ఉప రాష్ట్రపతి సచివాలయం
ఉపరాష్ట్రపతిని కలిసిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ప్రొబేషనర్లు
భారతదేశ అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రచురితమవుతున్న కల్పిత కథనాలను నివారించాలి - ఉపరాష్ట్రపతి
'సమాచారాన్ని డంపింగ్ చేయడం దండయాత్రకు మరొక మార్గం' - ఉపరాష్ట్రపతి
Posted On:
15 FEB 2023 4:35PM by PIB Hyderabad
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్ ) ప్రొబేషనర్ల బృందం ఈరోజు ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ఖర్ ను ఆయన నివాసగృహంలో మర్యాదపూర్వకంగా కలిసింది. అధికారులతో మాట్లాడిన ఉపరాష్ట్రపతి "ప్రజాస్వామ్యం, జాతీయవాదానికి నిజమైన రక్షకులుగా" విధులు నిర్వహించాలని సూచించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అరికట్టడం, వ్యాక్సిన్ పట్ల అపోహలు తొలగించడంలో ఐఐఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని అన్నారు.క్షణాల్లో సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని శిక్షణలో ఉన్న యువ అధికారులకు సూచించారు.
శ్రీ ధంఖర్ అవకాశాలు, పెట్టుబడులకు భారతదేశం గమ్యస్థానంగా మారిందన్నారు. అవకాశాలను మరింత మెరుగు పరిచే అంశంలో సమాచారం కీలక పాత వహిస్తుందన్నారు. . 'సమాచారాన్ని డంపింగ్ చేయడం దండయాత్రకు మరొక మార్గంగా మారింది' అని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. దీనిని అరికట్టేందుకు సాహసోపేతమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశం సాధిస్తున్న వృద్ధిని తగ్గించి చూపడానికి కల్పిత కథనాలు ప్రచురితం అవుతున్నాయని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. కల్పిత కథనాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. సమస్యలపై ఆలస్యం చేయకుండా తక్షణం స్పందిస్తూ విధులు నిర్వర్తించాలని అధికారులకు ఆయన సలహా ఇచ్చారు.
సెంట్రల్ గ్రూప్ 'A' సర్వీస్ గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రచార అధికారులుగా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారులు పని చేస్తారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ వివిధ ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా, విస్తృతంగా ప్రజలకు తెలియజేయడం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య సమాచార సారథులుగా వ్యవహరిస్తారు.
ఉపరాష్ట్రపతిని కలిసిన బృందంలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ గుప్తా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ఐఐఎంసీ డిజి ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది, 2020, 2021, 2022 బ్యాచ్లకు చెందిన ఐఐఎస్ ఆఫీసర్ ట్రైనీలు మరియు సీనియర్ అధికారులు ఉన్నారు.
*****
(Release ID: 1899708)