రక్షణ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ నావికాదళ విన్యాసం/ కట్‌లాస్ ఎక్స్‌ప్రెస్ 23 (ఐఎంఎక్స్/ సిఇ -23)లో పాలుపంచుకుంటున్న ఐఎన్ఎస్ త్రికండ్
Posted On:
05 MAR 2023 2:46PM by PIB Hyderabad
గల్ఫ్ ప్రాంతంలో 26 ఫిబ్రవరి నుంచి 16 మార్చి 2023 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ నావికాదళ విన్యాసం/ కట్‌లాస్ ఎక్స్‌ప్రెస్ 2023 (ఐఎంఎక్స్/ సిఇ -23)లో ఐఎన్ఎస్ త్రికండ్ పాలుపంచుకుంటోంది. సముద్ర వాణిజ్యం కోసం ఈ ప్రాంత సముద్ర మార్గాల రక్షణ, తీర భద్రతను పెంచడం అన్న సామాన్య లక్ష్యం కోసం 50 దేశాలు, అంతర్జాతీయ నావికాదళ ఏజెన్సీలతో కలిసి ఈ నౌక విన్యాసాలలో పాలుపంచుకుంటోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ జాతీయ నావికాదళ విన్యాసాలలో ఐఎంఎక్స్/ సిఇ -23 ఒకటి. ఐఎంఎక్స్‌లో భారతీయ నావికాదళం తొలిసారి పాలుపంచుకోవడమే కాక, సిఎంఎఫ్ నిర్వహించిన విన్యాసాలలో భారతీయ నావికాదళ నౌక పాలుపంచుకుంటున్న రెండవ సందర్భం కూడా ఇది. ఇంతకు ముందు, నవంబర్ 2022లో ఐఎన్ఎస్ త్రిఖండ్ సిఎంఎఫ్ నేతృత్వంలోని ఆపరేషన్ సీ స్వోర్డ్ 2 పాల్గొన్నది.
సీ స్వోర్డ్ 2, ఐఎంఎక్స్/ సిఇ-23 వంటి విన్యాసాలలో భారతీయ నావికాదళం పాల్గొనడమన్నది ఐఒఆర్‌లో నావికాదళ భాస్వాముల సామూహిక నావికాదళ సామర్ధ్యాన్ని, ఉమ్మడి కార్యాచరణను పెంచడంతో పాటు సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తోడ్పడుతుంది. దీనితోపాటుగా ప్రాంతీయ స్థిరతకు, భద్రతకు నిర్మాణాత్మకంగా దోహదం చేసేందుకు నావికాదళానికి సామర్ధ్యాన్ని ఇస్తుంది.
___
(Release ID: 1904462)
Visitor Counter : 221