సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
2019, 2020 మరియు 2021 సంవత్సరాల్లో తమ ప్రదర్శనలతో యువ ప్రతిభావంతులుగా గుర్తింపు పొందిన భారతదేశంలోని 102 మంది (మూడు ఉమ్మడి అవార్డులతో సహా) కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను ప్రదానం చేసిన శ్రీ జి. కిషన్ రెడ్డి
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ (యుబికెవైపి) దేశంలోని యువతను సంప్రదాయ చరిత్ర వైపు ఆకర్షిస్తుంది: శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
16 FEB 2023 7:26PM by PIB Hyderabad
ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌లో గల మేఘదూత్ థియేటర్ కాంప్లెక్స్‌లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ (యుబికెవైపి) 2019, 2020 మరియు 2021ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు డోనర్ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రదానం చేశారు. సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యా పురేచా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
సంగీత నాటక అకాడమీ, సంగీతం, నృత్యం మరియు నాటక జాతీయ అకాడమీ దేశంలోని ప్రదర్శన కళలకు సంబంధించిన అత్యున్నత సంస్థ. న్యూఢిల్లీలో 8 నవంబర్ 2022న జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో 102 మంది కళాకారులను (మూడు ఉమ్మడి అవార్డులతో సహా) ఎంపిక చేసింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2019, 2020 మరియు 2021 కోసం తమ ప్రదర్శన కళలలో తమ రంగాలలో యువ ప్రతిభావంతులుగా దేశవ్యాప్తంగా వీరు ముద్ర వేశారు. 14 నుండి 17 ఫిబ్రవరి 2023 వరకు సంగీతం, నృత్యం మరియు నాటకాలపై నాలుగు రోజుల ఉత్సవం జరుగుతుంది. న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌లో గల మేఘదూత్ థియేటర్ కాంప్లెక్స్‌లో 2019 సంవత్సరానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీతలను ప్రదర్శిస్తోంది.
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించబడిన కళాకారులకు శ్రీ జి. కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. కళలను ప్రోత్సహించడం, ప్రోత్సాహం అందించడం దేశ సంప్రదాయమని ఆయన అన్నారు. భారతదేశం నుండి కళను విడదీయలేమని చెప్పారు. కళాకారులు తమ కళలను రేపటి తరానికి తీసుకెళ్లేందుకు గొప్పగా కృషి చేస్తారని కేంద్ర మంత్రి అన్నారు.
దేశంలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన 19 మంది కళాకారులు ఈ ప్రాంతపు మారిన పరిస్థితులను తెలియజేసే అవార్డును గెలుచుకున్న విషయాన్ని ఆయన మరింత హైలైట్ చేశారు. ఈ అవార్డు కళాకారులందరినీ ప్రోత్సహించడమే కాకుండా సంప్రదాయ చరిత్ర, కళల వైపు యువతను ఆకర్షిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు.
ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం, 40 సంవత్సరాల వయస్సు వరకు కళాకారులకు ఇవ్వబడుతుంది. ఇది విభిన్న ప్రదర్శన కళల రంగాలలో అత్యుత్తమ యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం మరియు వారి జీవిత ప్రారంభంలో వారికి జాతీయ గుర్తింపును అందించాలనే లక్ష్యంతో 2006 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. తద్వారా వారు ఎంచుకున్న రంగాలలో ఎక్కువ నిబద్ధత మరియు అంకితభావంతో పని చేయవచ్చు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం కింద రూ. 25,000/- (రూ. ఇరవై ఐదు వేలు), ఒక అంగవస్త్రం మరియు ఫలకాన్ని అందిస్తారు.
*****
(Release ID: 1899997)
Visitor Counter : 210