గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

మార్చి 4న జార్ఖండ్‌లోని సెరైకెలా ఖర్సావాన్‌లో ప్రతిభావంతులైన గిరిజన యువత కోసం ఏర్పాటు చేసిన “కౌశల్ మహోత్సవ్” జాబ్ మేళాకు హాజరైన శ్రీ అర్జున్ ముండా


ప్రజల నైపుణ్యాలను మెరుగుపర్చడానికి మరియు దానికి సంబంధించిన ఉపాధిని కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది: శ్రీ అర్జున్ ముండా

Posted On: 05 MAR 2023 6:50PM by PIB Hyderabad

మన యువత నైపుణ్యాలను అవకాశాలతో అనుసంధానం చేయాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆటోమోటివ్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మరియు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ల సహకారంతో నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 4న నిర్వహించిన కౌశల్ మహోత్సవ్‌లో  కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖుంటి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలోని కాసి సాహు కళాశాల బహుళ ప్రయోజన ఆడిటోరియంలో  కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్‌ జయ, సరైకేలా డిప్యూటీ కమిషనర్‌ అరవ రాజ్‌కమల్‌, ఏఎస్‌డీసీ సీఈవో అరిందమ్‌ లాహిరి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

   

 

ఈ మెగా జాబ్ మేళా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణ మరియు ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీలు హాజరయ్యాయి. గిరిజన యువతకు ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలకు శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు కావడానికి ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. జాబ్ మేళాలో 11 కంపెనీల ద్వారా 350 మందికి పైగా అభ్యర్థులు వేర్వేరు ఉద్యోగాలకు  ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ ఈ మేళాలో నియామక పత్రాలు పొందిన యువకులందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,ఏఎస్‌డిసి,ఎన్‌ఎస్‌డిసి మరియు ఎన్‌సివిఈటి, ఆజీవిక మిషన్‌కు కొత్త కోణాన్ని అందించింది. రాబోయే కాలంలో ఆరోగ్యం, విద్య, సాంకేతికత వంటి అన్ని రంగాల్లో ప్రజల నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి కల్పించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు చిన్న పరిశ్రమను నడపాలనుకుంటే వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు.

 

 

"సేవా పర్మో ధర్మః" అనేది సమాజంలో చివరి స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క అభ్యున్నతి కోసం పనిచేయడానికి ప్రేరేపిస్తుందని ఆయన పేర్కొన్నారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లడం ద్వారా సాకారం చేస్తోందన్నారు.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్ జయ మాట్లాడుతూ “జార్ఖండ్‌లోని విద్యార్థులకు మరియు ఆటోమోటివ్ రంగానికి జాబ్ మేళా ఒక ముఖ్యమైన కార్యక్రమం అని నేను నమ్ముతున్నాను. గిరిజన విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మరియు కంపెనీలు తమ యూనిట్ల కోసం సరైన ప్రతిభను కనుగొనడానికి, గిరిజన యువతకు వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి మరియు ప్రతిష్టాత్మక సంస్థలతో పని చేయడానికి సరైన అవకాశాలను అందించడానికి ఇది ఒక వేదికను అందించింది" అని తెలిపారు.

ఏఎస్‌డిసి సిఈఓ అరిందమ్ లాహిరి ఈవెంట్ కార్యక్రమం విజయవంతం అవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న కంపెనీలు తమ యూనిట్ల కోసం నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "జార్ఖండ్ యువతకు నైపుణ్య అవకాశాలను అందించడానికి ఏఎస్‌డిసి కట్టుబడి ఉంది. ఆటోమోటివ్ రంగంలో విద్యార్థులను విజయవంతం చేయడానికి అవసరమైన నైపుణ్యాలతో మా శిక్షణా కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఈ జాబ్ మేళా వంటి కార్యక్రమాలు మా విజయానికి నిదర్శనం. చాలా మంది అభ్యర్థులు ఉపాధిని పొందడం పట్ల ఆనందంగా ఉంది. భవిష్యత్తులో విజయాన్ని కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము " అని చెప్పారు.



 

***



(Release ID: 1904489) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi