వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 3వ ఇ-వేలంలో 5.07 ఎల్‌ఎంటి గోధుమలు వేలం వేయబడ్డాయి


ఆల్ ఇండియా వెయిటెడ్ సగటు రిజర్వ్ ధర రూ. 2138.12/క్వింటాల్, ఆల్ ఇండియా వెయిటెడ్ సగటు అమ్మకపు ధర రూ. 2172.08/క్వింటాల్‌కు స్టాక్‌లు విక్రయించబడ్డాయి

Posted On: 23 FEB 2023 4:30PM by PIB Hyderabad

 

ఒఎంఎస్ఎస్‌(డి) కింద గోధుమలను ఆఫ్‌లోడ్ చేయడానికి మూడవ ఇ-వేలం 22.02.2023న జరిగింది. దేశవ్యాప్తంగా ఎఫ్‌సిఐకి 23 ప్రాంతాలలో విస్తరించి ఉన్న 620 డిపోల నుండి స్టాక్‌లు అందించబడ్డాయి. మొత్తం 11.79 ఎల్‌ఎంటి  పరిమాణాన్ని అందించారు. 5.07 ఎల్‌ఎంటి గోధుమలు వేలం వేయబడ్డాయి.

ఆల్ ఇండియా వెయిటెడ్ సగటు రిజర్వ్ ధర రూ. 2138.12/క్వింటాల్ కాగా స్టాక్‌లు ఆల్ ఇండియా వెయిటెడ్ సగటు అమ్మకపు ధర రూ. 2172.08/క్వింటాల్‌కు విక్రయించబడ్డాయి.

విక్రయించిన మొత్తం పరిమాణంలో 1.39 ఎల్‌ఎంటి హర్యానా, పంజాబ్ మరియు మధ్యప్రదేశ్ నుండి విక్రయించబడింది. ఇక్కడ రిజర్వ్ ధర  సగటు విలువ రూ. 2135.35 /క్వింటాల్ మరియు వెయిటెడ్ సగటు అమ్మకపు ధర రూ. 2148.32/క్వింటాల్. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో (మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా కాకుండా ఇతర రాష్ట్రాలు) విక్రయించబడిన పరిమాణం 3.68 ఎల్‌ఎంటిగా ఉంది. దీనికి రిజర్వ్ ధర యొక్క వెయిటెడ్ సగటు 2139.16 /క్వింటాల్ మరియు వెయిటెడ్ సగటు అమ్మకపు ధర రూ. 2181.08/క్వింటాల్.

మొత్తంగా ధరల ట్రెండ్ మార్కెట్  రూ. 2200/క్వింటాల్ సగటుగా ఉంది. అందువల్ల గోధుమలను ఆఫ్‌లోడింగ్ చేయడం వల్ల గోధుమ ధరలో మొత్తం తగ్గింపు ఆశించిన ఫలితాలను చూపుతోంది.

మూడవ ఇ-వేలం పరిమాణాలలో 100 నుండి 499 ఎంటి వరకు గరిష్ట డిమాండ్‌ను కలిగి ఉంది, తరువాత 50-100 ఎంటి పరిమాణాలు మరియు 500-999 ఎంటి పరిమాణాలు చిన్న మరియు మధ్యస్థ పిండి మిల్లర్లు మరియు వ్యాపారులు వేలంలో చురుకుగా పాల్గొన్నట్లు సూచిస్తున్నాయి. 3000 ఎంటి గరిష్ట పరిమాణానికి ఒకేసారి 6 బిడ్‌లు మాత్రమే వచ్చాయి. మూడవ ఈ-వేలంలో మొత్తం 1269 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.

ఢిల్లీ, హర్యానా, తమిళనాడు మరియు తెలంగాణ వంటి నాలుగు రాష్ట్రాల్లో ఆఫర్ చేసిన పరిమాణంలో 100% బిడ్డర్లు కొనుగోలు చేశారు మరియు మరో ఐదు రాష్ట్రాల్లో ఆఫర్ చేసిన స్టాక్‌లలో 90% కంటే ఎక్కువ బిడ్డర్లు కొనుగోలు చేశారు.

అత్యధికంగా అమ్ముడైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రూ. 2950/క్వింటాల్ మొదటి ఈ-వేలం సమయంలో   సగటు ధర రూ. 2177/క్వింటాల్. ఇది 22 రోజుల వ్యవధిలో తగ్గింపు రూ.773/క్వింటాల్.

మూడో ఈ-వేలంలో రూ.1086.1 కోట్లు వచ్చాయి.

నాల్గవ ఇ-వేలం మార్చి 1, 2023న నిర్వహించబడుతుంది.


 

***



(Release ID: 1901872) Visitor Counter : 101