పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డిజీ యాత్ర ద్వారా లబ్ధి పొందిన 1.6 లక్షల మందికి పైగా విమాన ప్రయాణికులు
4.22 లక్షలు దాటిన డిజీ యాత్ర యాప్ వినియోగదార్ల సంఖ్య
మొదటి దశలో, దేశంలోని మూడు విమానాశ్రయాల్లో డిజీ యాత్ర అమలు
Posted On:
23 FEB 2023 4:42PM by PIB Hyderabad
డిజీ యాత్ర అంటే, ప్రయాణీకులు విమానాశ్రయాల్లో నిరాటంక సేవల అనుభవాన్ని పొందడానికి తీసుకువచ్చిన ముఖ గుర్తింపు ఆధారిత సాంకేతికతను ఉపయోగించే బయోమెట్రిక్ బోర్డింగ్ వ్యవస్థ. విమానాశ్రయంలోని పలు ప్రదేశాల్లో ప్రయాణీకులు తమ టిక్కెట్, ఐడీని ధృవీకరించాల్సిన అవసరాన్ని ఇది తొలగిస్తుంది, తద్వారా ప్రయాణీకులకు అంతరాయం లేని ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించి, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల ద్వారా మెరుగైన నిష్క్రమణను అనుమతిస్తుంది.
విమానాశ్రయాల్లో దశలవారీగా డిజీ యాత్రను అమలు చేస్తున్నారు. మొదటి దశలో దిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో, 01.12.2022న, కేంద్ర పౌర విమానయాన మంత్రి ప్రారంభించారు. మార్చి 2023 నాటికి కోల్‌కతా, పుణె, విజయవాడ, హైదరాబాద్ విమానాశ్రయాల్లోనూ మొదటి దశ కింద డిజీ యాత్రను అమలు చేయాలని భావిస్తున్నారు.
డిజీ యాత్ర అనేది ఒక స్వచ్ఛంద సదుపాయం. డిజీ యాత్ర ప్రక్రియలో, ప్రయాణీకుల వ్యక్తిగత సమారాన్ని నిల్వ చేయరు. ప్రయాణీకుల సమాచారం మొత్తం ఎన్‌క్రిప్ట్ అవుతుంది, వారి స్మార్ట్‌ఫోన్ వాలెట్‌లో నిల్వ ఉంటుంది. ప్రయాణీకుల డిజీ యాత్ర ఐడీ అవసమైన చోట ప్రయాణం ప్రారంభమయ్యే విమానాశ్రయంలో పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. విమాన ప్రయాణం ప్రారంభమైన 24 గంటలలోపు ఆ సమాచారం ఆ వ్యవస్థ నుంచి రద్దవుతుంది.
1 డిసెంబర్ 2022 నుంచి 14 ఫిబ్రవరి 2023 వరకు, 1.6 లక్షల మందికి పైగా ప్రయాణీకులు విమానాశ్రయాల్లో డిజీ యాత్రను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐవోఎస్ యాపిల్ స్టోర్ నుంచి డిజీ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదార్ల సంఖ్య 4.22 లక్షలు.
డిజీ యాత్రను ఉపయోగించిన ప్రయాణీకుల సంఖ్యలో పెరుగుదల:
డిజీ యాత్రను ఉపయోగించే ప్రయాణికుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది.

వారణాసి- 1 డిసెంబర్ 2022న, మొత్తం ప్రయాణీకుల్లో డిజీ యాత్ర వినియోగదారుల సంఖ్య 0.09% నుంచి 13 ఫిబ్రవరి 2023 నాటికి 28%కి పెరిగింది, ఫిబ్రవరి 2న మొత్తం వినియోగదార్లలో అత్యధికంగా 37%గా ఉంది.

న్యూదిల్లీ

బెంగళూరు

***
(Release ID: 1901876)
Visitor Counter : 229