కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ గుర్తింపుపొందిన స్టార్టప్‌లు, ఎం.ఎస్‌.ఎం.ఇలకు 2024 జనవరి వరకు ఉచిత 5 జి టెస్ట్‌బెడ్‌ను అందించనున్న ప్రభుత్వం.

Posted On: 27 FEB 2023 3:57PM by PIB Hyderabad

ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు, ఎం.ఎస్‌.ఎం.ఇలకు 2024 జనవరి వరకు 5జి టెస్ట్‌బెడ్‌ను ఉచితంగా అందించాలని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ కింద గల డిపార్టమెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డిఒటి) నిర్ణయించింది. 5జి స్టేక్‌ హొల్డర్లయిన పరిశ్రమ, విద్యాసంస్థలు, సర్వీసు ప్రొవైడర్లు, పరిశోధన అభివృద్ధి సంస్థలు,
ప్రభుత్వ సంస్థలు, పరికరాల తయారీదారులు ఉన్నారు. వీరు నామమాత్ర రుసుముకు వీటిని ఉపయోగించుకోవచ్చు. టెస్ట్‌బెడ్‌ను ఉపయొగించుకోవడాన్ని ప్రోత్సహించడానికి, దేశీయ సాంకేతికత, ఉత్పత్తులను  ప్రోత్సహించడానికి  ఇది ఉపకరిస్తుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పలు స్టార్టప్‌లు తమ ఉత్పత్తులకు సేవలకు ఈ టెస్ట్‌బెడ్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి.

2018 మార్చిలో , ఇండియా ప్రతేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అలాగే 5 జి వినియోగంలో నాయకత్వం వహించేందుకు డిపార్టమెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ బహుళ సంస్థల సహకార ప్రాజెన్ను ద్వారా దేశీయ 5 జి టెస్ట్‌బెడ్‌ను  ఏర్పాటు చేసేందుకు డిపార్టమెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఆర్థిక గ్రాంటును ఆమోదించింది.  దీని ఖర్చు 224 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులోని 8 కొలాబరేటివ్‌ సంస్థలు ఐఐటి (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) మద్రాస్‌, ఐఐటి ఢల్లీి, ఐఐటి హైదరాబాద్‌, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్‌, ఐఐఎస్‌సి బెంగళూరు, సొసైటీ ఫర్‌ అప్లయిడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, రిసెర్చి (ఎస్‌ ఎ ఎం ఇ ఇ ఆర్‌) , సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ వైర్‌లెస్‌ టెక్నాలజీ (సిఇడబ్లు ఐటి) ఉన్నాయి.

దేశీయ 5జి టెస్ట్‌ బెడ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 17న జాతికి అంకితం చేశారు. టెస్‌బెడ్‌ వినియోగం, దాని సేవలను అందుకునేందుకు  (https://user.cewit.org.in/5gtb/index.jsp) వెబ్‌ ఆధారిత పోర్టల్‌ను ఏర్పాటు చేశారు.
      5జి టెస్ట్‌బెడ్‌ ఐదు చోట్ల అందుబాటులో ఉంది. అది  ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ బెడ్‌ సిఇడబ్లుఐటి, ఐఐటి మద్రాస్‌, మరో టెస్ట్‌బెడ్‌ ఐఐటి ఢల్లీిలో, ఐఐటి హైదరాబాద్‌, ఐఐటి కాన్పూర్‌లో ఐఐఎస్‌సి బెంగళూరులో  అందుబాటులో ఉన్నాయి. సిఇడబ్ల్యుఐటి, ఐఐటి మద్రాస్‌ ఎండ్‌ టు ఎండ్‌ టెస్ట్‌బెడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో వివిధ టెస్టింగ్‌ సేవలైన రాన్‌ లెవల్‌, పిహెచ్‌వై లెవల్‌, ఇతర టెస్ట్‌ పరికరాలు ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్‌ లో జి ఎన్‌ బి టెస్టింగ్‌ సదుపాయాలు, యుఇ టెస్టింగ్‌, ఎండ్‌ టు ఎండ్‌ ఇంటర్‌ఒపరెబిలిటిటెస్టింగ్‌, ఎన్‌బి ఐఒటి టెస్టింగ్‌ ఉన్నాయి. ఐఐఎస్‌సి బెంగళూరు వి2 ఎక్స్‌, 5 జి ఓపెన్‌సోర్స్‌ టెస్ట్‌బెడ్‌, ఐఐటి కాన్పూర్‌ వద్ద బేస్‌ ఆధారిత టెస్ట్‌బెడ్‌, ఐఐటి ఢల్లీి వద్ద ఎన్‌బి ఐఒటి, విఎల్‌సి టెస్ట్‌బెడ్‌ ఉన్నాయి. 

. ఎండ్‌ టు ఎండ్‌ టెస్ట్‌బెడ్‌ అంతర్జాతీయ 3 జిపిపి స్టాండర్డ్‌కు , ఒరాన్‌ స్టాండర్డ్‌కు అనుగుణమైనది. దేశీయ 5జి టెస్ట్‌బెడ్‌ ఒపెన్‌ 5జి టెస్ట్‌బెడ్‌ , ఒపెన్‌ 5జి టెస్ట్‌బెడ్‌కు వీలు కల్పిస్తుంది. ఇది భారతీయ విద్యాసంస్థలు, పరిశమ్ర, తమ ఉత్పత్తులను పరీక్షించుకోవడానికి ఉపకరిస్తుంది. అంతేకాకుండా ఇది పరిశోధకులకు అందుబాటులో ఉంటుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా వినూత్న ప్రమాణాలపై పరిశోధక బృందాలు కృషి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రయోగాలు చేయడానికి, వివిధ అప్లికేషన్ల ప్రదర్శనకు, భారతీయ సమాజంలోని గ్రామీణ బ్రాడ్‌ బాండ్‌, స్మార్ట్‌సిటీ అప్లికేషన్లకు, ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థకు ఉపకరిస్తుంది. అలాగే భారతీయ ఆపరేటర్లు 5జి టెక్నాలజీల పనితీరును అర్థం చేసుకుని , తమ భవిష్యత్‌ నెట్‌ వర్క్‌లను రూపొందించుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది..

 దేశీయంగా ఈ టెస్ట్‌బెడ్‌ అభివృద్ధి దేశం 5జి సాంకేతికతలో స్వాలంబన సాధించడానికి కీలక మలుపుగా చెప్పుకోవచ్చు.స్త్రుతం ఇది 5జి ఆత్మనిర్భర భారత్‌ దిశగా ముందుకుసాగుతున్నది. ఈ టెస్ట్‌బెడ్‌ 5జి ఉత్పత్తుల వాలిడేషన్‌కు ప్రయోగాలకు , భారతీయస్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఇలు, పరిశోధన అభివృద్ధి, విద్యాసంస్థలు,పరిశ్రమ వినియోగదారులు 5 జి ఉత్పత్తుల అభివృద్ధి వాలిడేషన్‌ కు ఇది ఉపకరిస్తుంది.  ఫలితంగా పెద్ద ఎత్తున ఖర్చు తగ్గడమే కాకుండా డిజైన్‌ కు పట్టే సమయం తగ్గుతుంది. దీనివల్ల భారతీయ 5 జి ఉత్పత్తులు అంతర్జాతీయంగా మార్కెట్‌లో పోటీని తట్టుకోవడానికి వీలు కలుగుతుంది.

ఈ టెస్ట్‌బెడ్‌ అభివృద్ధితో పలు 5 జి సాంకేతికతలు, ఐపిలు అభివృద్ధిచేయడానికి దోహదపడిరది.సాంకేతికత ను పరిశ్రమ వర్గాలకు బదిలీ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది పారిశ్రామిక సంస్థలు భారతదేశంలో 5జిని సునాయాసంగా , సత్వరం అభివృద్ధిచేయడానికి దోహదపడుతుంది.

 

****


(Release ID: 1902952) Visitor Counter : 171