ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎఫ్‌ఎస్ఎస్ఎఐ ఆహార భద్రత మరియు ప్రమాణాలు (ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు మరియు ఆహార సంకలనాలు) రెండవ సవరణ నిబంధనలు, 2023 ద్వారా మిల్లెట్‌ల కోసం సమగ్ర ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది; 1 సెప్టెంబర్ 2023 నుండి అమలు చేయబడుతుంది


అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (ఐవైఓఎం)2023 ప్రపంచంలో ఉత్పత్తిని పెంచడానికి, సమర్థవంతమైన ప్రాసెసింగ్ మరియు పంటను ఉపయోగించుకోవడానికి మరియు ఆహార బుట్టలో మిల్లెట్‌లను ప్రధాన అంశంగా ప్రోత్సహించడానికి అవకాశాన్ని అందిస్తుంది.

Posted On: 23 FEB 2023 4:19PM by PIB Hyderabad

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆహార భద్రత మరియు ప్రమాణాలు (ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు మరియు ఆహార సంకలనాలు) రెండవ సవరణ నిబంధనలు, 2023 ప్రకారం మిల్లెట్‌ల కోసం సమగ్ర సమూహ ప్రమాణాన్ని భారత గెజిట్‌లో నోటిఫై చేసింది . అవి 1 సెప్టెంబర్ 2023 అమలు చేయబడతాయి.

మిల్లెట్లు తృణ ధాన్యాల ఆహార పంటల సమూహం. ఇవి కరువుతో పాటు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితులను బాగా తట్టుకోగలవు. ఎరువులు మరియు పురుగు మందుల వంటి రసాయన అవసరం చాలా తక్కువ. చాలా వరకు మిల్లెట్ పంటలు భారతదేశానికి చెందినవి మరియు అవి మానవ శరీరం  సాధారణ పనితీరుకు అవసరమైన చాలా పోషకాలను అందిస్తాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహితంగా ఉంటాయి; గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) లో తక్కువ; మరియు కాల్షియం, ఇనుము, భాస్వరం మొదలైన వాటితో సహా డైటరీ ఫైబర్ మరియు సూక్ష్మపోషకాలు మిల్లెట్లలో సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మిల్లెట్లు మన రోజువారీ ఆహారంలో అంతర్భాగంగా ఉండాలి.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ మార్గదర్శక గమనిక ("మిల్లెట్స్ - న్యూట్రి-తృణధాన్యాలు") పోషక కూర్పు మరియు మిల్లెట్ల వినియోగ  ప్రయోజనాల గురించి మరింత సమాచారాన్ని అందిస్తుంది.

(రిఫరెన్స్: https://www.fssai.gov.in/upload/uploadfiles/files/Guidance_Notes_Version_2_Millets_29_01_2020.pdf).

మిల్లెట్లపై అవగాహనను పెంపొందించడానికి మరియు వాటి ఉత్పత్తి మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి  2018 ఏప్రిల్‌లో మిల్లెట్‌లను "న్యూట్రి సెరియల్స్"గా రీబ్రాండ్ చేసి "2018"ని మిల్లెట్ల జాతీయ సంవత్సరంగా జరిపారు. అనంతరం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 2021లో దాని 75వ సెషన్‌లో 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (ఐవైఓఎం 2023)గా ప్రకటించింది. ఇది ప్రపంచంలో మిల్లెట్ల ఉత్పత్తిని పెంచడానికి, సమర్ధవంతమైన ప్రాసెసింగ్ మరియు పంటను  మెరుగ్గా ఉపయోగించుకోవడానికి మరియు ఆహారంలో మిల్లెట్లను ప్రధాన అంశంగా ప్రోత్సహించడానికి అవకాశాన్ని అందిస్తుంది.

ప్రస్తుతం, జొన్న (జోవర్), హోల్ మరియు డెకర్టికేటెడ్ పెర్ల్ మిల్లెట్ గ్రెయిన్(బజ్రా) ఫింగర్ మిల్లెట్ (రాగి) మరియు ఉసిరికాయ వంటి కొన్ని మిల్లెట్లకు మాత్రమే వ్యక్తిగత ప్రమాణాలు ఆహార భద్రత  ప్రమాణాలు (ఆహార ఉత్పత్తి ప్రమాణాలు మరియు ఆహార సంకలనాలు) 2011 నిబంధనలలో సూచించబడ్డాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ఇప్పుడు 15 రకాల తృణధాన్యాలకు 8 నాణ్యత పారామితులను పేర్కొంటూ సమగ్ర సమూహ ప్రమాణాన్ని రూపొందించింది. దేశీయ మరియు ప్రపంచ మార్కెట్లలో మంచి నాణ్యమైన (ప్రామాణిక) మిల్లెట్ లభ్యతను నిర్ధారించడానికి వాటిలో తేమ శాతం, యూరిక్ యాసిడ్ కంటెంట్, అదనపు పదార్థం, ఇతర తినదగిన ధాన్యాలు, లోపాలు, వీవిల్డ్ ధాన్యాలు మరియు అపరిపక్వ మరియు ముడుచుకున్న ధాన్యాలు, గరిష్ట పరిమితులను నిర్ధారించారు.

సమూహ ప్రమాణం క్రింది మిల్లెట్లకు వర్తిస్తుంది.:

 

1. అమరంథస్ (చౌలై లేదా రాజ్‌గిరా)

2. బార్న్యార్డ్ మిల్లెట్ ((సమకేచావల్ లేదా సన్వా లేదా జంగోరా)

3. బ్రౌన్ టాప్ (కోరలే)

4. బుక్వీట్ (కుట్టు)

5. క్రాబ్‌ ఫింగర్ (సికియా)

6. ఫింగర్ మిల్లెట్ (రాగి లేదా మాండువా)

7. ఫోనియో (అచా)

8. ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కంగ్ని లేదా కాకున్)

9. జాబ్స్‌ టియర్స్ (అడ్లే)

10. కోడో మిల్లెట్ (కోడో)

11. లిటిల్ మిల్లెట్ (కుట్కి)

12. పెర్ల్ మిల్లెట్ (బజ్రా)

13. ప్రోసో మిల్లెట్ (చీనా)

14. జొన్న (జోవర్)

15. టెఫ్ (లవ్‌గ్రాస్)

 

****


(Release ID: 1901759) Visitor Counter : 220


Read this release in: English , Urdu , Hindi