శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జియోస్పేషియల్ పాలసీ 2022ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌పై చర్చించిన కాన్ఫరెన్స్
Posted On:
24 FEB 2023 4:57PM by PIB Hyderabad
21-22 ఫిబ్రవరి 2023 మధ్య జరిగిన “జియోస్పేషియల్ పాలసీ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్” అనే రెండు రోజుల సమావేశంలో కొత్త జియోస్పేషియల్ పాలసీ అమలు మరియు దానిని జాతీయ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడం వంటి అంశాలపై నిపుణులు పలు సూచనలు చేశారు.
"భారత ప్రభుత్వంలోని అన్ని విభాగాలు జియోస్పేషియల్ టెక్నాలజీ మరియు అప్లికేషన్‌లు అవసరమయ్యే పథకాలను అన్వేషించాలి, నిర్వచించాలి మరియు గుర్తించాలి అలాగే జియోస్పేషియల్ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తదనుగుణంగా వ్యూహాన్ని రూపొందించాలి" అని కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న భూ వనరుల శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ టిర్కీ అన్నారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించబడింది.
సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా జియోస్పేషియల్ టెక్నాలజీలు ప్రజలకు శక్తిని ఇస్తాయని ఆయన తెలిపారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చెందిన బహుళ ప్రయోజనాలను పొందేందుకు ప్రజలకు కంప్యూటరైజ్డ్ మరియు సులభంగా అందుబాటులో ఉండే విధంగా భూ రికార్డులను అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు ప్రాముఖ్యతను వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా భూమికి సంబంధించిన జియో రెఫరెన్సింగ్‌ను అమలు చేస్తున్న 3వ దేశం భారతదేశం మాత్రమేనని..ఇప్పుడు 36 శాతం భూమి జియో రిఫరెన్స్ చేయబడిందని మార్చి 2024 నాటికి 100 శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ టిర్కీ తెలిపారు.
జియోస్పేషియల్ టెక్నాలజీ ఆధారిత భూ-ఆధార్ మరియు మాతృభూమి ప్రాజెక్టులు తీసుకువచ్చిన మార్పును వివరించిన శ్రీ టిర్కీ..తమ పాలనలో విప్లవ శిఖరాగ్రంలో ఉన్నామని చెప్పారు. భూ రికార్డులు, జియోస్పేషియల్ టెక్నాలజీలు మరియు అప్లికేషన్‌లు రాబోయే సంవత్సరాల్లో పాలన గురించి మాట్లాడే విధానాన్ని మారుస్తాయని చెప్పారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) జాయింట్ సెక్రటరీ మరియు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ సునీల్ కుమార్ మాట్లాడుతూ సిటిజన్ సెంట్రిక్ పాలసీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశంలోని మొత్తం భౌగోళిక పర్యావరణ వ్యవస్థను ఉద్దేశించి దానిని వాస్తవం చేయడం కోసం అందరు వాటాదారులు కలిసి పనిచేయాలని కోరారు.
ఏజీఐ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ప్రమోద్ కౌశిక్ జియోస్పేషియల్ పాలసీలో పరిశ్రమకు ఉన్న అవకాశాలను నొక్కిచెప్పారు. పాలసీ అమలులో తుది వినియోగదారులను నిమగ్నం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఇక భాగస్వామ్యాలను పంచుకోవడం మరియు నిర్మించడం కోసం వివిధ రంగాల నుండి విజ్ఞానాన్ని తీసుకురాగల బలమైన జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రాముఖ్యతను ఎఫ్‌ఐసీసీఐ జియోస్పేషియల్ టెక్ కమిటీ ఛైర్మన్ శ్రీ అగేంద్ర కుమార్ నొక్కి చెప్పారు.
జియోస్పేషియల్ వరల్డ్ సిఇఓ మరియు వ్యవస్థాపకులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సరైన నియంత్రణ యంత్రాంగం ద్వారా డేటా, వ్యూహం మరియు పొజిషనింగ్ ద్వారా జియోస్పేషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడంలో పెట్టుబడి పెట్టడమే ముందున్న మార్గమని అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ప్రభుత్వ విభాగాలు నాయకత్వాన్ని అందించడంలో మరియు ఇతర రంగాలు మరియు పరిశ్రమలకు చేయూత అందించడంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రభుత్వ రంగాలు మరియు పరిశ్రమల రంగాల నుండి పాల్గొన్న ప్రతినిధులు జియోస్పేషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌లు, సస్టెయినబుల్ వాటర్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం, కెపాసిటీ బిల్డింగ్ మరియు హై-ఎండ్ జియోస్పేషియల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ప్రణాళికలను రెండు రోజుల సమావేశంలో చర్చించారు.
<><><><><>
(Release ID: 1902306)
Visitor Counter : 159