ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఫార్మా అన్వేషన్-2023ను ప్రారంభించినకేంద్ర మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్


అవసరం ఆధారిత ఔషధ తయారీ,  ఏఎంఆర్(యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్)కు వ్యతిరేకంగా పోరాటంలో ఫార్మసిస్టుల కీలక పాత్ర గురించిప్రముఖంగా ప్రస్తావించిన కేంద్ర సహాయ మంత్రి  

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 'వన్ స్టాప్-నాన్ స్టాప్' డిజిటల్ జాబ్ పోర్టల్ ను ప్రారంభించిన డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

పరిశ్రమలు - విద్యారంగాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి, అధ్యాపకులు విద్యార్థులశిక్షణను బలోపేతం చేయడానికి , వ్యవస్థాపకత - మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికికెడిపిఎంఎ, ఎల్ ఎస్ ఎస్ ఎస్ డి సి, ఐపిఎ , ఎఫ్ఒపిఇలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న పిసిఐ .

తాజా పరిణామాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను అనుసరించి ఉత్తమ ఫార్మసీ విద్యనుఅందించేందుకు విధానాలు మార్చుకుని కేంద్రీకృత విధానాన్ని అవలంబించాల్సిన అవసరం వచ్చింది:డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 06 MAR 2023 5:23PM by PIB Hyderabad

" తాజా పరిణామాలకు అనుగుణంగా మన పాఠ్యప్రణాళికను అనుసరించి దేశంలోని ఫార్మసిస్టులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రత్యేక ఔషధాల విస్తృత విద్యను అందించడానికి విధానాల మార్పు, కేంద్రీకృత విధానాన్ని అవలంబించడం ప్రస్తుత అవసరం" అని

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

అన్నారు. భారత ఫార్మసీ విద్య పితామహుడు ప్రొఫెసర్ ఎంఎల్ ష్రాఫ్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఫార్మా అన్వేషన్-2023ను ఆమె ప్రారంభించారు.

 

విద్యారంగం - పరిశ్రమల మధ్య పరిశోధన ఫలితాల ప్రయోజనాలను మార్పిడి చేసుకోవడానికి , విద్యా పరిశోధనను పరిశ్రమతో పంచుకోవడానికి ఒక వేదికను అందించే దార్శనికతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది విద్యారంగం - పరిశ్రమ అనుసంధానం ద్వారా వాణిజ్య ప్రయోజనాన్ని అన్వేషించడంలో సహాయపడుతుంది.

 

పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పారిశ్రామిక విద్యారంగాన్ని పెంపొందించడానికి "ఫార్మా అన్వేషన్ 2023" నిర్వహించినందుకు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) ను అభినందించారు. ఈ రంగంలో "ప్రొఫెసర్ ఎం.ఎల్.ష్రోఫ్" చేసిన కృషిని ఆమె ప్రస్తావించారు. "వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందేలా రోగులకు సహాయపడటంలో వైద్యులు ,నర్సుల మాదిరిగానే ఫార్మసిస్ట్ కూడా అంతే ముఖ్యం. ఫార్మసిస్టులకు వైద్య శాస్త్రం లోపలా ,బయటా తెలుసు.

రోగులకు సరైన మోతాదులో ప్రాణాలను కాపాడే ప్రిస్క్రిప్షన్లు అందేలా చూస్తారు. తమ ఆరోగ్య పరిస్థితులు ,మందులతో పాటు తమ ప్రిస్క్రిప్షన్ సురక్షితంగా ఉండేలా చూసుకునేలా రోగికి అవగాహన కల్పించడం ద్వారా ఫార్మసిస్ట్‌లు వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తారు బహుశా వారు ఒక జీవితాన్ని కూడా కాపాడతారు. కోవిడ్ మహమ్మారి సమయంలో, అవసరమైన మందుల సరఫరా గొలుసును నిర్వహించడంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషించారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన "ఆవిష్కరణలు మన సైన్స్ లక్ష్యం మాత్రమే కాదు, ఆవిష్కరణలు శాస్త్రీయ ప్రక్రియను కూడా ముందుకు నడిపించాలి" అన్న మాటలను

పునరుద్ఘాటిస్తూ , ప్రతి ఒక్కరూ అవసర ఆధారిత మందుల తయారీపై పనిచేయాలని కేంద్ర మంత్రి కోరారు.ఏఎంఆర్ (యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్) పై పోరాటంలో ఫార్మసిస్టుల కీలక పాత్రను నొక్కి చెప్పారు. మందులు, వాటి వాడకం, పరిశుభ్రత ప్రాముఖ్యత, కమ్యూనిటీ డిసీజ్ ప్రివెన్షన్, సర్వే, డేటా సేకరణపై అవగాహన కల్పించాలని పీసీఐ, ఫార్మసీ ఇన్ స్టిట్యూట్ లకు సూచించారు.

 

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, దేశ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం విజయవంతంగా పునాది వేసిందని డాక్టర్ పవార్ వివరించారు. స్థితిస్థాపక, సమర్థవంతమైన ,అనుకూలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా భారత ప్రభుత్వం తన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది.

 

భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ అవసరాలను వివరించిన డాక్టర్ పవార్, ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తులో ఫార్మసిస్టుల కీలక పాత్రను నొక్కిచెప్పారు, మందులు పంపిణీ చేయడానికి మించి అభివృద్ధి చెందుతారని, ఆరోగ్య సంరక్షణ బృందంలో ముఖ్యమైన భాగంగా మారతారని అన్నారు. "మందులను బాగా ఉపయోగించడానికి ,ప్రతికూల సంఘటనలను తగ్గించడానికి రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ,రోగి ఆరోగ్య రికార్డు ను నిర్వహించడం కూడా మన ప్రాధాన్యత కావాలి. ఇలా చేయడం వల్ల చికిత్స ఖర్చు తగ్గుతుంది‘‘ అన్నారు.

 

పిసిఐ ప్రపంచ మార్పులకు అనుగుణంగా ఉండటమే కాకుండా, ఈ రంగంలో పరిశోధనలకు నాయకత్వం వహించడం అవసరం, తద్వారా భారతీయ ఫార్మసీ రంగం ఆవిష్కరణలో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని సహాయ మంత్రి నొక్కి చెప్పారు. ప్రపంచం నేడు భారతదేశాన్ని విశ్వసిస్తోంది . ఈ సంపాదించిన నమ్మకం భారతదేశానికి "ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్" అనే బిరుదును సంపాదించింది.

దేశంలో తయారయ్యే , అంతర్జాతీయ వినియోగదారులు వినియోగించే ఔషధాలు అధిక నాణ్యతతో ఉన్నాయని, ప్రామాణిక గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ ప్రోటోకాల్స్ కు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించడం చాలా ముఖ్యమని, తద్వారా "కీ ఫార్మసీ" గా భారతదేశం ఖ్యాతిని ప్రపంచం నిర్ధారిస్తుందని, వినియోగదారులకు అధిక నాణ్యత కలిగిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను అందిస్తుందని ఆమె తెలియజేశారు.

దేశంలో మెరుగైన నాణ్యమైన జనరిక్ మందులు, వైద్య పరికరాలను ఉత్పత్తి చేయడం ద్వారా,పరిశోధన - అభివృద్ధి (ఆర్ అండ్ డి), ఆవిష్కరణ ,ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

 

ఫార్మా నిపుణులతో పాటు పరిశ్రమకు చెందిన రిక్రూటర్లకు ఉపయోగపడే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 'వన్ స్టాప్-నాన్ స్టాప్' డిజిటల్ జాబ్ పోర్టల్ ను ఆమె ప్రారంభించారు. చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది గేమ్ ఛేంజర్ గా మారనుంది.

 

ఈ కార్యక్రమంలో, కర్ణాటక డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (కెడిపిఎంఎ), లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ (ఎల్ఎస్ఎస్డిసి), ఇండియన్ ఫార్మా అలయన్స్ (ఐపిఎ), ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెన్యూర్స్ (ఎఫ్ఓపిఇ) లతో పరిశ్రమ - విద్యారంగం మధ్య అంతరాన్ని తగ్గించడానికి, అధ్యాపకుల, విద్యార్థి శిక్షణను బలోపేతం చేయడానికి ,వ్యవస్థాపకత - మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి పిసిఐ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

 

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ మాట్లాడుతూ, పరిశ్రమ-విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. ఫార్మా వ్యాపారం మూలం నాణ్యమైనదని, ఈ రంగంలో గత 25 సంవత్సరాలలో భారతదేశం చాలా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, భయం లేని వాతావరణం, రిస్క్ తీసుకునే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

 

ఈ సమావేశంలో పీసీఐ అధ్యక్షుడు డాక్టర్ మోంటు కుమార్ పటేల్, పీసీఐ రిజిస్ట్రార్ కమ్ సెక్రటరీ అనిల్ మిట్టల్, ఎయిమ్స్ హెడ్ ప్రొఫెసర్ వైకే గుప్తా, ఇండియన్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) కార్యదర్శి బీఆర్ సిక్రీ, ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ సెక్రటరీ కమ్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ జీఎన్ సింగ్, ఇండియన్ ఫార్మా అలయన్స్ సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ రాజీవ్ దేశాయ్, కేడీపీఎంఏ అధ్యక్షుడు హరీష్ కే జైన్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు , ఐపీసీ, ఐపీఏ, పరిశ్రమ నిపుణులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

****

 


(Release ID: 1904762) Visitor Counter : 122


Read this release in: Urdu , English , Marathi , Hindi