మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఐఐటి మద్రాస్ లో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్లో నాలుగేళ్ల బాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సును ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.


ఈ కోర్సును ఆన్లైన్ విధానంలో బోధిస్తారు, జెఇఇ పరీక్షతో సంబంధం లేకుండా అడ్మిషన్లు ఇస్తారు.ఇందులోనే నాలుగువారాల క్వాలిఫయర్ ప్రాసెస్ ఉంటుంది..

ఇది దేశంలో ఎంబెడెడ్ తయారీరంగం, ఎలక్ట్రానిక్స్ లో నైపుణ్యంగల గ్రాడ్యుయేట్లకు
నానాటికి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉంటుంది.

ఈ కోర్సు భారతదేశపు సెమి కండక్టర్ మిషన్కు అనుగుణంగా ఉంటుంది. ఇది ఇండియాను ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో అంతర్జాతీయ హబ్గా రూపొందించేందుకు
ఉద్దేశించినది.

Posted On: 06 MAR 2023 4:23PM by PIB Hyderabad

కేంద్ర విద్య,నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఐఐటి మద్రాస్ లో నాలుగు సంవత్సరాల బాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్
సిస్టమ్ (https://study.iitm.ac.in/es/) ను ప్రారంభించారు.
దేశంలో ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ తయారీ రంగం గ్రాడ్యుయేట్లకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం కింద బహుళ స్థాయి ఎగ్జిట్కు వీలుకల్పించారు. విద్యార్థులకు ఫౌండేషన్ స్థాయి సర్టిఫికేట్, డిప్లమా లేదా బిఎస్ డిగ్రీ లభిస్తుంది.

ఈ కార్యక్రమం, భారతదేశపు సెమీ కండక్టర్ మిషన్కు అనుగుణంగా ఉంది. ఇండియాను అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ , డిజైన్
లో అంతర్జాతీయ హబ్గా రూపొందించేందుకు నిర్దేశించినది. ఐఐటి మద్రాస్ నుంచి నిర్వహిస్తున్న రెండో ఆన్ లైన్ బి.ఎస్ .ప్రోగ్రాం.
ఇంతకు ముందు డాటా సైన్స్ , అప్లికేషన్స్లో బిఎస్ డిగ్రీ కి రూపకల్పన చేశారు.

 

 

ప్రస్తుతం 17 వేల మంది ఇందులో చదువుకుంటున్నారు.
ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్లో బిఎస్ కోర్సును భారత ప్రభుత్వ ఉన్నతవిద్యా శాఖ కార్యదర్శి శ్రీ కె. సంజయ్ మూర్తి (వర్చువల్ విధానంలో హాజరయ్యారు),
ఐఐటి మద్రాస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ డాక్టర్ పవన్ కె.గోయంకా (వర్చువల్), ఐఐటి మద్రాస్ డైరక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి,
  ఐఐటి మద్రాస్ బిఎస్ ఎలక్ట్రానిక్స్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్లు , పరిశ్రమ నాయకులు ఇతర ఫాకల్టీ సభ్యుల సమక్షంలో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ ఈవెంట్ లో మాట్లాడుతూ, శ్రీ ప్రధాన్, ఐఐటి మద్రాస్ , ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో బాచిలర్ ఆఫ్ సైన్స్

కోర్సును ఆన్లైన్లో ప్రారంభించడం గొప్ప చర్య అని అన్నారు. ఇది ఉన్నత విద్య అందుబాటుకు, నాణ్యమైన ఉన్నత విద్యకు వీలు కల్పిస్తుందన్నారు.

 


ఇది యువతకు అపారమైన అవకాశాలు కల్పించి 21 శతాబ్దపు విజ్ఞానం, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు పనికివస్తుందన్నారు. 2020 జాతీయ విద్యావిధానం సిఫార్సులకు (ఎన్ ఇ పి) అనుగుణంగా ఈ కోర్సును రూపొందించడం పట్ల ఐఐటి మద్రాస్ ను మంత్రి అభినందించారు.
నాణ్యమైన, చవకైన, అందరికీ అందుబాటులో విద్యను అందించడమేకాక, ఉపాధి అవకాశాలు , ఏ దశలో అయినే చేరడానికి, విరమించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని అన్నారు.
మరిన్ని సంస్థలు ఈ తరహా కోర్సులు ప్రారంభించగలవన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికత అయిన వికాస భారతాన్ని సాకారం చేయడానికి ఇది ఉపకరిస్తుందన్నారు.‘‘ ఆవిష్కరణలు, పరిశోధనల శకంలో మనం డిజిటల్‌ యూనివర్సిటీ వంటి వాటితో ముందుకు వస్తున్నామని మంత్రి అన్నారు. నూతన శకానికి సంబంధించిన ఈ కోర్సు చిట్ట చివరి స్థాయి వరకు నాణ్యమైన , అందుబాటులో ఉన్నత విద్యను తీసుకువెళ్లేందుకు , వారి ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. సర్టిఫికేట్‌ తో పాటు, డిప్లమా, డిగ్రీస్థాయి బిఎస్‌కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు.  డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌  ఇకో సిస్టమ్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అలవరచుకునేందుకు వీలుగా ఐఐటి మద్రాస్‌ మౌలిక మాడ్యూల్‌కు రూపకల్పన చేయాల్సిందిగా ఆయన వారికి సూచించారు.
ఐఐటి మద్రాస్‌ రూపొందించిన ఈ ఆన్‌లైన్‌ కోర్సు, మన ప్రస్తుత ఉద్యోగుల సామర్ధ్యాలను మరింత పెంచడానికి ఉపకరిస్తుంది. అలాగే వారిని భవిష్యత్తు కాలానికి సన్నద్ధం చేస్తుంది అని ఆయన అన్నారు.
ఐఐటి విద్యను అందరికీ అందుబాటులో ఉంచే లక్ష్య సాధనలో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌లో బిఎస్‌ కోర్సు ఫీజును  అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.  దీనికి తోడు ఎస్‌.సి, ఎస్‌.టి , దివ్యాంగులైన విద్యార్థులకు , సంవత్సరానికి 5 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న  కుటుంబాలకు చెందిన వారికి స్కాలర్‌షిప్‌లు అందించే ఏర్పాటు కూడా చేసినట్టు ఆయన తెలిపారు.  ఇది అన్నివర్గాలకు ఈకోర్సును అందుబాటులో ఉండేట్టు చేస్తుందని ఆయన తెలిపారు.

ఈ ప్రోగ్రాం పూర్తి చేసి ఉద్యోగాలు పొందే గ్రాడ్యుయేట్లు ఆటోమోటివ్‌, సెమికండక్టర్‌, డిఫెన్స్‌తోపాటు పలు పరిశ్రమలలో  ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ ఇంజనీర్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డవలపర్‌, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ స్పెషలిస్టు, సిస్టమ్‌ టెస్టింగ్‌ ఇంజనీరÊ, ఎలక్ట్రానిక్‌ రిసెర్చ్‌ ఇంజనీర్‌, వంటి ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రాడ్యుయేట్లు తమకు ఆసక్తి ఉన్న రంగాలలో  ఉన్నత విద్యను చదవడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది..ఐఐటి మద్రాస్‌ ఈ తరహా కొత్త కోర్సుకురూపకల్పన చేయడం పట్ల ఐఐటి మద్రాస్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ డాక్టర్‌ పవన్‌ కె.గోయంకా సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ ప్రోగ్రాం ను తొలుత 2020లో ప్రకటించామని,  దీనిని బిఎస్‌ ఇన్‌ డాటా సైన్సెస్‌తో ప్రారంభించినట్టు చెప్పారు. ఇది చాలా విజయవంతమైన ప్రోగ్రాం అని అంటూ ఆయన, ప్రస్తుతం 17 వేల మంది ఇందులో చేరారని అన్నారు. ఈ కార్యక్రమ ప్రత్యేకత ఏమంటే, ఇది ఎంతో మందికి అందుబాటులోకి వచ్చింది అని ఆయన అన్నారు.  ఏ దశలో కొనసాగించాలి, ఏ దశలో ముగించాలన్న సులభమైన విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగిన ప్రోగ్రాం ఇది అని ఆయన అన్నారు.  పెద్ద ఎత్తున విద్యార్థులకు ఉన్నత విద్యను ఎలా అందుబాటులోకి తీసుకురావచ్చో తెలియజేసేందుకు ఇది ఒక గొప్ప నమూనాగా పనిచేస్తుందని ఆయన అన్నారు. నిజానికి ఇది ఒక అద్భుత డిజైన్‌ అని ఆయన అన్నారు. ఐఐటి మద్రాస్‌ చూపిన చొరవకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఎంతో సంతోషిస్తున్నారని ఆయన అన్నారు..ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌లో ప్రత్యేకత గురించి ప్రస్తావిస్తూ ప్రొఫెసర్‌ వి. కామకోటి, ప్రస్తత ఎలక్ట్రానిక్‌ ప్రపంచంలో పెరుగుతున్న ప్రాధాన్యతలో,ఉదాహరణకు మొబిలిటి, మొబైల్‌ ఫోన్‌ సొల్యూషన్స్‌, సంప్రదాయ యాంత్రిక వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఏర్పాటు వంటి వాటి విషయంలో ఈ స్థాయిలో ఎలక్ట్రానిక్‌ మౌలికాంశాలుపై పట్టు, పరిశోధన, అభివృద్ధిరంగంలో అలాగే సామర్ధ్యాల అభివృద్దిలో అవసరం అవుతాయి.
దీనిని దృష్టిలో ఉంచుకుని  ఐఐటి మద్రాస్‌ ఈ బిఎస్‌ కోర్సును ప్రారంభిస్తోంది.ఇది దేశ ఆకాంక్షలను ,విద్యార్థుల ఆకాంక్షలను తీర్చేదిగా ఉండగలదని భావిస్తున్నామని ఆయన అన్నారు.

 

ఇలాంటి కోర్సుల ఆవశ్యకత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఐఐటి మద్రాస్‌, డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన, బిఎస్‌ ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌, ప్రొఫెసర్‌ బాబి జార్జ్‌,
మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌లో నైపుణ్యం కలిగిన వారికి మంచి డిమాండ్‌ ఉందని చెప్పారు. దీనిని దృష్టిలోఉంచుకని  ఈ రంగంలోని పరిశ్రమ వర్గాలతో సంప్రదించి ఈ కోర్సుకు రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఈప్రోగ్రాం గ్రాడ్యుయేట్లకు బలమైన పునాది ఉండి , ఉపాధి కి అవసరమైన నైపుణ్యాలు అలవరతాయని ఆయన అన్నారు..2023 లో 12 వ తరగతిలో ఉన్నవారు దీనికి దరఖాస్తుచేసుకుని అడ్మిషన్‌ పొందవచ్చు. 12వ తరగతి పూర్తిచేసిన తర్వాత ఈ కోర్సును చేయవచ్చు. ప్రస్తుతం ఏ ఇతర అకడమిక్‌ ప్రోగ్రాం చదువుతున్న వారైనా సరే కూడా ప్రస్తుత యుజిసి నిబంధనల ప్రకారం దీనిని చేయవచ్చు. లేదా ఎక్కడైనా పనిచేస్తున్నవారు కూడా తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ కోర్సును చేయవచ్చు.

ఈ ప్రోగ్రాం లో థియరీ, లేబరెటరీ కోర్సులు ఉన్నాయి. వీటిని మద్రాస్‌ ఐఐటి ఫాకల్టీ, పరిశ్రమలోని నిపుణులు బోధిస్తారు. ఈ కోర్సులలో భాగంగా విద్యార్థులకు రికార్డు చేసిన వీడియోలు, రీడిరగ్‌ మెటీరియల్‌, వారం వారం అసైన్‌మెంట్లు, ట్యుటోరియల్స్‌, ఆన్‌లైన్‌ ముఖాముఖి సెషన్‌ల ద్వారా సందేహాలు తీర్చడం వంటివి ఉంటాయి. లేబరెటరీ కోర్సులలో విద్యార్థులుతప్పనిసరిగా వ్యక్తిగతంగా ఐఐటి మద్రాస్‌కు ప్రతి సెమిస్టర్‌లో రెండు సార్లు రావలసి ఉంటుంది.
ఈ ప్రోగ్రాంకు సంబంధించిన మరిన్ని వివరాలను కోర్సు వెబ్‌సైట్‌  https://study.iitm.ac.in/es/. నుంచి పొందవచ్చు..

***



(Release ID: 1905173) Visitor Counter : 114


Read this release in: English , Urdu , Hindi , Tamil