ఉక్కు మంత్రిత్వ శాఖ

2030 నాటికి 300 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తిపై దృష్టి సారించిన భారత్


: కేంద్ర ఉక్కు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

- తుప్పు పట్టని ఉక్కు ఉత్పత్తి విషయమై భారతీయ రైల్వేలు మరియు సెయిల్ కలిసి పనిచేస్తున్నాయి: మంత్రి

Posted On: 16 FEB 2023 6:46PM by PIB Hyderabad

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జింక్ ఉత్పత్తి విషయంలో భారతదేశం నాల్గో అతిపెద్ద దేశంగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన జింక్‌లో 80 శాతం  దేశీయంగా వినియోగిస్తున్నట్లు ఆయ వివరించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన నాల్గో గ్లోబల్ జింక్ సమ్మిట్ -2023లో శ్రీ సింధియా పాల్గొని ప్రసంగించారు.  తుప్పు పట్టని ఉక్కును ఉత్పత్తి చేసేందుకు ఇండియన్ రైల్వేస్ మరియు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కలిసి పనిచేస్తున్నాయని మంత్రి శ్రీ సింధియా పేర్కొన్నారు. ఉక్కు ఉత్పత్తులలో ఆక్సీకరణను నిరోధించడానికి యాంటీ తుప్పు లక్షణాలు మరియు మంచి నాణ్యతను నిలిపే అంశాల కారణంగా జింక్  విపరీతమైన మార్కెటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన వివరించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రామీణ విద్యుదీకరణ, స్మార్ట్ నగరాల్లో నిర్మాణాన్ని గాల్వనైజ్ చేయడం మొదలైన రంగాలలో జింక్ లోహం విపరీతమైన మార్కెటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని  మంత్రి వివరించారు. భారతదేశ ఉక్కు రంగం సాధించిన కీలకమైన పురోగతిని స్పృశిస్తూ, ఇప్పుడున్న 150 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంను 2030 నాటికి సంవత్సరానికి 300 మిలియన్ టన్నులకు రెట్టింపు చేయనున్నట్లు మంత్రి శ్రీ సింధియా తెలిపారు. భారత్ ఈ దిశగా దృష్టి సారించిందని వివరించారు.  భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించిందని తెలిపారు. గత తొమ్మిదేళ్లలో మన తలసరి ఉక్కు వినియోగం 57 కిలోల నుండి 78 కిలోలకు పెరిగిందని శ్రీ సింధియా చెప్పారు. స్పెషాలిటీ స్టీల్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) కింద దాదాపు 26 కంపెనీల నుంచి 54 దరఖాస్తులు అందినట్లుగా మంత్రి తెలిపారు. భారతదేశంలో స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తిని పెంచడానికి రూ.6,322 కోట్ల పీఎల్‌ఐ స్కీమ్‌ను జూలై 2021లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

పీఎల్ఐ సంవత్సరానికి 26 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, 55,000 మందికి ఉపాధి కల్పనతో రూ. 30,000 కోట్ల పెట్టుబడికి సహాయపడుతుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల భారీ క్యాపెక్స్‌ను ప్రకటించిందని, ఇది ఆయ రంగాల్లో అద్భుత పెట్టుబడి అవకాశాలను తెరిచిందని మంత్రి తెలిపారు. 2030 నాటికి నికర సున్నా కర్బన ఉద్గార విధానంపై  ప్రధా నమంత్రి నిబద్ధతను ఎత్తిచూపుతూ, ఉక్కు మంత్రి ఇలా అన్నారు, “మనం పర్యావరణంతో సహజీవనం చేయడం నేర్చుకోవాలి, పర్యావరణాన్ని గౌరవించడం నేర్చుకోవాలి, ఇకపై టేక్, మేక్ అనే సరళ నమూనా ఉండదు… పారవేయండి. రీసైక్లింగ్ మన అస్తిత్వంలో ఒక భాగం కావాలి” అని మంత్రి తెలిపారు.  ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాజు బిస్తా, హెచ్.జెడ్.ఏ సంస్థ సీఈఓశ్రీ అరుణ్ మిశ్రా, ఐజెడ్ఏ ఈడీ డాక్టర్ ఆండ్రూ గ్రీన్ మరియు ఐరోపా, అమెరికా మరియు ఆసియా దేశాల నుండి తరలి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

*****



(Release ID: 1899999) Visitor Counter : 159


Read this release in: English , Urdu , Hindi