మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
రేపు హైదరాబాద్‌లో భారీ స్టార్టప్ సదస్సును నిర్వహించనున్న పశు సంవర్ధక & పాడి విభాగం
Posted On:
27 FEB 2023 3:15PM by PIB Hyderabad
పశువులు, పాడి, పశు సంవర్ధక రంగాలలో స్టార్టప్‌లను ప్రోత్సహించడం, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు తమ భావనలను, నెట్‌వర్క్‌ను పంచుకునేందుకు ఒక చోట చేర్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం
ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ రూపాల ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగాలు, సంప్రదింపుల సెషన్లు, ప్యానెల్ చర్చలు, విజయవంతమైన స్టార్టప్‌ల ప్రదర్శనలు ఉంటాయి.
ఎంపిక చేసిన స్టార్టప్‌ల ప్రదర్శన, పిచ్‌ఫెస్ట్‌లు, కొనుగోలు- అమ్మకందార్ల సమావేశం, తొలిదశలో ఉన్న స్టార్టప్‌లకు పిచింగ్, తమ వ్యాపార నిర్మాణం చేసుకునేందుకు శిక్షణనిచ్చే వర్క్‌షాప్‌లు ఇందులో ఉండనున్నాయి.
పశుసంపద, పాడి, పశుసంవర్ధక రంగాలలో ఉనికిలో ఉన్న, ఇప్పుడిప్పుడే మొదలవుతున్నస్టార్టప్‌లను ప్రోత్సహించందుకు జాతీయ పాడి అభివృద్ది బోర్డు, స్టార్టప్ ఇండియా, సిఐఐ, తెలంగాణ పశుసంవర్ధక శాఖతో కలిసి పశుసంవర్ధ& పాడి విభాగం రేపు, అంటే 28 ఫిబ్రవరి 2023న హైదరాబాద్‌లో భారీ స్టార్టప్ సదస్సును నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల హాజరుకానున్నారు.
వ్యవస్థాపకులను, పెట్టుబడిదారులను, పరిశ్రమ నిపుణులను తమ భావనలు, నెట్‌వర్క్‌ను పంచుకొని, ఒకరినుంచి మరొకరు నేర్చుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం తమ వినూత్న భావనలను, ఉత్పత్తులను ప్రదర్శించేందుకే కాక, తోటి వ్యవస్థాపకులు, భాగస్వాములతో నెట్‌వర్కింగ్ చేసుకునేందుకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రముఖ పరిశ్రమ నాయకుల కీలక ఉపన్యాసాలు, ముఖాముఖి సెషన్లు, ప్యానెల్ చర్చలు, విజయవంతమైన స్టార్టప్‌ల ప్రదర్శనలు ఇందులో ఉంటాయి.
ఎంపిక చేసిన స్టార్టప్‌ల ప్రదర్శన, పిచ్‌ఫెస్ట్‌లు, కొనుగోలు- అమ్మకందార్ల సమావేశం, తొలిదశలో ఉన్న స్టార్టప్‌లకు పిచింగ్, తమ వ్యాపార నిర్మాణం చేసుకునేందుకు శిక్షణనిచ్చే వర్క్‌షాప్‌లు, ప్రభావం చూపిన తమ కథలను పంచుకోవడం వంటివి ఈ సదస్సులో ఉండనున్నాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర టూరిజం మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రాఫీ మంత్రి టి. శ్రీనివాస యాదవ్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ వంటి ఇతర ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.
****
(Release ID: 1902953)
Visitor Counter : 107