పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
బార్మర్ రిఫైనరీ "ఎడారికి ఆభరణం"గా మారుతుంది. ఇది రాజస్థాన్ ప్రజలకు ఉద్యోగాలు, అవకాశాలు మరియు ఆనందాన్ని తెస్తుంది: శ్రీ హర్దీప్ ఎస్ పూరి
2030 నాటికి 450 ఎంఎంటిపిఎ రిఫైనింగ్ సామర్థ్యాన్ని సాధించాలన్న ఈ ప్రాజెక్ట్ లక్ష్యం భారతదేశాన్ని నడిపిస్తుంది: శ్రీ హర్దీప్ ఎస్ పూరి
ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్ స్థానిక ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాలకు దారి తీస్తుంది
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా 2 సంవత్సరాల తీవ్రమైన ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ 60% కంటే ఎక్కువ ప్రాజెక్టు పూర్తయింది
Posted On:
21 FEB 2023 1:46PM by PIB Hyderabad
బార్మర్ రిఫైనరీ రాజస్థాన్ ప్రజలకు ఉద్యోగాలు, అవకాశాలు మరియు ఆనందాన్ని తెస్తుందని ఇది "ఎడారి ఆభరణం"గా మారుతుందని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి హెచ్‌పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ కాంప్లెక్స్‌లో నేడు విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా విజన్ ప్రకారం ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు మంత్రి పునరుద్ఘాటించారు.
ఈరోజు పచ్చపద్ర (బార్మర్)లోని హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్ కాంప్లెక్స్‌లో మాట్లాడిన కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పూరి .
రాజస్థాన్‌లోని బార్మర్‌లో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన హెచ్‌పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్) మరియు రాజస్థాన్ ప్రభుత్వం (జీఓఆర్)లకు వరుసగా 74% మరియు 26% వాటా ఉంది.
ఈ ప్రాజెక్ట్ 2008లో రూపొందించబడింది. మొదటిగా 2013లో ఆమోదించబడింది. దీనిని పునర్నిర్మించిన అనంతరం 2018 లో భారత ప్రధానమంత్రి పనులను ప్రారంభించారు.
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా 2 సంవత్సరాల తీవ్రమైన ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ 60% కంటే ఎక్కువ ప్రాజెక్టు పూర్తయింది
హెచ్ఆర్‌ఆర్‌ఎల్ రిఫైనరీ కాంప్లెక్స్ 9 ఎంఎంటిపిఎ క్రూడ్‌ను ప్రాసెస్ చేస్తుందని మరియు 2.4 మిలియన్ టన్నులకు పైగా పెట్రోకెమికల్స్‌ను ఉత్పత్తి చేస్తుందని అలాగే ఇది పెట్రోకెమికల్స్ కారణంగా దిగుమతి బిల్లును తగ్గిస్తుంది అని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ పశ్చిమ రాజస్థాన్‌కు మాత్రమే కాకుండా 2030 నాటికి 450 ఎంఎంటిపిఎ రిఫైనింగ్ సామర్థ్యాన్ని సాధించాలనే దాని దార్శనికత ఇండస్ట్రియల్ హబ్‌గా ఒక యాంకర్ పరిశ్రమగా పని చేస్తుందని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ పెట్రోకెమికల్స్ దిగుమతి ప్రత్యామ్నాయం విషయంలో భారతదేశానికి స్వావలంబనను తెస్తుందని శ్రీ పూరి తెలిపారు. ప్రస్తుత దిగుమతులు రూ.95000 కోట్లుగా ఉన్నాయని ఈ కాంప్లెక్స్ పోస్ట్ కమిషన్ దిగుమతి బిల్లును రూ.26000 కోట్లు తగ్గిస్తుందని చెప్పారు.
ఉపాధి కల్పన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి పరంగా ప్రాజెక్ట్ సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను తెలిపిన మంత్రి..ప్రాజెక్ట్ కాంప్లెక్స్ మరియు చుట్టుపక్కల సుమారు 35,000 మంది కార్మికులు ఉన్నట్టు చెప్పారు. అలాగే ఈ పరిశ్రమ ద్వారా 1,00,000 మంది కార్మికులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.
దీంతో పాటు 12వ తరగతి వరకు 600 మంది విద్యార్థులకు క్యాటరింగ్ అందించే కో-ఎడ్ స్కూల్ తెరవబడుతుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ “పాఠశాల స్థలం సేకరించబడింది. నిర్మాణ లేఅవుట్ ఖరారు చేయబడింది మరియు నిర్మాణం ప్రారంభించబడింది. ఇది డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.ఇది సమీపంలోని మొదటి పాఠశాల అవుతుంది.” అని చెప్పారు.
50 పడకల ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు శ్రీ పూరి తెలియజేశారు. ఆ మేరకు భూమిని స్వాధీనం చేసుకున్నామని డిసెంబర్ 2023 నాటికి ఆస్పత్రి పూర్తవుతుందని వెల్లడించారు.
రిఫైనరీ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెరగడం గురించి మంత్రి మాట్లాడుతూ..చుట్టుపక్కల గ్రామాలకు రోడ్ల నిర్మాణం ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరచడంలో దోహదపడుతుందని అన్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ ప్రయోజనాల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. రిఫైనరీ కాంప్లెక్స్‌లో డెమోయిసెల్లే క్రేన్ వంటి వలస పక్షులకు చిత్తడి నేల ఆవాసాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పర్యావరణానికి మేలు చేసే ఇతర పనులలో సహజ ఉపరితల నీటి వనరుల పునరుజ్జీవనం మరియు పచ్చపద్ర నుండి ఖేడ్ వరకు అవెన్యూ ప్లాంటేషన్ వంటివి ఉన్నాయి. అలాగే కాంప్లెక్స్‌లోని ఎడారి భూములను భూమిలో అధిక ఉప్పును పరిగణనలోకి తీసుకుని గ్రీన్ బెల్ట్‌గా మార్చడానికి ఏఎఫ్‌ఆర్‌ఐ అధ్యయనం చేస్తోంది. సిఫార్సులు అందిన తర్వాత డిపాజిట్ పనుల కింద అటవీ శాఖ సహకారంతో ప్లాంటేషన్‌ను చేపడతామని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల ఆదాయం పెరగడం గురించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు పెట్రోలియం రంగం యొక్క మొత్తం వార్షిక సహకారం దాదాపు రూ. 27,500 కోట్లుగా ఉంటుందని చెప్పారు. అందులో రిఫైనరీ కాంప్లెక్స్ ద్వారా రూ. 5,150 కోట్లు ఉంటుందని.. ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా సుమారు రూ. 12,250 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం వస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. నిర్మాణ దశలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పరిశ్రమ, మెకానికల్ ఫ్యాబ్రికేషన్ దుకాణాలు, మ్యాచింగ్ మరియు అసెంబ్లీ యూనిట్లు, క్రేన్లు, ట్రైలర్స్, జెసిబి మొదలైన భారీ పరికరాల సరఫరా, రవాణా మరియు ఆతిథ్య పరిశ్రమ, ఆటోమోటివ్ విడిభాగాలు మరియు సేవలు మరియు ఇసుక బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్ దుకాణాల వృద్ధికి దారి తీస్తుంది.
అలాగే చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన ఇంజెక్షన్ మౌల్డింగ్, ఫర్నిచర్‌కు సంబంధిన క్రోకరీ, స్టోరేజ్ ట్యాంకులు, బల్క్ కంటైనర్‌ల; ఆటో మోల్డింగ్, ప్యాకేజింగ్, మెడికల్ ఎక్విప్‌మెంట్ మొదలైనవి; కంటైనర్లు మొదలైన వాటి తయారీకి బ్లో మౌల్డింగ్: రోటోమోల్డింగ్: నీటి ట్యాంకులు, కంటైనర్లు; ఫిలింమ్స్, సిమెంట్ సంచులు, చుట్టే పదార్థం, అంటుకునే టేపులు టైర్లు, ఫార్మాస్యూటికల్, డిటర్జెంట్లు, పెర్ఫ్యూమ్‌లు, ఇంక్‌లు, నెయిల్ పాలిష్, పెయింట్ థిన్నర్స్ మొదలైనవి కూడా అభివృద్ధి చెందుతాయి
ఇది కెమికల్, పెట్రోకెమికల్ & ప్లాంట్ పరికరాల తయారీ వంటి ప్రధాన దిగువ పరిశ్రమల అభివృద్ధికి కూడా దారి తీస్తుంది.
హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్ రబ్బర్‌ను తయారు చేయడానికి ముడిసరుకు అయిన బుటాడిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది టైర్ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఇది ఆటోమోటివ్ పరిశ్రమకు ఊపునిస్తుంది. ప్రస్తుతం భారతదేశం దాదాపు 300 కెటిపిఏ సింథటిక్ రబ్బరును దిగుమతి చేసుకుంటోంది. కీలకమైన ముడిపదార్థమైన బుటాడిన్ లభ్యత కారణంగా సింథటిక్ రబ్బరు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఆటోమోటివ్ పరిశ్రమలో భారతదేశం అధిక వృద్ధి పథంలో ఉన్నందున ఈ విభాగంలో బుటాడిన్ ఉత్ప్రేరక పాత్ర పోషిస్తుంది.
***
(Release ID: 1901095)
Visitor Counter : 228