ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
రేపు బెంగళూరులో 2వ సెమీకాన్ఇండియా ఫ్యూచర్ డిజైన్ రోడ్‌షోను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్న శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశాన్ని సెమీకండక్టర్
డిజైన్, ఇన్నోవేషన్ కోసం గ్లోబల్ హబ్‌గా స్థాపించాలన్న లక్ష్యం
భారతదేశంలో సెమీకండక్టర్ డిజైన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను
ఉత్ప్రేరకపరచడానికి సెమికాన్ ఇండియా ఫ్యూచర్‌డిజైన్
ఇండియన్ యునికార్న్స్ తదుపరి తరంగం డిఐఆర్ -వి,
సెమీకండక్టర్ స్పేస్ నుండి వస్తుంది: శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
23 FEB 2023 4:45PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం బెంగళూరులో 2వ సెమికాన్ ఇండియా ఫ్యూచర్ డిజైన్ రోడ్‌షోను ప్రారంభించనున్నారు.
భారతదేశంలోని సెమీకండక్టర్ డిజైన్ ఎకోసిస్టమ్‌లో పెట్టుబడి పెట్టడానికి స్టార్టప్‌లు, తదుపరి తరం ఇన్నోవేటర్లు, గ్లోబల్, ఇండియన్ సెమీకండక్టర్ మేజర్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు.
సెమికాన్ ఇండియా ఫ్యూచర్ డిజైన్ ప్రోగ్రామ్ వంటి ఈ స్కీమ్‌ల ద్వారా నెక్స్ట్‌జెన్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు భారతదేశంలో నిర్మాణం అవుతాయి. సహ-రూపకల్పన జరుగుతాయి అని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.ఈ సిరీస్‌లోని 1వ ఈవెంట్ గతేడాది గుజరాత్‌లోని కర్ణావతి యూనివర్సిటీలో జరిగింది. డిసెంబరు 2021లో, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం రూ.76,000 కోట్ల ప్రోత్సాహక వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించింది.
"మేము సెమికాన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థికి, ప్రతి కళాశాలకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాము. సెమికాన్ ఇండియా ప్రయాణంలో చాలా మంది యువకులను ఉత్సాహపరిచి, పాల్గొనేలా చేయాలని మేము భావిస్తున్నాము" అని మంత్రి అన్నారు. గ్లోబల్, భారతీయ పరిశ్రమల ప్రముఖులు దీనిలో పాలుపంచుకోవాలని కోరారు. యువ విద్యార్థులు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు సెమికాన్ఇండియా ఫ్యూచర్‌డిజైన్ అవకాశాన్ని పొందే అవకాశం ఉంటుంది. 2వ రోడ్‌షో సందర్భంగా, గ్లోబల్ సెమీకండక్టర్ లీడర్‌లు భారతదేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను ఉత్ప్రేరకపరిచేందుకు దృష్టి దృష్టి సారిస్తారు.
***
(Release ID: 1901878)