ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
10 కోట్లకు పైగా రోగులకు టెలిమెడిసిన్ సేవలను అందించడంలో "ఈ సంజీవని" మైలురాయి పురోగతిని ప్రశంసించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
సంజీవని లబ్ధిదారుల్లో 57 శాతం మంది మహిళలే. లబ్ధిదారుల్లో మరో 12 శాతం మంది సీనియర్ సిటిజన్లు: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
దేశవ్యాప్తంగా 1,15,234 హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు పనిచేస్తున్నాయి.
ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా టెలీ కన్సల్టేషన్ సేవలు
మరో రెండు వారాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న ఈ-సంజీవని 2.0
Posted On:
16 FEB 2023 5:14PM by PIB Hyderabad
‘‘ఈ సంజీవని దేశ ఆరోగ్య రంగంలో ఒక విప్లవం. భారత్ తన ఈహెల్త్ ప్రయాణంలో ఒక మైలురాయిని దాటింది.
10 కోట్ల మంది లబ్ధిదారులకు టెలీ కన్సల్టేషన్ సేవలను అందించడం ద్వారా భారత ప్రభుత్వ జాతీయ టెలీమెడిసిన్ ప్లాట్ఫామ్ - ఈ సంజీవని మరో మైలురాయిని నమోదు చేసింది.‘‘ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ విషయం వెల్లడించారు.
టెలీ కన్సల్టేషన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలను మరింత ప్రశంసించిన డాక్టర్ మాండవీయ, 15,731 హబ్ ల ద్వారా 115,234 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో 100.11 మిలియన్ల రోగులకు సేవలు అందించామని, టెలీమెడిసిన్ లో శిక్షణ పొందిన 2,29,057 మంది వైద్య నిపుణులు , సూపర్-స్పెషలిస్టులతో నిండిన 1,152 ఆన్లైన్ ఓపిడిలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక రోజులో 1 మిలియన్ కంటే ఎక్కువ సంప్రదింపులకు మద్దతు ఇవ్వడానికి ఈ సంజీవనిని మరింత పెంచారు, ఇప్పటివరకు, ఈ ప్లాట్ఫామ్ ఒక రోజులో 5,10,702 రోగులకు సేవలందించే స్థాయికి చేరుకుంది.
ఈ రోజు పోస్ట్ చేసిన ట్వీట్ లో
కేంద్ర మంత్రి ఇలా పేర్కొన్నారు.
దేశ పౌరులకు వారి ఇళ్ల వద్దనే నిపుణులైన వైద్యుల సలహాలు అందించడం ద్వారా నేడు 10 కోట్ల 'ఈ సంజీవని టెలీ కన్సల్టేషన్' లక్ష్యాన్ని సాధించింది:ప్రధాన మంత్రి
@NarendraModi జీ నాయకత్వంలో, దేశం డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థలో నిరంతరం బలోపేతం అవుతోంది.
"ఈ సంజీవని - నేషనల్ టెలిమెడిసిన్ సర్వీస్ ఆఫ్ ఇండియా ప్రాధమిక ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అతిపెద్ద టెలిమెడిసిన్ అమలు వ్యవస్థ. ముఖ్యంగా వైద్యం పొందడం కష్టంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ సంజీవని ఒక వరంగా రుజువైంది. అప్పటి నుండి ఇది ఆరోగ్య స్పెక్ట్రమ్ అంతటా మరింత విస్తృతమైన అనువర్తనాన్ని కనుగొంది. దేశంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మార్చింది. ఐసిటి ద్వారా, ఈ సంజీవని ఆరోగ్య సంరక్షణను ప్రజాస్వామ్యీకరించిందని సురక్షితంగా భావించవచ్చు. ఈ-సంజీవని లబ్ధిదారుల్లో 57 శాతం మంది మహిళలు, 12 శాతం మంది సీనియర్ సిటిజన్లు ఉండటం భరోసానిచ్చే అంశం. ‘‘ఈ ప్లాట్ఫామ్ జనాభాలోని మరింత బలహీనమైన వర్గాలపై తన ప్రభావం చూపుతున్నట్టు కూడా రుజువైంది. ఇది టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ గురించి ,భారతదేశంలో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ డిమాండ్లను తీర్చడానికి కాలక్రమేణా తనను తాను ఎంతవరకు పునరుద్ధరించుకుందో తెలియజేస్తుంది" అని ఆయన అన్నారు.
ఇ-సంజీవని సంప్రదింపులను గ్రాఫ్ ద్వారా చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్ (31701735), తమిళనాడు (12374281), పశ్చిమ బెంగాల్ (12311019), కర్ణాటక (11293228), ఉత్తరప్రదేశ్ (5498907), మహారాష్ట్ర (4780259), తెలంగాణ (4591028), మధ్యప్రదేశ్ (4015879), బీహార్ (3220415), గుజరాత్ (2988201) (రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పట్టిక) ఈ సంజీవనిని స్వీకరించడంలో అగ్రస్థానంలో ఉన్నాయి.
క్లౌడ్ ఆధారిత ఈ-సంజీవని ప్లాట్ఫామ్ ను రెండు మోడ్ లలో ప్రవేశపెట్టారు.
ఇ సంజీవని ఎబి-హెచ్ డబ్ల్యుసి (ప్రొవైడర్-టు-ప్రొవైడర్ టెలిమెడిసిన్ ప్లాట్ ఫామ్): హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో ఆరోగ్య కార్యకర్తలు ,వైద్య అధికారుల ద్వారా రోగులను ద్వితీయ / తృతీయ స్థాయి ఆరోగ్య సౌకర్యాలు లేదా వైద్య కళాశాలలలో ఏర్పాటు చేసిన హబ్ లలోని వైద్యులు ,నిపుణులతో అనుసంధానించే సహాయక టెలిమెడిసిన్ వ్యవస్థ. ఈ వేరియంట్ హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది.
ఈ సంజీవనిఓపీడీ (పేషెంట్ టు ప్రొవైడర్ టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్): స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ ల ద్వారా పౌరులు తమ ఇళ్ల నుంచి ఔట్ పేషెంట్ సేవలను పొందడానికి ఇది అవకాశం ఇస్తుంది.
గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా, ఇ-హెల్త్‌కేర్ ద్వారా మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించే ఈ సంజీవనిని 2019 నవంబర్ లో ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి మూలస్తంభంగా - సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భీమాగా, భారతదేశంలో డిజిటల్ ఆరోగ్య శకం ఆరంభం అయిందనే వాస్తవానికి ఈ సంజీవని సజీవ నిదర్శనం. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలను ఈ సంజీవని డిజిటల్ రూపంలో తీసుకువచ్చింది. ఇంతకుముందు ఎక్కడాలేని మొట్ట మొదటిదయిన ప్రభుత్వ యాజమాన్యంలోని టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్.అందరికీ ఉచితంగా కన్సల్టేషన్లు అందించడం ద్వారా భారీ జనాభాను (వైద్యులు, రోగులను) డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ చొరవ ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడానికి వీలు కల్పించింది, ఇది విధాన నిర్ణేతలకు సమర్థవంతమైన , సకాలంలో ఆరోగ్య విధానాలను తీసుకురావడానికి సహాయపడుతుంది.
కోవిడ్ 19 భారత తీరాలను తాకిన వెంటనే భారత ప్రభుత్వం టెలిమెడిసిన్ ఆచరణ మార్గదర్శకాలను విడుదల చేసిన వెంటనే, దేశంలోని మిలియన్ల మంది పౌరులకు నాన్ కోవిడ్ 19, కోవిడ్ 19 వైద్య పరిస్థితుల కోసం వైద్యులు , వైద్య నిపుణుల సలహాలను తమ ఇళ్ళ నుంచే పొందడానికి ఈ సంజీవని ఏకైక ఆశ గా మారింది. 2020 మార్చిలో మొదటి జాతీయ లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండి పనిచేస్తూ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని బృందంతో కలిసి పనిచేస్తూ, ఈ సంజీవని పేషెంట్ టు డాక్టర్ వేరియంట్ ను సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మొహాలీ శాఖలో టెలిమెడిసిన్ మార్గదర్శకులు వేగంగా అభివృద్ధి చేసి విడుదల చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ సంజీవని టెక్నాలజీ ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడం ద్వారా హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ రంగంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. డిమాండ్ పై సంరక్షణను సులభతరం చేయడం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ప్రత్యక్ష ప్రయోజనంతో పాటు, భారతదేశం అంతటా జనాభాకు సమానమైన, నాణ్యమైన సంరక్షణను అందించడానికి భౌగోళిక, ప్రాప్యత, ఖర్చు దూరం వంటి సవాళ్లను ఈ సంజీవని విజయవంతంగా అధిగమిస్తుంది. ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు వేగవంతమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ సంజీవని ఒక కొలమానంగా నిరూపించబడింది.
దేశంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మద్దతు ఇవ్వడానికి అవసరమైన పునాదిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు ఈ సంజీవని శ్రీకారం చుడుతోంది. ఈ కార్యక్రమం విజయం డిజిటల్ ఇండియా మిషన్ ప్రభావం, విజయానికి సమానంగా ఉంటుంది.
టెలీ కన్సల్టేషన్ ల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సంజీవని కొత్త రూపం లో టెలిడయాగ్నోసిస్ తార్కిక తదుపరి కోణాన్ని జోడించడానికి సిద్ధంగా ఉంది. నియర్ పేషెంట్ టెస్టింగ్ అని కూడా పిలువబడే విస్తారమైన స్పెక్ట్రమ్ పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్ పరికరాల (పిఒసిడి) అంతరాయం లేని ఏకీకరణ దీనికి అవసరం. వేగవంతమైన రోగ నిర్ధారణ , శీఘ్ర నిర్ణయాలను సులభతరం చేయడం ద్వారా పిఒసిడిలు అక్కడ పరీక్ష తీసుకున్న నిమిషాల్లో శారీరక
ప్రామాణీకాలతో సహా వివిధ క్లినికల్ పరీక్షల ఫలితాలను అందిస్తాయి.
టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా కొత్త ఫీచర్లతో టెలిమెడిసిన్ అనుభవాన్ని ఈ సంజీవని 2.0 మరింత మెరుగుపరుస్తుంది. ఆర్కిటెక్చర్ ఇప్పుడు మరింత సురక్షితంగా ఉంది, అదే సమయంలో అదనపు డిమాండ్లను చేపట్టడానికి కొలవదగినది.
పట్టిక (ఈ సంజీవని సంప్రదింపులు - రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలవారీగా)
ఈ సంజీవని సంప్రదింపులు
వరస నెం.
|
16.02.2023
|
మొత్తం
(హెచ్ డబ్ల్యూ సి అండ్ ఒ పి డి)
|
ఇ సంజీవని
ఏ బి_హెచ్ డబ్ల్యూ సి
|
ఇ సంజీవని
ఒ పి డి
|
|
ఇండియా
|
10,01,17,675
|
9,04,18,022
|
96,99,653
|
1.
|
ఆంధ్రప్రదేశ్
|
31701735
|
31668610
|
33125
|
2.
|
తమిళనాడు
|
12374281
|
10627311
|
1746970
|
3.
|
పశ్చిమ బెంగాల్
|
12311019
|
12300222
|
10797
|
4.
|
కర్ణాటక
|
11293228
|
8171744
|
3121484
|
5.
|
ఉత్తరప్రదేశ్
|
5498907
|
3719931
|
1778976
|
6.
|
మహారాష్ట్ర
|
4780259
|
4582456
|
197803
|
7.
|
తెలంగాణ
|
4591028
|
4572269
|
18759
|
8.
|
మధ్యప్రదేశ్
|
4015879
|
4009244
|
6635
|
9.
|
బీహార్
|
3220415
|
3154283
|
66132
|
10.
|
గుజరాత్
|
2988201
|
2030465
|
957736
|
11.
|
అస్సాం
|
1066556
|
1036412
|
30144
|
12.
|
ఛత్తీస్ ఘడ్
|
934758
|
933651
|
1107
|
13.
|
ఉత్తరాఖండ్
|
910672
|
163045
|
747627
|
14..
|
ఒడిశా
|
710516
|
710139
|
377
|
15.
|
రాజస్థాన్
|
682518
|
579341
|
103177
|
16.
|
కేరళ
|
654574
|
178141
|
476433
|
17.
|
జార్ఖండ్
|
644597
|
631929
|
12668
|
18.
|
జమ్ము కాశ్మీర్
|
382588
|
356204
|
143283
|
19.
|
పంజాబ్
|
360455
|
356204
|
4251
|
20.
|
హర్యానా
|
359580
|
189717
|
169863
|
21.
|
హిమాచల్ ప్రదేశ్
|
286097
|
280910
|
5187
|
22.
|
మేఘాలయ
|
75538
|
75524
|
14
|
23.
|
డి ఎన్ హెచ్ అండ్ డి డి
|
74162
|
74099
|
63
|
***
(Release ID: 1900001)
Visitor Counter : 213