భారత పోటీ ప్రోత్సాహక సంఘం
జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, అనుబంధ సంస్థల నుంచి నిర్దిష్ట ఆస్తులను దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం
Posted On:
15 FEB 2023 7:09PM by PIB Hyderabad
జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు (అమ్మకందారు) చెందిన క్లింకర్, సిమెంట్, విద్యుత్ కేంద్రాన్ని దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ (కొనుగోలుదారు) కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.
దాల్మియా భారత్ లిమిటెడ్ (డీబీఎల్) పూర్తి యాజమాన్యంలో పని చేస్తున్న అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్. దాల్మియా భారత్ లిమిటెడ్ గత 80 సంవత్సరాలుగా సిమెంట్ తయారీ & విక్రయ వ్యాపారం చేస్తోంది. దాల్మియా భారత్ గ్రూప్ (కొనుగోలుదారు గ్రూప్) మొత్తానికి డీబీఎల్ అంతిమ మాతృ సంస్థ. ఇది, (నేరుగా & తన నియంత్రణలో ఉన్న సంస్థల ద్వారా) ప్రధానంగా (i) సిమెంట్ తయారీ & అమ్మకం (ii) చక్కెర తయారీ & అమ్మకం (iii) ఫ్యాక్టరీ మరమ్మతుల సేవలు వంటి విభాగాల్లో వ్యాపారం చేస్తోంది.
అమ్ముడవుతున్న నిర్దిష్ట ఆస్తులు భారతదేశంలో క్లింకర్ తయారీ & అమ్మకంలో ఉన్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గ్రే సిమెంట్ తయారీ & అమ్మకం, సొంత అవసరాలకు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.
సీసీఐ వివరణాత్మక ఆదేశం రావలసివుంది.
(Release ID: 1899923)
Visitor Counter : 145