ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీ, ముంబయిలలో సర్వే కార్యకలాపాలను నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
प्रविष्टि तिथि:
17 FEB 2023 5:48PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను చట్టం, 1961(చట్టం)లోని సెక్షన్ 133ఏ ప్రకారం ఢిల్లీ, ముంబయిలలోని ప్రముఖ అంతర్జాతీయ మీడియా కంపెనీ గ్రూప్ సంస్థ వ్యాపార ప్రాంగణంలో ఒక సర్వే చర్య నిర్వహించారు. ఈ గ్రూపు
ఇంగ్లీష్, హిందీ అనేక ఇతర భారతీయ భాషలలో కంటెంట్ అభివృద్ధి వ్యాపారంలో నిమగ్నమై ఉంది; ప్రకటనల వాణిజ్య అమ్మకాలు, మార్కెట్ మద్దతు మొదలైన సేవలలో నిమగ్నమై ఉంది. వివిధ భారతీయ భాషలలో (ఇంగ్లీష్ కాకుండా) కంటెంట్ యొక్క గణనీయమైన వినియోగం ఉన్నప్పటికీ, గ్రూప్ సంస్థలు చూపుతున్న ఆదాయం/ లాభాలు భారతదేశంలోని కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సర్వే వెల్లడించింది. సర్వే సమయంలో.. గ్రూప్‌లోని విదేశీ సంస్థలు భారతదేశంలోని ఆదాయంగా వెల్లడించని నిర్దిష్ట చెల్లింపులపై పన్ను చెల్లించలేదని సూచించే ఆధారాలను డిపార్ట్‌మెంట్ సేకరించింది. ఈ దిశగా సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన అనేక ఆధారాలను అధికారులు సేకరించారు. సెకంటెడ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకున్నారని, దీని కోసం భారతీయ సంస్థ సంబంధిత విదేశీ సంస్థకు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించిందని సర్వే కార్యకలాపాలు వెల్లడించాయి. అటువంటివి చెల్లింపులు చేయని విత్హోల్డింగ్ పన్నుకు లోబడి ఉంటాయి. అంతేకాకుండా, బదిలీ ధర డాక్యుమెంటేషన్కు సంబంధించి సర్వే అనేక వ్యత్యాసాలు మరియు అసమానతలను కూడా వెలుగులోకి తెచ్చింది. అసెట్ మరియు రిస్క్ (ఎఫ్ఏఆర్) విశ్లేషణ స్థాయికి సంబంధించి, సరైన ఆర్మ్ లెంగ్త్ ప్రైస్ (ఎ.ఎల్.పి) మరియు ఆదాయ విభజనలో అసమానత నిర్ణయించడానికి వర్తించే పోలికలను తప్పుగా ఉపయోగించడం వంటి వ్యత్యాసాలు గుర్తించడమైంది. సర్వే ఆపరేషన్ ప్రక్రియలో ఉద్యోగుల స్టేట్మెంట్, డిజిటల్ సాక్ష్యాలు, పత్రాల ద్వారా కీలకమైన సాక్ష్యాలను వెలికితీయడం జరిగింది వీటిని తదుపరి సమయంలో పరిశీలించడం జరుగుతుంది. ప్రాథమికంగా, ఫైనాన్స్, కంటెంట్ డెవలప్మెంట్ మరియు ఇతర ఉత్పత్తి సంబంధిత కార్యకలాపాలతో అనుసంధానించబడిన కీలక ఉద్యోగుల స్టేట్మెంట్లు మాత్రమే రికార్డ్ చేయబడ్డాయి. డిపార్ట్మెంట్ కేవలం కీలకమైన సిబ్బందికి సంబంధించిన స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కోరిన పత్రాలు/ ఒప్పందాలను రూపొందించే సందర్భంలో సహా డైలటరీ వ్యూహాలు ఉపయోగించబడినట్లు గమనించబడింది. గ్రూపు అటువంటి వైఖరితో ఉన్నప్పటికీ, నిరంతర మీడియా/ ఛానల్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి సర్వే ఆపరేషన్ ఒక పద్ధతిలో నిర్వహించబడింది.
******
(रिलीज़ आईडी: 1900533)
आगंतुक पटल : 225