నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం సాగుతున్న ప్రయత్నాలకు ఎంఎస్ఎంఈ రంగం సహకారం అందించాలి ... కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్
ఆత్మనిర్భర్ భారత్ సాధనలో ఎంఎస్ఎంఈ రంగం క్రియాశీల పాత్ర పోషించడానికి 2023-24 కేంద్ర బడ్జెట్ తగిన అవకాశం అందించింది: శ్రీ సోనోవాల్
Posted On:
25 FEB 2023 8:10PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం సాగుతున్న ప్రయత్నాలకు ఎంఎస్ఎంఈ రంగం సహకారం అందించాలని కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా , జలమార్గాలు , ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ కోరతారు. ఈ రోజు అస్సాంలోని దిబ్రూగఢ్ లోని దులిఅజన్ లో ఎంఎస్ఎంఈ రంగం కోసం నిర్వహించిన ఉద్యామ్ 2023 కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా అభివృద్ధి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం పోషించగల కీలక పాత్ర ను మంత్రి వివరించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడం, ఎంఎస్ఎంఈ రంగం ఉత్పత్తి చేసే ఉత్పత్తుల ప్రదర్శన, ఎంఎస్ఎంఈ రంగం భవిష్యత్తులో నూతన ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ఈ కార్యక్రమంలో కీలక చర్చ జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ గా మారాలన్న లక్ష్యాన్ని భారతదేశం చేరుకోవడానికి ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి ఆత్మ నిర్భర్ భారత్ గా మారాలి అని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకున్నదని శ్రీ సోనోవాల్ చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి, ప్రజా సంక్షేమానికి ఎంఎస్ఎంఈ రంగం పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. . అమృత్ కాల ముగింపులో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదగాలి అని చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యేలా చూసేందుకు ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
దేశంలో ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి ఉద్యమ్ కార్యక్రమం సహకరిస్తుందని శ్రీ సోనోవాల్ అన్నారు. వర్ధమాన సంస్థలు అభివృద్ధి సాధించడానికి ఎంఎస్ఎంఈ రంగం అనేక అవకాశాలు అందిస్తుందని ఆయన అన్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించడానికి అత్యుత్తమ పరిజ్ఞానం, అత్యుత్తమ విధానాలు అమలులోకి రావాలని శ్రీ సోనోవాల్ అన్నారు.ఎంఎస్ఎంఈ రంగం వృద్ధి పథంలో పయనించడానికి ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ పునాది వేసిందన్నారు. రూ.9000 కోట్ల విలువైన పునరుద్ధరించిన క్రెడిట్ గ్యారెంటీ పథకం ఎంఎస్ఎంఈ రంగం పూర్వ వైభవాన్ని సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు. . దేశంలో ఎంఎస్ఎంఈ సంస్థలు వ్యాపారం సులభతరంగా సాగేలా చూసేందుకు విధాన సవరణలు చేశామని చెప్పారు.
***
(Release ID: 1902490)
Visitor Counter : 163