బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఏప్రిల్ 2022-జనవరి 2023 కాలంలో 16% వృద్ధితో 698.25 మిలియన్ టన్నులకు చేరుకున్న బొగ్గు ఉత్పత్తి


30% పెరిగిన క్యాప్టివ్/వాణిజ్య గనుల నుంచి ఉత్పత్తి

2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.31 బిలియన్ టన్నులకు ఉత్పత్తి చేరాలన్నది బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యం

Posted On: 24 FEB 2023 12:13PM by PIB Hyderabad

భారత దేశీయ బొగ్గు ఉత్పత్తి గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. బొగ్గు ఉత్పత్తి 2019-20లోని 730.87 ఎం.టి. (మిలియన్ టన్నులు) నుంచి 2021-22లో 778.19 ఎం.టి.లకు పెరిగింది, ఈ కాలంలో 6.47% వృద్ధి సాధ్యమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో, బొగ్గు ఉత్పత్తిలో వేగం మరింత పెరిగింది. ఏప్రిల్ 2022 నుంచి జనవరి 2023 మధ్య కాలంలో 698.25 ఎం.టి. ఉత్పత్తితో, దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తి 16% పైగా ఆకర్షణీయమైన వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఇది 601.97 ఎం.టి.లుగా ఉంది. ఇదే కాలంలో, కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) ఉత్పత్తి కూడా దాదాపు 15.23% పెరిగి 478.12 ఎం.టి.ల నుంచి 550.93 ఎం.టి.లకు చేరుకుంది. దేశీయంగా విద్యుత్ వినియోగం నిరంతరంగా పెరుగుతుడడం, బొగ్గు డిమాండ్‌ కూడా భారీగా పెరిగింది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి మన దేశం బొగ్గు దిగుమతులు కూడా చేసుకుంటోంది. ఇప్పుడు, దేశీయంగా పెరిగిన బొగ్గు ఉత్పత్తి పెరగడం వల్ల దిగుమతులు తగ్గాయి.

ఎఫ్‌వై25 నాటికి 1.31 బి.టి. (బిలియన్ టన్నులు) బొగ్గు ఉత్పత్తి, ఎఫ్‌వై30 నాటికి 1.5 బి.టి. ఉత్పత్తి లక్ష్యాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. కొత్త బొగ్గు గనులను ప్రారంభించడానికి, ప్రస్తుతం ఉన్న గనుల్లో బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వ & కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి చురుగ్గా పని చేస్తోంది. ఈ కార్యక్రమాల ఫలితంగా, క్యాప్టివ్ & వాణిజ్య బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 2022-23 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌ 2022- జనవరి 2023 కాలంలో 93.22 ఎం.టి.లకు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని 71.31 ఎం.టి.లతో పోలిస్తే ఇది 30% పైగా వృద్ధి.

 

*****(Release ID: 1902017) Visitor Counter : 124