వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ట్రైఫెడ్ యొక్క ట్రైబ్స్ ఇండియా స్టోర్ ఉత్పత్తులను


వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) మరియు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ)తో ట్యాగ్

- మార్కెట్ విస్తరణ, చేనేత మరియు హస్తకళల సేకరణను ప్రారంభించడానికి తరలించేందుకు వీలు

- ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) మరియు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) వాటాదారులు జిల్లా నిర్దిష్ట కళ మరియు క్రాఫ్ట్‌లను యాక్సెస్ చేయడానికి దోహదం

Posted On: 25 FEB 2023 2:14PM by PIB Hyderabad

వాణిజ్య శాఖ (డీఓసీ), పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ పరిధిలోని అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)  చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కార్యక్రమం ద్వారా సంపూర్ణ సామాజిక-ఆర్థికతను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయిలో సంపూర్ణ స్థిరమైన ఉపాధిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.  దేశంలోని ప్రతి జిల్లా నుండి ఒక ఉత్పత్తిని ఎంచుకుని, బ్రాండ్ చేసి, ప్రచారం చేయాలనేది ఈ కార్యక్రమం ఆలోచన. ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భార‌త్‌ దిశగా ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా మరియు భారతదేశం యొక్క ప్రస్తుత జీ20 ప్రెసిడెన్సీతో, డీపీఐఐటీ, భారత ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఓడీఓపీ కేటలాగ్‌ను ప్రారంభించారు. ఈ  సందర్భంగా ప్రతి సంస్థ ఈ కార్యక్రమానికి సహకరించాలని అభ్యర్థించారు. ఇది దేశంలోని ప్రతి జిల్లా నుండి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఈ దృక్పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఓడీఓపీ 16-27 ఫిబ్రవరి, 2023 నుండి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్) నిర్వహిస్తున్న ఆది మహోత్సవ్‌లో ట్రైబ్స్ ఇండియా స్టోర్‌లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న గిరిజన ఉత్పత్తులను మ్యాప్ చేసి ట్యాగ్ చేసింది. ఓడీఓపీ మరియు జీఐ x ట్రైఫెడ్ ఉత్పత్తులను ఆది మహోత్సవ్ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా డీపీఐఐటీ డైరెక్టర్ శ్రీమతి సుప్రియా దేవస్థలి ఓడీఓపీ మరియు జీఐ x ట్రైఫెడ్ లాంచ్‌లో ప్రత్యేక ప్రసంగం చేశారు. దేశవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్న విభిన్న ఉత్పత్తుల సేకరణను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఓడీఓపీ పరిధిలోకి వచ్చే గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ట్రైఫెడ్ సంస్థతో ఈ సహకారం ఒక మైలురాయి దశ అని, మరియు దేశంలోని 100 కంటే ఎక్కువ ట్రైబ్స్ ఇండియా స్టోర్‌లు స్థానికంగా మరియు ప్రపంచానికి ఈ విధానం గురించి ఉత్పత్తుల గురించి వినిపించేందుకు చేపట్టిన ఉద్యమంలో పాల్గొంటాయని ఆమె ప్రధానంగా తెలియజేశారు.

ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఆది మహోత్సవ్ వంటి వేదికలు చాలా కీలకమని, ట్రైఫెడ్తో కలిసి ఓడీఓపీ చేపడుతున్న కార్యక్రమాలకు ఇది మరింత విలువను జోడిస్తుందని ఆమె పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే గిరిజన ఉత్పత్తుల యొక్క విభిన్న సేకరణ ట్రైఫెడ్ యొక్క ట్రైబ్స్ ఇండియా రిటైల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు నుండి కులు షాలువలు, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ నుండి డార్జిలింగ్ టీ, రాజస్థాన్‌లోని జైపూర్ నుండి బ్లూ పాటరీ, కర్ణాటకలోని బీదర్ నుండి బిద్రివేర్, ఒడిశా రాష్ట్రం పూరి, నుండి పట్టచిత్ర పెయింటింగ్‌, మధ్యప్రదేశ్‌లోని ధార్ నుండి బాగ్ ప్రింట్లు, కేరళలోని వాయనాడ్ నుండి కాఫీ, కొండగావ్, ఛత్తీస్‌గఢ్ నుండి బస్తర్ క్రాఫ్ట్ & ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ నుండి రైస్-జీరాఫూల్లతో సహా అనేక రకాల ఉత్పత్తుల కోసం ఓడీఓపీ మరియు జీఐ ట్యాగింగ్ జరిగింది.  ట్యాగింగ్ భారతదేశంలోని వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్పత్తుల మూలాల గురించి అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడింది. ఓడీఓపీ కింద ఉన్న ఉత్పత్తులను  ఎక్కువగా వ్యాప్తి ఉన్న  ఇతర దుకాణాలు మరియు ఎంపోరియమ్‌లను నిమగ్నం చేయడం, కళాకారులు మరియు వీవర్ క్లస్టర్‌ల మనోధైర్యాన్ని పెంపొందించడం ద్వారా ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఓడీఓపీ యోచిస్తోంది.

****


(Release ID: 1902424) Visitor Counter : 202


Read this release in: English , Hindi , Marathi , Tamil