సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం (27.02.2023) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో “సీ సీ ఎస్ (ఎక్స్‌ట్రా-ఆర్డినరీ పెన్షన్) రూల్స్, 2023”ని ఆవిష్కరించనున్నారు.
సీ సీ ఎస్ పీ ఆర్ సీ సీ ఏ పీ ఎఫ్ సీ ఆర్ పీ ఎఫ్
పింఛను & పెన్షనర్ల సంక్షేమ శాఖ ఉద్యోగులను సర్వీస్ నుండి పదవీ విరమణ సాఫీ గా మారేందుకు వీలుగా ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ (పీ ఆర్ సీ) వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది
డిపార్ట్‌మెంట్ ఇప్పటివరకు 49 పీ ఆర్ సీ లు నిర్వహించింది – ఢిల్లీలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల కోసం 29 మరియు న్యూఢిల్లీ, జలంధర్, షిల్లాంగ్, కోల్‌కతా, టెకాన్‌పూర్, జమ్ము, జోధ్‌పూర్ మరియు గౌహతిలో సీ ఆర్ పీ ఎఫ్ , బీ ఎస్ ఎఫ్ మరియు అస్సాం రైఫిల్స్ వంటి సీ ఏ పీ ఎఫ్ ల కోసం 20 పీ ఆర్ సీ లు నిర్వహించింది
Posted On:
25 FEB 2023 2:09PM by PIB Hyderabad
పింఛను & పెన్షనర్ల సంక్షేమ శాఖ ఉద్యోగులకు సర్వీస్ నుండి పదవీ విరమణ సాఫీగా మారేందుకు వీలుగా పదవీ విరమణకు ముందు కౌన్సెలింగ్ ( పీ ఆర్ సీ) వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, డిపార్ట్‌మెంట్ 27/02/2023న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, రాష్ట్ర మంత్రి (పీ పీ) నేతృత్వంలో పీ ఆర్ సీ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తుంది. వర్క్‌షాప్ వల్ల పదవీ విరమణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగులు, పెన్షన్ శాఖ అధికారులు లబ్ధి పొందనున్నారు.
ఈ రోజున, డాక్టర్ జితేంద్ర సింగ్ “సీ సీ ఎస్ (ఎక్స్‌ట్రా-ఆర్డినరీ పెన్షన్) రూల్స్, 2023” అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు, ఇది “ఎక్స్‌ట్రా-ఆర్డినరీ పెన్షన్ రూల్స్, 1939” యొక్క సవరించిన ప్రచురణ. 84 ఏళ్ల తర్వాత ఈ నిబంధనలను సవరించారు. దీనిలో వివిధ కేటగిరీలపై కొత్త నిబంధనలు, వేగవంతమైన ప్రాసెసింగ్, భవిష్య ఐటి పోర్టల్ చేర్చారు.
పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ యొక్క ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌తో కెనరా బ్యాంక్ యొక్క పెన్షన్ పోర్టల్‌ని అనుసంధానాన్ని గౌరవ మంత్రి ప్రారంభిస్తారు. ఎస్ బీ ఐ యొక్క 02 కొత్త సర్వీస్ ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. పెన్షనర్ల కోసం సీ పీ ఏ ఓ మరియు ఎన్ ఐ సీ అభివృద్ధి చేసిన "దీర్ఘాయు" అనే కొత్త మొబైల్ యాప్‌ను కూడా గౌరవ మంత్రి ప్రారంభిస్తారు.
డిపార్ట్‌మెంట్ ద్వారా ఇప్పటివరకు 49 పీ ఆర్ సీ లు నిర్వహించబడ్డాయి – ఢిల్లీలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల కోసం 29 మరియు న్యూఢిల్లీ, జలంధర్, షిల్లాంగ్, కోల్‌కతా, టెకాన్‌పూర్, జమ్ము, జోధ్‌పూర్ మరియు గౌహతిలో సీ ఆర్ పీ ఎఫ్ , బీ ఎస్ ఎఫ్ మరియు అస్సాం రైఫిల్స్ వంటి సీ ఏ పీ ఎఫ్ ల కోసం 20 పీ ఆర్ సీ లు నిర్వహించబడ్డాయి. వు మొత్తం 6872 రిటైర్ అవుతున్న సిబ్బంది ఈ పీ ఆర్ సీ లకు హాజరయ్యారు.
పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ కింది పెన్షన్ నియమాలను రూపొందించింది/సమీక్షించింది/ క్రమబద్ధీకరించింది:
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సీ సీ ఎస్ ) పెన్షన్ రూల్స్, 2021;
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (జాతీయ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఎక్స్‌ట్రా-ఆర్డినరీ పెన్షన్ రూల్స్, 2023.
ప్రభుత్వ సేవల కారణంగా గాయం లేదా వ్యాధి తో మరణించిన కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగుల కుటుంబాలు, సీ సీ ఎస్ (అసాధారణ పెన్షన్) నియమాలు, 2023 ప్రకారం అసాధారణ కుటుంబ పెన్షన్‌కు అర్హులు. అదేవిధంగా,ప్రభుత్వ సేవ కారణంగా వచ్చే వ్యాధి గాయం తీవ్రతరం కారణంగా వైకల్యం పొందిన ఉద్యోగులు లేదా సీ సీ ఎస్ (అసాధారణ పెన్షన్) రూల్స్, 2023 ప్రకారం వికలాంగుల పెన్షన్‌కు అర్హులు. జనవరి 1, 2004లోపు నియమితులైన ఉద్యోగులకు ఈ నియమాలు వర్తిస్తాయి. అయితే, సీ సీ ఎస్ (ఎన్ పీ ఎస్ అమలు) నియమాలు, 2021 ప్రకారం ఉద్యోగి ఎంపికచేసుకున్నట్లయితే ఈ నిబంధనల ప్రకారం ప్రయోజనాలు 1.1.2004న లేదా ఆ తర్వాత నియమించబడిన మరియు ఎన్ పీ ఎస్ పరిధిలోకి వచ్చిన ఉద్యోగి మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది .
ఎన్ ఈ ఎస్ డీ ఏ అసెస్‌మెంట్ 2021 ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ ఇ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ పోర్టల్‌లలో 3వ ర్యాంక్ పొందిన 'భవిష్య- యాన్ ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఆఫ్ పెన్షన్ ప్రాసెస్' విజయవంతంగా అమలు చేయబడిన తర్వాత, పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ పోర్టల్‌లను ఏకీకృతం చేయడానికి గల హేతువును దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకుంది. పెన్షన్ డిస్బర్సింగ్ బ్యాంక్ పోర్టల్స్, అనుభవ్, సీ పీ ఎన్ గ్రాంస్, సీ జీ హెచ్ ఎస్ మొదలైన అన్ని పోర్టల్‌లలో పెన్షనర్‌లకు సుఖ జీవనం కోసం కొత్తగా రూపొందించిన “ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్” (https://ipension.nic.in)లో ఏకీకృతం చేస్తారు.
***
(Release ID: 1902500)