ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్ధిక సంవత్సరం 2022-23లో జనవరి 2023 వరకు భారత ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష
प्रविष्टि तिथि:
28 FEB 2023 8:06PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం నెలవారీ ఖాతాలను జనవరి 2023వరకు ఏకీకృతం చేసి నివేదికలను ప్రచురించారు. ముఖ్యాంశాలను దిగువన ఇవ్వడం జరిగిందిః
భారత ప్రభుత్వం రూ. 19,76, 483 కోట్లు (ఆర్ఇ 2022-23లో 81.3%)ను జనవరి 2023 వరకు అందుకుంది. ఇందులో రూ. 16,88,710 కోట్ల పన్ను ఆదాయం (కేంద్రానికి నికరంగా), రూ. 2,30,939 కోట్ల పన్నేతర ఆదాయాన్ని, రూ. 57,194 కోట్ల రుణేతర మూలధన రసీదులు ఉన్నాయి. రుణయేతర మూలధన పెట్టుబడులలో, రూ. 18,523 కోట్ల రుణాల వసూలు, ఇతర మూలధన రసీదులు రూ. 38,671 కోట్లు. భారత ప్రభుత్వం నుంచి పన్నుల వాటా పంపిణీగా రూ.6,67,770 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకూ బదిలీ చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ. 1,22,378 కోట్లు ఎక్కువ.
భారత ప్రభుత్వ మొత్తం వ్యయం రూ. 31,67,648 కోట్లు (ఆర్ఇ 2022-23 కాలంలో 75,7%). ఇందులో రూ. 25,97,756 కోట్లు ఆదాయపు ఖాతాపై కాగా, రూ. 5,69,892 కోట్లు మూలధన ఖాతా ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ వ్యయంలో రూ. 7,38,658 కోట్లు వడ్డీ చెల్లింపుల కారణంగా, రూ. 3,99,400 కోట్లు ప్రధాన సబ్సిడీల కారణంగా ఖర్చు అయ్యాయి.
****
(रिलीज़ आईडी: 1903300)
आगंतुक पटल : 162