసుకుంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పర్యాటక రంగం తిరిగి అభివృద్ధి సాధిస్తోంది. ఈ సమయంలో భారతదేశ పర్యాటక రంగం అభివృద్ధి సాధించడానికి అపారమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అవకాశాలను అందిపుచ్చుకుని విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో భారతదేశాన్ని సందర్శించేలా చూసేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ కృషి ప్రారంభించింది. దేశంలో పర్యాటక రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా చూసేందుకు ఇంతవరకు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు, ఉత్పత్తులు గుర్తించి పూర్తి స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సంవత్సరంలో  365 రోజులు భారతదేశం పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

'ఇన్ క్రెడిబుల్ ఇండియా' లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు  పర్యాటక మంత్రిత్వ శాఖ అడ్వెంచర్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, మైస్ టూరిజం, ఆర్ట్  క్రాఫ్ట్ టూరిజం, వెల్ నెస్ టూరిజంపై  ఐదు  టెలివిజన్ వాణిజ్య ప్రకటనలను అభివృద్ధి చేసింది. ప్రమోషనల్ ఫిల్మ్స్ ద్వారా ప్రపంచానికి భారతదేశంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు  తెలియజేయనున్నారు. 

జీ- 20కి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఇండియా @75 'ఆజాదికా అమృత్ మహోత్సవ్' వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక మంత్రిత్వ శాఖ "ఇన్క్రెడిబుల్ ఇండియా"  విజిట్ ఇండియా ఇయర్ 2023" కార్యక్రమాన్ని  ప్రకటించింది.. భారతదేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెంచడం, వైవిధ్యమైన పర్యాటక అంశాలను పర్యాటకులకు పరిచయం చేయడం, ప్రపంచ పర్యాటక రంగానికి భారతదేశంలో లభిస్తున్న సౌకర్యాలు, పర్యాటక కేంద్రాల వివరాలు తెలియజేసే విధంగా కార్యక్రమం అమలు జరుగుతుంది.  సంస్కృతి, వారసత్వం, ఆధ్యాత్మికత, సహజసిద్ధ అందాలు, ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉండే  పర్యాటక అంశాలకు తగిన ప్రచారం కల్పించి    సుస్థిర పర్యాటకం, గ్రామీణ పర్యాటకం, వైద్య పర్యాటకం వంటి వివిధ రకాల పర్యాటక రంగాలను ప్రోత్సహించడం లక్ష్యంగా "ఇన్క్రెడిబుల్ ఇండియా"  విజిట్ ఇండియా ఇయర్ 2023" కార్యక్రమం అమలు జరుగుతుంది.

***



(Release ID: 1905229) Visitor Counter : 287


Read this release in: English , Urdu