చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఇరవై రెండవ "లా కమిషన్ ఆఫ్ ఇండియా" పదవీకాలాన్ని 2024 ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఆమోదం తెలియజేసిన - కేంద్ర మంత్రివర్గం
Posted On:
22 FEB 2023 12:40PM by PIB Hyderabad
ఇరవై రెండవ "లా కమిషన్ ఆఫ్ ఇండియా" పదవీకాలాన్ని 2024 ఆగస్టు, 31వ తేదీ వరకు పొడిగించేందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.
"లా కమిషన్ ఆఫ్ ఇండియా" అనేది చట్టబద్ధత లేని సంస్థ, ఇది ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. ఈ కమిషన్ మొదటిసారి 1955లో ఏర్పాటైంది. ఆ తర్వాత, ఎప్పటికప్పుడు తిరిగి ఏర్పాటవుతూ ఉంది. ప్రస్తుత ఇరవై రెండవ "లా కమిషన్ ఆఫ్ ఇండియా" పదవీకాలం 2023 ఫిబ్రవరి, 20వ తేదీతో ముగుస్తుంది.
వివిధ లా కమిషన్లు దేశ చట్టాల ప్రగతిశీల అభివృద్ధికి, క్రోడీకరణకు ముఖ్యమైన సహకారాన్ని అందించగలిగాయి. ఆ విధంగా, లా కమిషన్ ఇప్పటివరకు 277 నివేదికలు సమర్పించింది.
ఇరవై రెండవ లా కమిషన్ చైర్ పర్సన్, సభ్యులు ఇటీవలే కార్యాలయంలో చేరారు. అనేక పెండింగ్ ప్రాజెక్టులు పరిశీలించి నివేదిక కోసం చేపట్టిన పని పురోగతిలో ఉంది. అందువల్ల, ఇరవై రెండవ "లా కమిషన్" పదవీకాలం 2024 ఆగస్టు, 31వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.
ఇది ఈ క్రింది విధంగా ఒకే రకమైన కూర్పును కలిగి ఉంటుంది:
- ఏ) పూర్తి కాలపు ఛైర్ పర్సన్;
- బి) నలుగురు పూర్తి కాలపు సభ్యులు (సభ్య-కార్యదర్శి తో సహా);
- సి) ఎక్స్-అఫీషియో సభ్యుడిగా న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి;
- డి) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా శాసన శాఖ కార్యదర్శి;
- ఇ) ఐదుగురికి మించకుండా పార్ట్ టైమ్ సభ్యులు.
21.02.2020 నాటి ఉత్తర్వులో పేర్కొన్న ప్రకారం, "లా కమిషన్" దాని పొడిగించిన కాలవ్యవధిలో, దిగువ పేర్కొన్న ఇతర విషయాలతో పాటు, దాని ప్రస్తుత బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటుంది: -
- ఎ) ఇకపై ఉపయోగపడని చట్టాలను గుర్తించడం, వాడుకలో లేని, అనవసరమైన చట్టాల రద్దుకు సిఫార్సు చేయడం;
- బి) ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి, రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి, అవసరమైన కొత్త చట్టాలను రూపొందించాలని సూచించడం;
(సి) చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ (చట్టపరమైన వ్యవహారాల శాఖ) ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొనే, చట్టం, న్యాయ పరిపాలనకు సంబంధించిన ఏదైనా అంశంపై ప్రభుత్వానికి దాని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం, తెలియజేయడం;
- డి) చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ (చట్టపరమైన వ్యవహారాల శాఖ) ద్వారా ప్రభుత్వం సూచించిన విధంగా ఏదైనా ఇతర దేశాలకు పరిశోధన అందించడానికి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవడం;
- ఇ) కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని సమస్యలు, విషయాలు, అధ్యయనాలు, పరిశోధనలపై ఎప్పటికప్పుడు నివేదికలను సిద్ధం చేసి సమర్పించడం, యూనియన్ లేదా ఏదైనా రాష్ట్రం ద్వారా సమర్థవంతమైన చర్యల కోసం అటువంటి నివేదికలను సిఫార్సు చేయడం;
(ఎఫ్) కాలానుగుణంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇతర విధులు నిర్వర్తించడం.
*****
(Release ID: 1901382)
Visitor Counter : 178