రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌లో ఈపీసీ మోడ్‌లో రూ.410.83 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టును ఆమోదించిన శ్రీ నితిన్ గడ్కరీ

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2023 5:00PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ వర్ధమాన్ జిల్లాలో గల ఎన్‌హెచ్‌-14లో (పాత ఎన్‌హెచ్‌-60) 5.261 కి.మీ పొడవుతో 4 లైన్ల రాణిగంజ్ బైపాస్ నిర్మాణానికి  రూ. 410.83 కోట్లతో ఈపిసి (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌) విధానంలో నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.

ఎన్‌హెచ్‌ 14 రహదారి ఎన్‌హెచ్‌-12 జంక్షన్‌ నుండి (పాత ఎన్‌హెచ్‌ 34) మోర్‌గ్రామ్ సమీపంలోని రాంపూర్ హాట్, సియురి, రాణిగంజ్, బంకురా, గర్బెటా మరియు సల్బానీని కలుపుతూ  పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ సమీపంలో ఎన్‌హెచ్‌-16 (పాత ఎన్‌హెచ్‌ 2)  జంక్షన్‌తో ముగుస్తుందని శ్రీ గడ్కరీ వరుస ట్వీట్లలో తెలియజేశారు.

పేవ్డ్ షోల్డర్ కాన్ఫిగరేషన్‌తో మొత్తం రహదారి రెండు లైన్లగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ కారిడార్ దక్షిణ భారత రాష్ట్రాలు ఒడిశా నుండి ఉత్తర బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల వైపు రాకపోకలు సాగించే ప్రధాన కారిడార్‌లలో ఒకటిగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ఖరగ్‌పూర్, మిడ్నాపూర్, చంద్రకోన రోడ్, గర్బెటా, బిష్ణుపూర్, బంకురా, రాణిగంజ్, పాండబేశ్వర్, దుబ్రాజ్‌పూర్, సూరి, రాంపూర్‌హాట్, నల్హతి మొదలైన అనేక ముఖ్యమైన పారిశ్రామిక, మతపరమైన & వ్యవసాయ ప్రాంతాలను ఇది కలుపుతుందని శ్రీ గడ్కరీ చెప్పారు.


 

*****


(రిలీజ్ ఐడి: 1902303) సందర్శకుల సూచీ సంఖ్య : : 179
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी